Paul గురించి బైబిల్ వచనాలు: Sickness of, in Asia
Sickness of, in Asia గురించి వచనాలు
సహోదరి సహోదరులారా, ఆసియా ప్రాంతంలో మాకు ఎదురైన కష్టాల గురించి మీకు చెప్పకుండా ఉండాలని అనుకోవడం లేదు. మేము మా శక్తికి మించిన కష్టాలను అనుభవించాము. కాబట్టి మేము జీవితంపై ఆశ వదులుకున్నాము.
మాకు మరణశిక్ష విధించబడినట్లుగా భావించించాము. మేము మాపై ఆధారపడక, మృతులను కూడ పునరుత్ధానులుగా చేసిన దేవునిపై ఆధారపడడానికే అలా జరిగింది.
మరణకరమైన భయంకర ప్రమాదాల నుండి ఆయన మమ్మల్ని కాపాడారు. ఇకముందు కూడా కాపాడతారు. ఇకముందు కూడ కాపాడతాడు. ఆయన తిరిగి మమ్మల్ని కాపాడతారని ఆయనలో నిరీక్షణ కలిగి ఉన్నాము.
మీ ప్రార్థనల ద్వారా మాకు సహాయం చేస్తున్నారు, కాబట్టి వాటిలో అనేక ప్రార్థనలకు జవాబుగా దేవుడు మామీద దయ చూపినందుకు మా పక్షంగా అనేకులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు.