Skip to content

Praise గురించి బైబిల్ వచనాలు

490 వచనాలు · 106 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీ వెలుగును మీ సత్యాన్ని పంపండి; అవి నన్ను మీ పరిశుద్ధ పర్వతానికి మీ నివాసస్థలానికి నడిపిస్తాయి.

  2. అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరకు వెళ్తాను, నా ఆనందం సంతోషం కలిగించే దేవుని దగ్గరకు వెళ్తాను. దేవా! నా దేవా! వీణతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను.

  3. సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన. సర్వ దేశాల్లారా, చప్పట్లు కొట్టండి; దేవునికి ఆనందంతో కేకలు వేయండి.

  4. దేవునికి స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి; మన రాజుకు స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి.

  5. దేవుడు భూమి అంతటికి రాజు; ఆయనకు స్తుతికీర్తన పాడండి.

  6. ఒక గీతము. కోరహు కుమారుల కీర్తన. మన దేవుని పట్టణంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద యెహోవా గొప్పవాడు, అధిక స్తోత్రార్హుడు.

  7. కృతజ్ఞతార్పణలు అర్పించేవారు నన్ను ఘనపరుస్తారు, నిందారహితులకు దేవుని రక్షణ చూపిస్తాను.”

  8. ప్రభువా, నా పెదవులను తెరవండి, నా నోరు మీ స్తుతిని ప్రకటిస్తుంది.

  9. మీరు చేసిందానికి నేను ఎల్లప్పుడు మీ భక్తుల ఎదుట మిమ్మల్ని స్తుతిస్తాను. మీ నామం ఉత్తమమైనది, కాబట్టి నేను మీ నామంలో నిరీక్షణ కలిగి ఉన్నాను.

  10. దేవునిలో, ఆయన వాగ్దానాన్ని స్తుతిస్తాను, అవును, యెహోవాయందు, ఆయన వాగ్దానాన్ని కీర్తిస్తాను.

  11. నా దేవా, నేను మీకు మ్రొక్కుబడులను చెల్లించాల్సి ఉంది; నా కృతజ్ఞత అర్పణలను మీకు చెల్లిస్తాను.

  12. ఓ దేవా, నా హృదయం స్థిరంగా ఉంది, నా హృదయం స్థిరంగా ఉంది; నేను పాడతాను సంగీతం వాయిస్తాను,

  13. నా ప్రాణమా, మేలుకో! సితారా వీణా, మేలుకోండి! ఉదయాన్ని నేను మేల్కొలుపుతాను.

  14. ప్రభువా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను జనాంగాల మధ్య మీ గురించి నేను పాడతాను.

  15. మీరు నా బలం, నేను మీకు స్తుతిగానం చేస్తున్నాను; దేవా, మీరు, నా కోట, నన్ను ప్రేమించే నా దేవుడు.

  16. అప్పుడు నేను ఎడతెగక మీ నామాన్ని బట్టి స్తుతి పాడతాను దినదినం నా మ్రొక్కుబడులు నెరవేరుస్తాను.

  17. మీ మారని ప్రేమ జీవం కంటే ఉత్తమం నా పెదవులు మిమ్మల్ని స్తుతిస్తాయి.

  18. నా జీవితకాలమంతా నేను మిమ్మల్ని స్తుతిస్తాను. మీ పేరును బట్టి నా చేతులు ఎత్తుతాను.

  19. శ్రేష్ఠమైన ఆహారం దొరికినట్లు నేను సంతృప్తి పొందుతాను; సంతోషించే పెదవులతో నా నోరు మిమ్మల్ని స్తుతిస్తుంది.

  20. పడక మీద నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను; రాత్రి జాముల్లో నేను మీ గురించి ఆలోచిస్తాను.

  21. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. ఒక గీతము. మా దేవా, సీయోనులో మీరు స్తుతికి యోగ్యులు; మా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాము.

  22. సంగీత దర్శకునికి. ఒక కీర్తన. ఒక గీతము. సర్వలోకమా! ఆనందంతో దేవునికి కేకలు వేయండి!

  23. ఆయన నామాన్ని కీర్తించండి ఆయనను స్తుతించి మహిమపరచండి.

  24. సర్వ లోకం మీకు నమస్కరిస్తుంది; మీకు స్తుతి పాడతారు మీ నామాన్ని స్తుతిస్తారు.” సెలా

  25. సర్వజనులారా, మన దేవున్ని స్తుతించండి, ఆయనను స్తుతిస్తున్న ధ్వని వినబడును గాక;