Skip to content

Appeal గురించి బైబిల్ వచనాలు

9 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అందుకు పౌలు, “నేను ఇప్పుడు కైసరు న్యాయసభలో నిలబడి ఉన్నాను, నన్ను విచారణ చేయవలసిన స్థలం ఇదే. నేను యూదుల పట్ల ఏ తప్పు చేయలేదని మీకు బాగా తెలుసు.

  2. ఒకవేళ, నేను మరణశిక్షకు తగిన తప్పును చేస్తే, నేను మరణశిక్షను నిరాకరించను. కానీ ఈ యూదులు నాకు వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదులలో సత్యం లేనప్పుడు, నన్ను వారికి అప్పగించే అధికారం ఎవరికి లేదు. నేను కైసరుకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను!” అని చెప్పాడు.

  3. కానీ పౌలు తాను చక్రవర్తికి విజ్ఞప్తి చేసుకుంటానని మనవి చేసినప్పుడు, నేను అతన్ని కైసరు దగ్గరకు పంపించే వరకు అతన్ని అక్కడే ఉంచమని ఆదేశించాను” అని చెప్పాడు.

  4. అప్పుడు అగ్రిప్ప రాజు ఫేస్తుతో, “నాకు ఆ వ్యక్తి మాటలను స్వయంగా వినాలని ఉంది” అన్నాడు. అందుకు అతడు, “రేపు మీరు వినవచ్చు” అని చెప్పాడు.

  5. మరుసటిరోజు అగ్రిప్ప రాజు అతని భార్య బెర్నీకే గొప్ప ఆడంబరంగా, ఉన్నత సైనికాధికారులతో పట్టణ ప్రముఖులతో కలిసి ప్రేక్షకుల గది లోనికి ప్రవేశించారు. ఫేస్తు ఆజ్ఞతో పౌలును లోపలికి తీసుకుని వచ్చారు.

  6. అప్పుడు ఫేస్తు, “అగ్రిప్ప రాజా, ఇక్కడున్న ప్రజలారా! ఈ వ్యక్తిని చూడండి, యూదా సమాజమంత ఇతనికి వ్యతిరేకంగా యెరూషలేములోను ఇక్కడ కైసరయలోను ఫిర్యాదు చేసి, ఇతడు బ్రతకడానికి అర్హుడుకాడు అని కేకలు వేస్తున్నారు.

  7. ఇతడు మరణశిక్ష పొందేంత నేరమేమి చేయలేదని నేను గ్రహించాను, కానీ ఇతడు చక్రవర్తికి విజ్ఞప్తి చేసుకుంటాను అన్నాడు కాబట్టి ఇతన్ని రోమా దేశానికి పంపించాలని నిర్ణయించాను.

  8. అయితే ఇతని గురించి చక్రవర్తికి వ్రాయడానికి ఖచ్చితమైన కారణాలు ఏమి కనబడలేదు. కాబట్టి ఈ విచారణ తర్వాత నేను వ్రాయడానికి నాకు కారణం లభిస్తుందని అతన్ని మీ అందరి ముందుకు, ముఖ్యంగా రాజైన అగ్రిప్ప ముందుకు తీసుకువచ్చాను.

  9. ఒక ఖైదీ మీద మోపిన నేరాల గురించి సరియైన వివరణ లేకుండా అతన్ని రోమాకు పంపించడం సరికాదని నేను భావిస్తున్నాను” అని వారితో చెప్పాడు.