కంటెంట్‌కు వెళ్లండి

Psalms గురించి బైబిల్ వచనాలు

896 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీరు భీకరమైన నీతి క్రియలతో మాకు జవాబు ఇస్తారు, దేవా మా రక్షకా, భూదిగంతాలన్నిటికి సుదూర సముద్రాలకు మీరే నిరీక్షణ.

  2. బలమును ఆయుధంగా ధరించుకొని, మీరు మీ మహాశక్తితో పర్వతాలను సృజించారు.

  3. సముద్రం యొక్క హోరును, అలల యొక్క ఘోషను దేశాల్లోని కలకలాన్ని నిమ్మళం చేసేవారు ఆయనే.

  4. భూదిగంతాలలో నివసించే వారందరు మీ అద్భుతాలకు భయంతో నిండి ఉన్నారు; ఉదయం సాయంత్రాలను మీరు ఆనందంతో కేకలు వేసేలా చేస్తారు.

  5. మీరు భూమిని గమనించి నీరు పోస్తారు; మీరు దానిని సమృద్ధిగా సుసంపన్నం చేస్తారు. ప్రజలకు ధాన్యాన్ని అందించడానికి దేవుని ప్రవాహాలు నీటితో నిండి ఉన్నాయి ఎందుకంటే దానిని మీరు అలా నియమించారు.

  6. మీరు దున్నిన భూమిని వర్షంతో తడిపి, గడ్డలను కరిగించి, గట్లు సమం చేస్తారు. మీరు వానజల్లులతో భూమిని మృదువుగా చేసి, దాని పంటలను ఆశీర్వదిస్తారు.

  7. మీరు మీ దయతో సంవత్సరానికి కిరీటం ధరింపచేస్తారు, మార్గాలు కూడ సమృద్ధితో పొంగిపోతాయి.

  8. అరణ్యం యొక్క తుక్కు భూములు పొంగిపొర్లుతాయి; కొండలు ఆనందాన్ని ధరించుకొని ఉన్నాయి.

  9. పచ్చికబయళ్లు మందల చేత కప్పబడ్డాయి లోయలు ధాన్యంతో కప్పబడి ఉన్నాయి; వారు ఆనందంతో కేక వేస్తూ పాడతారు.

  10. ప్రధాన గాయకునికి. తంతివాద్యాలతో పాడదగినది. ఒక కీర్తన. ఒక గీతము. దేవుడు మామీద దయచూపి దీవించును గాక, ఆయన ముఖం మాపై ప్రకాశించును గాక. సెలా

  11. తద్వార భూమి మీద మీ మార్గాలు దేశాలన్నిటికి మీ రక్షణ తెలుస్తాయి,

  12. దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక; సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక.

  13. దేశాలు సంతోషించి ఆనంద గానం చేయుదురు గాక, ఎందుకంటే మీరు జనులను న్యాయంగా పరిపాలిస్తారు భూమి మీద దేశాలను పాలిస్తారు. సెలా

  14. దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక; సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక.

  15. భూమి దాని పంటను ఇస్తుంది; దేవుడు, మా దేవుడు, మమ్మల్ని దీవిస్తారు.

  16. అవును, దేవుడు మనల్ని దీవించును గాక, తద్వార భూదిగంతాలలో ఉన్న ప్రజలంతా ఆయనకు భయపడుదురు గాక.

  17. సంగీత దర్శకునికి. దావీదు అభ్యర్థన కీర్తన. దేవా, నన్ను రక్షించడానికి త్వరపడండి; యెహోవా, నాకు సాయం చేయడానికి, త్వరగా రండి.

  18. నా ప్రాణం తీయాలని కోరేవారు సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; నా పతనాన్ని కోరేవారందరు అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి.

  19. నన్ను చూసి, “ఆహా! ఆహా!” అని నాతో అనేవారు సిగ్గుపడి ఆశాభంగం పొందాలి.

  20. అయితే మిమ్మల్ని వెదికేవారంతా మీలో ఆనందించి సంతోషించాలి; మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు, “యెహోవా గొప్పవాడు!” అని అనాలి.

  21. కాని నా మట్టుకైతే, నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను; దేవా! నా దగ్గరకు త్వరగా రండి, మీరే నా సహాయం, నా విమోచకుడు; యెహోవా, ఆలస్యం చేయకండి.

  22. సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగము మీద పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము. దేవా, మేము మిమ్మల్ని స్తుతిస్తాము; మీ పేరు సమీపంగా ఉన్నదని మేము మిమ్మల్ని స్తుతిస్తాం; ప్రజలు మీ అద్భుతమైన కార్యాలను గురించి చెప్పుతారు.

  23. “నేను నిర్ణీత సమయంలో; న్యాయంగా తీర్పు తీరుస్తాను.

  24. భూమి దాని ప్రజలంతా భయంతో వణికినప్పుడు, దాని స్తంభాలను గట్టిగా పట్టుకున్నది నేనే. సెలా

  25. అహంకారులతో అహంకారంగా ఉండవద్దు అని దుష్టులతో, ‘మీ కొమ్ములను ఎత్తకండి.