కంటెంట్‌కు వెళ్లండి

God గురించి బైబిల్ వచనాలు

662 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మహాజ్యోతులను నిర్మించిన దేవునికి స్తుతులు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  2. పగటిని ఏలడానికి సూర్యుని చేసింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  3. రాత్రిని యేలడానికి చంద్రుని, నక్షత్రాలను చేసిన దేవునికి స్తుతులు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  4. ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన. యెహోవా మీరు నన్ను పరిశోధించారు, మీరు నన్ను తెలుసుకొన్నారు.

  5. నేను కూర్చోవడం నేను లేవడం మీకు తెలుసు; దూరం నుండే నా తలంపులు మీరు గ్రహించగలరు.

  6. నేను బయటకు వెళ్లడాన్ని పడుకోవడాన్ని మీరు పరిశీలిస్తారు; నా మార్గాలన్నీ మీకు బాగా తెలుసు.

  7. యెహోవా, నా నాలుక మాట పలుకక ముందే, అదేమిటో మీకు పూర్తిగా తెలుసు.

  8. నా వెనుక నా ముందు మీరు చుట్టి ఉంటారు, మీ దయగల చేతిని నా మీద ఉంచుతారు.

  9. అటువంటి జ్ఞానం నా గ్రహింపుకు మించింది, నేను అందుకోలేనంత ఎత్తులో అది ఉంది.

  10. ఎవరికి యాకోబు యొక్క దేవుడు అండగా ఉంటారో, ఎవరైతే వారి దేవుడైన యెహోవాలో నిరీక్షణ కలిగి ఉంటారో, వారు ధన్యులు.

  11. ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించినవాడు ఆయనే. ఆయన ఎప్పటికీ నమ్మదగినవాడు.

  12. ఆయన భూమిని ఆజ్ఞాపిస్తారు; ఆయన శాసనం వేగంగా పరుగెత్తుకొని పోతుంది.

  13. ఆయన మంచును తెల్లని ఉన్నిలా పంపిస్తారు మంచు కణాలను బూడిదలా చెదరగొడతారు.

  14. ఆయన వడగండ్లను గులకరాళ్లలా విసిరివేస్తాడు. ఆయన పుట్టించే తీవ్రమైన చలికి ఎవరు తట్టుకోగలరు?

  15. ఆయన తన మాటను పంపుతారు, అవన్నీ కరిగిపోతాయి; గాలి వీచేటట్టు చేస్తారు, నీళ్లు పారతాయి.

  16. సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించండి. మెరిసే నక్షత్రాల్లారా, మీరంతా ఆయనను స్తుతించండి.

  17. ఉన్నత ఆకాశాల్లారా, అంతరిక్షానికి పైన ఉన్న జలాల్లారా ఆయనను స్తుతించండి.

  18. అవి యెహోవా నామాన్ని స్తుతించును గాక, ఎందుకంటే ఆయన ఆజ్ఞమేరకు అవి సృజించబడ్డాయి,

  19. ఆయన వాటిని నిత్యం నుండి నిత్యం వరకు స్థాపించారు, ఆయన ఎన్నటికీ రద్దు చేయబడని శాసనం జారీ చేశారు.

  20. కానీ నేను పిలిచినప్పుడు మీరు వినడానికి నిరాకరించినందున నేను నా చేయి చాచినప్పుడు ఎవరూ పట్టించుకోనందున,

  21. మీరు నా సలహాను లెక్కచేయనందున నా గద్దింపును అంగీకరించనందున,

  22. ఆపద మిమ్మల్ని తాకినప్పుడు నేను నవ్వుతాను; విపత్తు మిమ్మల్ని అధిగమించినప్పుడు నేను ఎగతాళి చేస్తాను,

  23. విపత్తు తుఫానులా మిమ్మల్ని అధిగమించినప్పుడు, ఆపద మిమ్మల్ని తుఫానులా ముంచినప్పుడు, మీకు బాధ ఇబ్బంది కలిగినప్పుడు నేను ఎగతాళి చేస్తాను.

  24. భూమిని, మైదానములను దేవుడు చేయక ముందు, నేల మట్టి కొంచెము కూడా సృష్టించబడక ముందు నేను పుట్టితిని.

  25. దేవుడు ఆకాశ, విశాలములను సృష్టించి ఎంతో నీటి మీద మండలమును, సృష్టించినపుడు నేను పుట్టితిని.