Skip to content

The Roman Empire గురించి బైబిల్ వచనాలు

96 వచనాలు · 42 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దాని కాళ్లు ఇనుముతో, దాని పాదాలు కొంత ఇనుము కొంత బంకమట్టితో చేయబడింది.

  2. చివరికి, ఇనుము వంటి బలమైన నాలుగవ సామ్రాజ్యం వస్తుంది. ఇనుము అన్నిటిని విరగ్గొట్టి ముక్కలుగా చేసినట్లు, ఆ రాజ్యం ఇతరులందరిని చితుకగొట్టి, విరగ్గొడుతుంది.

  3. ఆ విగ్రహ పాదాలు, కాళ్ల వేర్లు కొంత ఇనుము, కొంత బంకమట్టితో ఉన్నట్టు మీరు చూసిన విధంగా అది విభజించబడిన రాజ్యంగా ఉంటుంది; అయినా ఇనుము బంకమట్టితో కలిసి ఉన్నట్లు, దానిలో కొంత ఇనుములా బలంగా ఉంటుంది.

  4. కాళ్ల వ్రేళ్లు కొంత ఇనుము, కొంత బంకమట్టితో ఉన్నట్లు, ఆ రాజ్యం కొంత బలంగా, కొంత బలహీనంగా ఉంటుంది.

  5. ఇనుము, బంకమట్టితో కలిసినట్లు మీరు చూసినట్లే, ఆ రాజ్య ప్రజలు మిశ్రితమై ఉంటారు. అయినా ఇనుము బంకమట్టితో కలవనట్లు, వారు కూడా ఐక్యంగా ఉండలేరు.

  6. “దాని తర్వాత రాత్రివేళ నా దర్శనంలో నేను చూస్తుండగా నాలుగవ మృగం కనిపించింది. అది భయానకంగా, భయం కలిగించేదిగా, మహా శక్తి కలిగి ఉంది. దానికి పెద్ద ఇనుప పళ్లున్నాయి; అది దాని బాధితులను నలిపి మ్రింగివేసి, మిగిలిన దానిని కాళ్లక్రింద త్రొక్కేసింది. అంతకుముందు కనిపించిన మృగాల కంటే అది భిన్నమైనది, దానికి పది కొమ్ములున్నాయి.

  7. “నేను కొమ్ముల గురించి ఆలోచిస్తుండగా వాటి మధ్య నుండి మరొక చిన్న కొమ్ము పైకి వచ్చింది. మొదటి మూడు కొమ్ములు దాని ఎదుట నుండి పెరికివేయబడ్డాయి. ఈ కొమ్ముకు మనిషిలాంటి కళ్లు, గర్వంగా మాట్లాడే నోరు ఉన్నాయి.

  8. “అప్పుడు నేను ఆ నాలుగవ మృగం గురించిన భావం తెలుసుకోవాలని కోరాను. అది మిగతా మృగాలన్నిటికంటే భిన్నంగా, అతి భయంకరంగా ఉంది, దాని పళ్లు ఇనుపవి, దాని పంజా ఇత్తడిది. ఆ మృగం దాని బాధితులను నలిపి మ్రింగివేసి, మిగిలిన దానిని కాళ్లక్రింద త్రొక్కేసింది.

  9. దాని తలమీద ఉన్న పది కొమ్ముల గురించి, వాటి మధ్య నుండి లేచిన మొదట ఉన్న మూడు కొమ్ములను పడగొట్టిన చిన్న కొమ్ము గురించి కూడా తెలుసుకోవాలనుకున్నాను. అది ఇతర కొమ్ముల కంటే గంభీరంగా కనిపిస్తూ, కళ్లు, గర్వంగా మాట్లాడు నోరు గలది.

  10. నేను చూస్తుండగా, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ వారిని ఓడిస్తూ ఉంది,

  11. మహా వృద్ధుడు వచ్చి సర్వోన్నతుని పరిశుద్ధుల పక్షంగా తీర్పు చెప్పే వరకు అది అలా చేసింది. కాని సమయం వచ్చినప్పుడు వారు రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు.

  12. “అతడు ఇలా వివరించాడు: ‘నాలుగవ మృగం భూలోకంలోని నాలుగవ రాజ్యము. అది ఇతర రాజ్యాలకు భిన్నంగా ఉంటూ, సర్వ లోకాన్ని త్రొక్కుతూ, నాశనం చేస్తూ మ్రింగివేస్తుంది.

  13. పది కొమ్ములు ఈ రాజ్యంలో నుండి వచ్చే పదిమంది రాజులు. వారి తర్వాత మరో రాజు వస్తాడు, అతడు ముందున్న వారికంటే భిన్నమైనవాడు; అతడు ముగ్గురు రాజులను లోబరచుకుంటాడు.

  14. అతడు సర్వోన్నతునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఆయన పరిశుద్ధులను హింసిస్తూ, పండుగ కాలాలను, శాసనాలను మార్చే ప్రయత్నం చేస్తాడు. పరిశుద్ధులు ఒక కాలం, కాలాలు, సగం కాలం అతని చేతికి అప్పగించబడతారు.

  15. అందుకు శతాధిపతి, “ప్రభువా, నిన్ను నా ఇంటికి రప్పించుకునేంత యోగ్యత నాకు లేదు. కానీ నీవు ఒక మాట చెప్తే చాలు నా పనివాడు బాగవుతాడు.

  16. ఎందుకంటే, నేను కూడా అధికారం క్రింద ఉన్నవాడినే. నా మాటకు ఉండే అధికారం నాకు తెలుసు. నా అధికారం క్రింద సైనికులున్నారు. నేను ‘వెళ్లండి’ అంటే వెళ్తారు, ‘రండి’ అంటే వస్తారు. నా పనివాన్ని ‘ఇది చేయి’ అంటే చేస్తాడు” అని అన్నాడు.

  17. అప్పుడు పిలాతు బరబ్బను వారికి విడుదల చేశాడు. యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయడానికి అప్పగించాడు.

  18. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధిపతి భవనం లోనికి తీసుకెళ్లి, సైనికులందరిని యేసు చుట్టూ సమకూర్చారు.

  19. వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు.

  20. “మేము నిద్రపోతున్నప్పుడు, ‘రాత్రి సమయంలో యేసు శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకుపోయారు’ అని చెప్పండి.

  21. ఒకవేళ ఇది అధిపతికి తెలిసినా, మేము అతనికి చెప్పి మీకు ఏ ప్రమాదం కలుగకుండా చూస్తాము” అని వారికి మాట ఇచ్చారు.

  22. ఆ దినాల్లో రోమా రాజ్యమంతటా ప్రజా సంఖ్యను నిర్వహించాలని కైసరు ఆగస్టస్ ఆజ్ఞాపించాడు.

  23. తిబెరి కైసరు ఏలుచున్న పదిహేనవ సంవత్సరంలో, యూదయ ప్రాంతానికి అధిపతిగా పొంతి పిలాతు, గలిలయ ప్రాంతానికి చతుర్థాధిపతిగా హేరోదు, ఇతూరియా త్రకోనీతి అనే ప్రాంతాలకు చతుర్థాధిపతిగా అతని తమ్ముడైన ఫిలిప్పు అబిలేనె ప్రాంతానికి చతుర్థాధిపతిగా లుసానీయ ఉన్నారు.

  24. అన్నా కయపాల ప్రధాన యాజకత్వం కొనసాగుతున్న సమయంలో, అరణ్యంలో నివసిస్తున్న జెకర్యా కుమారుడైన యోహాను దగ్గరకు దేవుని వాక్కు వచ్చింది.

  25. పిలాతు, “అతన్ని మీరే తీసుకెళ్లి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చండి” అన్నాడు. అందుకు యూదులు, “ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు” అని అడ్డు చెప్పారు.