కంటెంట్‌కు వెళ్లండి

Portius

12 వచనాలు

ఇలా కూడా పిలుస్తారు: Porcius Festus, Festus, Porcius

"Portius" కోసం వెతకండి

Portius ను ప్రస్తావించే వచనాలు

  1. రెండు సంవత్సరాల తర్వాత, ఫెలిక్స్ స్థానంలో పోర్కియస్ ఫేస్తు అధిపతిగా నియమించబడ్డాడు. అయితే ఫెలిక్స్ యూదులకు ఉపకారం చేయాలని పౌలును చెరసాలలోనే ఉంచాడు.

  2. ఫేస్తు వచ్చిన మూడు రోజుల తర్వాత తన పదవి బాధ్యతలను స్వీకరించడానికి కైసరయ పట్టణం నుండి యెరూషలేము పట్టణానికి వచ్చాడు.

  3. అందుకు ఫేస్తు, “పౌలు కైసరయలో ఉన్నాడు, నేను త్వరలో అక్కడికి వెళ్తున్నాను.

  4. ఫేస్తు యూదులకు అనుకూలంగా ఉండాలని భావిస్తూ పౌలుతో, “నీవు యెరూషలేముకు వచ్చి అక్కడ నా ముందు వీరు చేసిన ఫిర్యాదుల గురించిన విచారణకు రావడానికి సిద్ధంగా ఉన్నావా?” అని అడిగాడు.

  5. ఫేస్తు తన న్యాయసభతో కలిసి చర్చించిన అతడు, “నీవు కైసరు దగ్గర విజ్ఞప్తి చేసుకుంటానని చెప్పావు కాబట్టి నీవు కైసరు దగ్గరకే వెళ్తావు!” అని ప్రకటించాడు.

  6. కొన్ని రోజుల తర్వాత రాజైన అగ్రిప్ప అతని భార్య బెర్నీకేతో ఫేస్తును దర్శించడానికి కైసరయకు వచ్చారు.

  7. వారు అనేక రోజులు అక్కడ ఉన్నారు కాబట్టి ఫేస్తు పౌలు విషయాన్ని రాజుతో చర్చిస్తూ, “ఫెలిక్స్ విడిచిపెట్టిన ఒక ఖైదీ నా దగ్గర ఉన్నాడు.

  8. అప్పుడు అగ్రిప్ప రాజు ఫేస్తుతో, “నాకు ఆ వ్యక్తి మాటలను స్వయంగా వినాలని ఉంది” అన్నాడు. అందుకు అతడు, “రేపు మీరు వినవచ్చు” అని చెప్పాడు.

  9. అప్పుడు ఫేస్తు, “అగ్రిప్ప రాజా, ఇక్కడున్న ప్రజలారా! ఈ వ్యక్తిని చూడండి, యూదా సమాజమంత ఇతనికి వ్యతిరేకంగా యెరూషలేములోను ఇక్కడ కైసరయలోను ఫిర్యాదు చేసి, ఇతడు బ్రతకడానికి అర్హుడుకాడు అని కేకలు వేస్తున్నారు.

  10. అంతలో ఫేస్తు అతని మాటలను మధ్యలో ఆపుతూ, “పౌలు! నీకు మతిభ్రమించింది. నీ గొప్ప విద్యలు నిన్ను పిచ్చి పట్టించాయి” అని గట్టిగా అరిచాడు.

  11. అందుకు పౌలు, “ఘనత వహించిన ఫేస్తు అధిపతి, నాకు పిచ్చి పట్టలేదు. నేను చెప్పేది సత్యం సమంజసము.

  12. అప్పుడు అగ్రిప్ప రాజు ఫేస్తు అధిపతితో, “ఇతడు కైసరుకు విజ్ఞప్తి చేసుకుంటాను అనకపోతే విడుదల చేయబడి ఉండేవాడు” అని చెప్పాడు.