కంటెంట్‌కు వెళ్లండి

Paul గురించి బైబిల్ వచనాలు

619 వచనాలు · 103 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారందరు పౌలును కౌగిలించుకుని ముద్దు పెడుతూ ఏడ్చారు.

  2. మీరు మరలా ఎన్నడు నా ముఖం చూడరు అని అతడు చెప్పిన మాట వారికి చాలా దుఃఖం కలిగించింది. ఆ తర్వాత వారు అతన్ని ఓడ వరకు సాగనంపారు.

  3. మేము ఎఫెసు సంఘ పెద్దలను విడిచిపెట్టిన తర్వాత ఓడను ఎక్కి నేరుగా కోసు వెళ్లి, మరుసటిరోజు రొదు పట్టణానికి, ఆ తర్వాత అక్కడినుండి పతర చేరుకొన్నాము.

  4. అక్కడ ఫేనీకేకు వెళ్లే ఒక ఓడను చూసి దానిలో ఎక్కి బయలుదేరాము.

  5. కుప్ర కనపడగా దాని దక్షిణ వైపు నుండి సిరియాకు వెళ్లాము. తూరు పట్టణ తీరాన మేమున్న ఓడలోని సరుకులను దించవలసి వచ్చింది.

  6. కాబట్టి మేము అక్కడి శిష్యులను కలిసి వారితో ఏడు రోజులు ఉన్నాము. నీవు యెరూషలేముకు వెళ్లవద్దని ఆత్మ ద్వారా వారు పౌలును బ్రతిమలాడారు.

  7. మేము బయలుదేరే సమయం వచ్చినప్పుడు, మేము మా ప్రయాణాన్ని కొనసాగించాము. అప్పుడు వారందరు తమ భార్యా పిల్లలతో కలిసి పట్టణం బయటి వరకు మాతో కూడా వచ్చారు, మేము అందరం సముద్రపు తీరాన మోకరించి ప్రార్థించాము.

  8. మేము ఒకరికి ఒకరం వీడ్కోలు చెప్పిన తర్వాత ఓడను ఎక్కాము, వారు తమ ఇళ్ళకు తిరిగి వెళ్లారు.

  9. మేము తూరు పట్టణం నుండి మా ప్రయాణం కొనసాగించి తొలెమాయి పట్టణంలో దిగి అక్కడ ఉన్న సహోదర సహోదరీలను పలకరించి వారితో ఒక రోజు గడిపాము.

  10. మరుసటిరోజు బయలుదేరి కైసరయ ప్రాంతానికి చేరి, మొదట్లో ఎన్నుకున్న ఏడుగురిలో ఒకడైన ఫిలిప్పు అనే సువార్తికుని ఇంట్లో ఉన్నాము.

  11. అతనికి ప్రవచన వరం కలిగిన పెళ్ళికాని నలుగురు కుమార్తెలున్నారు.

  12. మేము అక్కడ చాలా రోజులు ఉన్నప్పుడు, యూదయ ప్రాంతం నుండి అగబు అనే ప్రవక్త వచ్చాడు.

  13. అతడు మా దగ్గరకు వచ్చి, పౌలు నడికట్టును తీసుకుని దానితో తన చేతులను, కాళ్లను కట్టుకుని, “ ‘యెరూషలేములోని యూదా నాయకులు ఈ నడికట్టు కల వానిని ఈ విధంగా బంధించి యూదేతరుల చేతికి అప్పగిస్తారు’ అని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు” అని అన్నాడు.

  14. ఈ మాట విన్న తర్వాత మేము, అక్కడ కూడిన ప్రజలు పౌలును యెరూషలేముకు వెళ్లవద్దని బ్రతిమాలాము.

  15. అప్పుడు పౌలు, “ఎందుకు మీరు ఏడుస్తూ నా గుండెను బద్దలు చేస్తున్నారు? ప్రభువైన యేసు పేరు కోసం నేను బందీని అవ్వడమే కాదు యెరూషలేములో చనిపోడానికి కూడా సిద్ధంగా ఉన్నాను” అని చెప్పాడు.

  16. అతడు ఎంత చెప్పినా ఒప్పుకోలేదు కాబట్టి, “దేవుని చిత్తం జరుగును గాక” అని మౌనంగా ఉండిపోయాము.

  17. ఆ తర్వాత, మేము యెరూషలేముకు బయలుదేరాము.

  18. మేము యెరూషలేముకు చేరిన తర్వాత, సహోదరి సహోదరులు మమ్మల్ని సంతోషంగా చేర్చుకున్నారు.

  19. మరుసటిరోజు పౌలు మేము కలిసి యాకోబును చూడటానికి వెళ్లాము, అక్కడ సంఘ పెద్దలందరు ఉన్నారు.

  20. పౌలు వారిని పలకరించి, యూదేతరుల మధ్యలో తన పరిచర్య ద్వారా దేవుడు చేసిన కార్యాలన్నింటిని వివరంగా తెలియజేశాడు.

  21. వారు వాటిని విని దేవుని స్తుతించారు. ఆ తర్వాత వారు పౌలుతో, “సహోదరుడా, చూడు, యూదులలో ఎన్ని వేలమంది విశ్వసించారో, వారందరు ధర్మశాస్త్రం కోసం ఆసక్తి కలిగి ఉన్నారు.

  22. యూదేతరుల మధ్యలో నివసిస్తున్న యూదులకు వారి పిల్లలకు సున్నతి చేయించవద్దని, మన ఆచారాల ప్రకారం జీవించవద్దని, మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాలని నీవు బోధిస్తున్నావని వారు తెలియజేశారు.

  23. నీవు ఇక్కడ వచ్చావన్న సంగతి వారు ఖచ్చితంగా వింటారు.

  24. కాబట్టి మేము చెప్పినట్లు నీవు చేయాలి. అది ఏంటంటే, మాతో నలుగురు మ్రొక్కుబడి చేసుకొన్నవారు ఉన్నారు.

  25. వారిని తీసుకెళ్లి, వారి శుద్ధీకరణ సంస్కారంలో పాల్గొని, వారు తమ తల వెంట్రుకలను తీయించుకోవడానికి అయ్యే ఖర్చులను భరించు. అప్పుడు నీ గురించి తెలిసినదానిలో సత్యం లేదని, నీవు కూడా ధర్మశాస్త్రానికి లోబడే జీవిస్తున్నావని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు.