Skip to content

Armies గురించి బైబిల్ వచనాలు

207 వచనాలు · 77 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఎవడైనా ద్రాక్షతోట వేసి దాని ఫలసాయం అనుభవించకుండా ఉన్నాడా? అలాగైతే అతడు ఇంటికి తిరిగి వెళ్లవచ్చు, లేదా అతడు యుద్ధంలో చనిపోతే అతని తోట ఫలసాయం మరొకరు అనుభవిస్తారు.

  2. ప్రధానం చేసుకుని ఇంకా పెండ్లి చేసుకోకుండా ఉన్నవాడు మీలో ఉంటే అతడు ఇంటికి వెళ్లిపోవచ్చు, అతడు ఒకవేళ యుద్ధంలో చనిపోతే మరొకడు ఆమెను పెళ్ళి చేసుకోవచ్చు.”

  3. అధిపతులు చేయవలసిన హెచ్చరికలు, “ఎవనికైనా భయాందోళనలున్నాయా? అలాగైతే ఇంటికి వెళ్లిపోవచ్చు, లేకపోతే ఆ పిరికితనం మిగతా సైనికులకు కూడా వ్యాపిస్తుంది.”

  4. అధిపతులు ప్రజలకు ఈ సందేశమిచ్చిన తర్వాత సేనాధిపతులు తమ బాధ్యతలను స్వీకరిస్తారు.

  5. యెహోషువ హాయిని పట్టుకుని పూర్తిగా నాశనం చేసి, యెరికోకు దాని రాజుకు చేసినట్లు హాయికి దాని రాజుకు చేశాడని, గిబియోను ప్రజలు ఇశ్రాయేలుతో సమాధాన ఒప్పందం చేసుకుని వారితో కలిసిపోయారని యెరూషలేము రాజైన అదోనీ-సెదెకు విన్నాడు.

  6. అతడు, అతని ప్రజలు దీని గురించి చాలా భయపడ్డారు, ఎందుకంటే గిబియోను పట్టణం రాజధానుల్లో ఒక ముఖ్యమైన పట్టణం; అది హాయి కంటే పెద్దది, దాని మనుష్యులందరు మంచి పోరాట యోధులు.

  7. కాబట్టి యెరూషలేము రాజైన అదోనీ-సెదెకు హెబ్రోను రాజైన హోహాము, యర్మూతు రాజైన పిరాము, లాకీషు రాజైన యాఫీయా, ఎగ్లోను రాజైన దెబీరులకు,

  8. “రండి గిబియోనుపై దాడి చేయడానికి నాకు సహాయం చేయండి, ఎందుకంటే గిబియోను యెహోషువతో ఇశ్రాయేలీయులతో సమాధాన ఒప్పందం చేసుకుంది” అని విన్నవించుకున్నారు.

  9. అమోరీయుల అయిదుగురు రాజులు అనగా యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను రాజులు ఒకటిగా చేరి, తమ సైనికులందరితో కలిసి వెళ్లి గిబియోనీయులతో యుద్ధం చేశారు.

  10. హాసోరు రాజు యాబీను ఈ విషయం విని, మాదోను రాజైన యోబాబుకు, షిమ్రోను, అక్షఫు రాజులకు,

  11. ఉత్తరాన కొండ సీమలో ఉన్న రాజులకు, కిన్నెరెతు సరస్సుకు దక్షిణంగా ఉన్న అరాబా లోయ ప్రాంతంలో ఉన్న రాజులకు, పడమటి దిగువ కొండ ప్రదేశాల రాజులకు, పడమర ఉన్న నఫోత్ దోరు రాజుకు,

  12. తూర్పు పడమర లోని కనానీయుల రాజులకు, అమోరీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, కొండ సీమలో ఉన్న యెబూసీయుల, మిస్పా ప్రదేశంలో హెర్మోను పర్వతం క్రింద ఉన్న హివ్వీయుల రాజులకు కబురు పంపాడు.

  13. వారు సముద్రతీరంలో ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన తమ భారీ సైన్యంతో, లెక్కలేనన్ని గుర్రాలతో రథాలతో బయలుదేరి వచ్చారు.

  14. ఈ రాజులందరూ తమ బలగాలను కలుపుకొని ఇశ్రాయేలీయులతో పోరాడడానికి మేరోము జలాల దగ్గర కలిసి మకాం వేశారు.

  15. ఇశ్రాయేలీయులు పంటలు వేసినప్పుడు మిద్యానీయులు, అమాలేకీయులు, ఇతర తూర్పున ఉండే ప్రజలు ఆ దేశం మీద దాడి చేసేవారు.

  16. వారికి ఎదురుగా గుడారాలు వేసుకుని గాజా వరకు పంటను పాడుచేసి ఇశ్రాయేలీయులకు ఒక గొర్రెను గాని, పశువును గాని, గాడిదను గాని మరి ఏ జీవిని విడిచిపెట్టలేదు.

  17. వారు తమ పశువులతో, గుడారాలతో మిడతల దండులా వచ్చారు. వారిని, వారి ఒంటెలును లెక్కించడం అసాధ్యం; భూమిని నాశనం చేయడానికి దానిని ఆక్రమించుకున్నారు.

  18. గొల్యాతు నిలబడి ఇశ్రాయేలీయుల సైన్యంతో, “మీరు వచ్చి యుద్ధం చేయడానికి ఎందుకు బారులు తీరి నిలబడ్డారు? నేను ఫిలిష్తీయుడను కానా మీరు సౌలు దాసులు కారా? మీ వైపు నుండి ఒకరిని ఎంచుకుని నాతో యుద్ధం చేయడానికి పంపండి.

  19. అతడు నాతో పోరాడి నన్ను చంపగలగితే మేము మీకు లోబడి ఉంటాం; కాని నేను అతన్ని జయించి చంపితే మీరు మాకు లోబడి మాకు సేవ చేయాలి” అన్నాడు.

  20. ఆ ఫిలిష్తీయుడు ఇంకా, “ఈ రోజు నేను ఇశ్రాయేలీయుల సైన్యానికి సవాలు విసురుతున్నాను. మీరు ఒకడిని పంపిస్తే మేమిద్దరం ఒకరితో ఒకరం పోరాడతాం” అన్నాడు.

  21. ఆ ఫిలిష్తీయుని మాటలు విని సౌలు ఇశ్రాయేలీయులందరు చాలా దిగులుపడి భయపడ్డారు.

  22. దావీదు యూదాలోని బేత్లెహేముకు చెందిన ఎఫ్రాతీయుడైన యెష్షయి కుమారుడు. యెష్షయికి ఎనిమిది మంది కుమారులు. సౌలు కాలంలో అతడు చాలా ముసలివాడు.

  23. యెష్షయి ముగ్గురు పెద్దకుమారులు సౌలుతో పాటు యుద్ధానికి వెళ్లారు. వారిలో మొదటివాడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా.

  24. దావీదు చివరివాడు. పెద్దవారైన ముగ్గురు సౌలుతో పాటు వెళ్లారు.

  25. అయితే దావీదు బేత్లెహేములో తన తండ్రి గొర్రెలు మేపడానికి, అలాగే సౌలు దగ్గరకు వెళ్లి వస్తుండేవాడు.