కంటెంట్‌కు వెళ్లండి

Paul గురించి బైబిల్ వచనాలు: Persecuted by Jews, drawn before the deputy, charged with wicked lewdness; accusation dismissed; takes his leave after many days, and sails unto Syria, accompanied by Aquila and Priscilla

7 వచనాలు · 103 కోణాలు

Persecuted by Jews, drawn before the deputy, charged with wicked lewdness; accusation dismissed; takes his leave after many days, and sails unto Syria, accompanied by Aquila and Priscilla గురించి వచనాలు

  1. అకాయ ప్రాంతానికి గల్లియో అధిపతిగా ఉన్నపుడు, కొరింథీలోని యూదులందరు కలిసి పౌలు మీద దాడి చేసి, అతన్ని న్యాయస్థానానికి తీసుకుని వచ్చారు.

  2. వారు అతని మీద, “ఇతడు ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పద్ధతులతో దేవుని ఆరాధించండని ప్రజలను ఒప్పిస్తున్నాడు” అని ఫిర్యాదు చేశారు.

  3. పౌలు మాట్లాడడం ఆరంభిస్తుండగా, గల్లియో వారితో, “యూదులారా, మీరు ఒక అన్యాయం లేదా నేరానికి సంబంధించి ఫిర్యాదు చేస్తే, నేను మీ మాటలు వినడం న్యాయంగా ఉంటుంది.

  4. కాని ఇది మీ ధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు, మాటలు, పేర్ల గురించే కాబట్టి మీరే పరిష్కరించుకోండి. అలాంటి విషయాలకు నేను న్యాయాధికారిని కాను” అని వారితో చెప్పి,

  5. వారందరిని అక్కడినుండి పంపేశాడు.

  6. అప్పుడు ఆ ప్రజలందరు సమాజమందిరపు అధికారి సోస్తెనేసును పట్టుకుని న్యాయస్థానం ముందు కొట్టారు, అయినా కానీ గల్లియో దాని గురించి ఏమి పట్టించుకోలేదు.

  7. పౌలు మరికొన్ని రోజులు కొరింథీలోనే గడిపాడు. తర్వాత అక్కడి సహోదర సహోదరీల దగ్గర సెలవు తీసుకుని, అకుల ప్రిస్కిల్లతో కలిసి ఓడలో సిరియా దేశానికి వెళ్లాడు. అతడు ప్రయాణానికి ముందు తాను చేసుకొన్న మ్రొక్కుబడి ప్రకారం తన తల వెంట్రుకలను కెంక్రేయలో కత్తిరించుకున్నాడు.