కంటెంట్‌కు వెళ్లండి

Paul గురించి బైబిల్ వచనాలు: Is released by the civil authorities on the ground of his being a Roman citizen

8 వచనాలు · 103 కోణాలు

Is released by the civil authorities on the ground of his being a Roman citizen గురించి వచనాలు

  1. మరుసటిరోజు తెల్లవారగానే న్యాయాధికారులు చెరసాల అధికారి దగ్గరకు భటులను పంపి, “ఆ మనుష్యులను విడచిపెట్టండి” అనే ఆదేశాన్ని ఇచ్చి పంపించారు.

  2. ఆ చెరసాల అధికారి పౌలుతో, “న్యాయాధికారులు మిమ్మల్ని విడిచిపెట్టమని ఆదేశించారు కాబట్టి మీరు సమాధానంగా బయలుదేరండి” అని చెప్పాడు.

  3. అయితే పౌలు ఆ భటులతో, “రోమీయులమైన మమ్మల్ని వారు న్యాయ విచారణ చేయకుండానే బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా పంపించాలని అనుకుంటున్నారా? మేము ఒప్పుకోము. వారే వచ్చి మమ్మల్ని బయటకు తీసుకెళ్లాలి” అని చెప్పాడు.

  4. ఆ అధికారులు ఈ సంగతిని న్యాయాధికారులకు తెలియజేశారు. వారు పౌలు సీలలు రోమీయులని విని భయపడ్డారు.

  5. కాబట్టి వారు వీరిని శాంతింప చేయడానికి వచ్చి, చెరసాల నుండి వారిని బయటకు తీసుకువచ్చి, పట్టణం విడిచిపొమ్మని బ్రతిమాలారు.

  6. దెబ్బల్లో చెరసాలల్లో అల్లర్లలో కష్టమైన పనిలో నిద్రలేని రాత్రుల్లో ఆకలిలో;

  7. మూడుసార్లు బెత్తాలతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, మూడుసార్లు ఓడ పగిలి శ్రమపడ్డాను. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాను.

  8. మీకు తెలిసినట్టే, మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి దౌర్జన్యాన్ని అనుభవించాం కాని మన దేవుని సహాయంతో తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్నా ధైర్యంగా ఆయన సువార్తను మీకు ప్రకటించాము.