కంటెంట్‌కు వెళ్లండి

Church (2) గురించి బైబిల్ వచనాలు

158 వచనాలు · 7 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీరు లేచి సీయోనుపై కనికరం చూపిస్తారు, ఎందుకంటే ఆమెపై దయ చూపే సమయం వచ్చింది; నిర్ణీత సమయం వచ్చింది.

  2. దాని రాళ్లు మీ సేవకులకు ఇష్టమైనవి; దుమ్ము వారికి దయ కలిగించింది.

  3. “బందీల మూలుగులు వినడానికి మరణశిక్ష విధించబడిన వారిని విడుదల చేయడానికి, యెహోవా ఎత్తైన పరిశుద్ధాలయం నుండి క్రిందికి వంగిచూశారు, పరలోకంలో నుండి భూమిని చూశారు.”

  4. To hear the groaning of the prisoner; to loose those that are appointed to death;

  5. ఈ విధంగా ఎప్పుడైతే ప్రజలు రాజ్యాలు యెహోవాను ఆరాధించడానికి సమాజముగా కూడుతారో అప్పుడు సీయోనులో యెహోవా నామం ప్రకటించబడుతుంది యెరూషలేములో ఆయన స్తుతించబడతారు.

  6. యాత్రకీర్తన. యెహోవా సీయోను భాగ్యాలను పునరుద్ధరించినప్పుడు, మనం కలలుగన్న వారిలా ఉన్నాము.

  7. మన నోరు నవ్వుతో నింపబడింది, మన నాలుకలు సంతోషగానాలతో నిండి ఉన్నాయి. “యెహోవా వీరి కోసం గొప్పకార్యాలు చేశారు” అని ఇతర దేశాలు చెప్పుకున్నాయి.

  8. సీయోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు; మీ జీవితకాలమంతా యెరూషలేము అభివృద్ధిని చూస్తారు.

  9. మీరు మీ పిల్లల పిల్లల్ని చూస్తారు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.

  10. యెహోవా సీయోనును ఏర్పరచుకున్నారు, దానిని తన నివాస స్థలంగా ఆయన కోరుకున్నారు.

  11. “ఇది నిత్యం నాకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది; ఇక్కడ నేను సింహాసనాసీనుడనవుతాను, ఎందుకంటే నేను దీనిని కోరుకున్నాను.

  12. ఆమెను సమృద్ధి ఆహారంతో దీవిస్తాను; ఆమెలోని పేదవారిని ఆహారంతో తృప్తిపరుస్తాను.

  13. ఆమె యాజకులకు రక్షణ వస్త్రాలను ధరింపచేస్తాను, ఆమెలో నమ్మకస్థులైన ప్రజలు నిత్యం సంతోషగానం చేస్తారు.

  14. దావీదు యాత్రకీర్తన సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు! ఎంత మనోహరం!

  15. అది అహరోను తలమీద పోయబడి అతని గడ్డం మీదుగా కారుతూ, వస్త్రపు అంచు వరకు కారిన ప్రశస్తమైన తైలం వంటిది.

  16. అది సీయోను కొండలమీదికి దిగివచ్చే హెర్మోను మంచులా ఉంటుంది. యెహోవా తన ఆశీర్వాదాన్ని, జీవాన్ని కూడా నిరంతరం అక్కడ కుమ్మరిస్తారు.

  17. యాత్రకీర్తన. యెహోవా మందిరంలో రాత్రంతా సేవించే యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి.

  18. పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించండి.

  19. ఆకాశాన్ని భూమిని సృష్టించిన యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని దీవించును గాక.

  20. బబులోను నదుల దగ్గర మనం కూర్చుని సీయోను పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాము.

  21. దాని మధ్యన ఉన్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించాము.

  22. మనల్ని పట్టుకున్నవారు పాటలు పాడమని మనల్ని అడిగారు, మనల్ని బాధించినవారు సంతోష గానాలు కోరారు; “సీయోను పాటల్లో ఒకటి పాడండి” అని అన్నారు.

  23. పరాయి దేశంలో ఉండగా యెహోవా పాటలు మనం ఎలా పాడగలము?

  24. యెరూషలేమా! నేను నిన్ను మరచిపోతే, నా కుడిచేయి దాని నేర్పును మరచిపోవాలి.

  25. నేను నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే, యెరూషలేము నాకు ఎక్కువ సంతోషం కలిగించేది అని నేను భావించకపోతే నా నాలుక నా అంగిలికి అంటుకుపోవాలి.