కంటెంట్‌కు వెళ్లండి

Psalms గురించి బైబిల్ వచనాలు

896 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన. దేవా, మీరు నా దేవుడు, నేను ఆశగా మిమ్మల్ని వెదకుతున్నాను; నీరు లేక ఎండిపోయి పొడిగా ఉన్న దేశంలో, నేను మీ కోసం దప్పిగొన్నాను, నా శరీరమంతా మీ కోసం ఆశపడుతుంది.

  2. పరిశుద్ధాలయంలో నేను మిమ్మల్ని చూశాను. మీ ఘనతా మహిమను తేరి చూశాను

  3. మీ మారని ప్రేమ జీవం కంటే ఉత్తమం నా పెదవులు మిమ్మల్ని స్తుతిస్తాయి.

  4. నా జీవితకాలమంతా నేను మిమ్మల్ని స్తుతిస్తాను. మీ పేరును బట్టి నా చేతులు ఎత్తుతాను.

  5. శ్రేష్ఠమైన ఆహారం దొరికినట్లు నేను సంతృప్తి పొందుతాను; సంతోషించే పెదవులతో నా నోరు మిమ్మల్ని స్తుతిస్తుంది.

  6. పడక మీద నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను; రాత్రి జాముల్లో నేను మీ గురించి ఆలోచిస్తాను.

  7. మీరు నాకు సహాయం కాబట్టి మీ రెక్కల నీడలో నేను ఆనందంతో పాడతాను.

  8. నేను మీకు అంటిపెట్టుకుని ఉంటాను; మీ కుడిచేయి నన్ను ఆదుకుంటుంది.

  9. నన్ను ఎవరు చంపాలని చూస్తారో వారే నాశనం అవుతారు; వారు భూమి అగాధ స్థలాలకు దిగిపోతారు.

  10. వారు ఖడ్గానికి అప్పగించబడి నక్కలకు ఆహారం అవుతారు.

  11. కాని రాజు దేవునియందే ఆనందిస్తాడు; దేవుని మీద ప్రమాణం చేసే వారందరు ఆయనయందు అతిశయిస్తారు. కాని అబద్ధికుల నోళ్ళు మౌనంగా ఉంటాయి.

  12. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. నా దేవా, నా ఫిర్యాదు వినండి; శత్రువు భయం నుండి నా జీవితాన్ని కాపాడండి.

  13. దుష్టుల కుట్ర నుండి, కీడుచేసేవారి పన్నాగాల నుండి నన్ను దాచండి.

  14. వారు తమ నాలుకలను ఖడ్గాల్లా పదునుపెడతారు మరణకరమైన బాణాల వంటి క్రూరమైన పదాలను లక్ష్యంగా చేసుకుంటారు.

  15. చాటున ఉండి నిర్దోషుల మీదికి బాణాలు విసురుతారు. వారు భయం లేకుండా, అకస్మాత్తుగా బాణాలు విసురుతారు.

  16. కీడు తలపెట్టడంలో వారు ఒకరినొకరు ప్రోత్సహిస్తారు. వారు తమ వలలను దాచడం గురించి మాట్లాడతారు; వారంటారు, “దీన్ని ఎవరు చూస్తారు?”

  17. వారు అన్యాయాలను రూపొందించి అంటారు, “మేము ఒక సంపూర్ణ ప్రణాళికను రూపొందించాము!” నిశ్చయంగా మానవుల మనస్సు హృదయం మోసపూరితమైనవి.

  18. కాని, దేవుడు తన బాణాలను వాళ్ళ మీదికి విసురుతారు; వారు అకస్మాత్తుగా కొట్టబడతారు.

  19. ఆయన వారి సొంత నాలుకలను వారికే వ్యతిరేకంగా మార్చి వారిని పతనానికి తెస్తారు; వారిని చూసేవారందరూ ఎగతాళిగా తలాడిస్తారు.

  20. మనుష్యులందరు భయపడతారు; దేవుడు చేసిన క్రియలను వారు ప్రకటిస్తారు ఆయన చేసిన దానిని గ్రహిస్తారు.

  21. నీతిమంతులు యెహోవాయందు ఆనందించుదురు గాక. ఆయననే ఆశ్రయించెదరు గాక. యథార్థ హృదయులను ఆయన ఘనపరచుదురు గాక!

  22. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. ఒక గీతము. మా దేవా, సీయోనులో మీరు స్తుతికి యోగ్యులు; మా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాము.

  23. మీరు ప్రార్థనకు జవాబు ఇచ్చేవారు, ప్రజలందరు మీ దగ్గరకే వస్తారు.

  24. మేము పాపాల్లో మునిగి ఉన్నప్పుడు, మీరు మా అతిక్రమాలను క్షమించారు.

  25. మీ ఆవరణాల్లో నివసించడానికి మీరు ఎన్నుకుని మీ దగ్గరకు తెచ్చుకున్న వారు ధన్యులు! మీ పరిశుద్ధ మందిరం యొక్క, మీ గృహంలోని ఆశీర్వాదాలతో మేము తృప్తిచెందుతాం.