Skip to content

Adultery గురించి బైబిల్ వచనాలు

242 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తన ప్రాణానికి అపాయం ఉందని తెలియక, ఉరి దగ్గరకు పక్షి త్వరపడునట్లు, వాని గుండెను బాణంతో చీల్చే వరకు వాడు దాని వెంట వెళ్లాడు.

  2. బుద్ధిహీనత అనే స్త్రీ గగ్గోలు పెట్టేది; ఆమె తెలివితక్కువది దానికి ఏమీ తెలియదు.

  3. ఆ స్త్రీ తన ఇంటి వాకిటిలో కూర్చుండును, ఊరి ప్రధాన వీధుల్లో కుర్చీమీద అది కూర్చుండును,

  4. ఆ దారిలో వెళ్లు వారిని చూసి, తమ మార్గములో చక్కగా వెళ్లు వారిని చూసి,

  5. “సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది! బుద్ధిలేనివారితో అది ఇలా అంటుంది:

  6. “దొంగతనం చేసిన నీళ్లు తీపి, రహస్యంగా చేసిన భోజనం రుచి!”

  7. అయితే అక్కడ మృతులు ఉన్నారని, దాని అతిథులు పాతాళంలో ఉన్నారని వారికి కొంతవరకే తెలుసు.

  8. వ్యభిచార స్త్రీ నోరు ఒక లోతైన గుంట; యెహోవా ఉగ్రత క్రింద ఉన్నవాడు దానిలో పడతాడు.

  9. ఎందుకంటే ఒక వ్యభిచార స్త్రీ ఒక లోతైన గుంట, దారితప్పిన భార్య ఇరుకైన బావి.

  10. బందిపోటులా అది పొంచి ఉంటుంది అది అనేకమంది మనుష్యులను నమ్మకద్రోహులుగా చేస్తుంది.

  11. జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన తండ్రికి ఆనందం కలిగిస్తాడు, కానీ వేశ్యల సహచరుడు తన సంపదను నాశనం చేస్తాడు.

  12. “మూడు అద్భుతమైనవి కలవు, నాకు అర్థం కానివి నాలుగు కలవు:

  13. అవేమనగా ఆకాశాన గ్రద్ద జాడ, బండ మీద పాము జాడ, అగాధ సముద్రంలో ఓడ నడుచు జాడ, పెండ్లికాని స్త్రీతో పురుషుని జాడ.

  14. “వేశ్య యొక్క పనియు అట్టిదే; అది తిని నోరు తుడుచుకుని నేను ఏ చెడు చేయలేదు అని అంటుంది.

  15. నీ బలమును ఆడవారి కోసం ఖర్చు చేయవద్దు, రాజులను పతనము చేసేవారి కోసం నీ శక్తిని ఖర్చు చేయవద్దు.

  16. “అయితే మంత్రగత్తె పిల్లలారా! వ్యభిచారసంతానమా! వేశ్యసంతానమా! ఇక్కడకు రండి.

  17. మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? ఎవరిని చూసి వెక్కిరిస్తూ మీ నాలుక చాపుతున్నారు మీరు తిరుగుబాటుదారులు, అబద్ధికుల సంతానం కాదా?

  18. “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇచ్చి, ఆమె అతన్ని విడిచిపెట్టి మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే, అతడు మళ్ళీ ఆమె దగ్గరకు వెళ్లాలా? దేశమంతా పూర్తిగా అపవిత్రమవదా? అయితే నీవు చాలామంది ప్రేమికులతో వేశ్యగా జీవించావు, ఇప్పుడు నా దగ్గరకు తిరిగి వస్తావా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  19. “నేను నిన్ను ఎందుకు క్షమించాలి? మీ పిల్లలు నన్ను విడిచి, దేవుళ్ళు కాని దేవుళ్ళపై ప్రమాణం చేశారు. వారి అవసరాలన్నీ నేను తీర్చాను, అయినప్పటికీ వారు వ్యభిచారం చేశారు వేశ్యల ఇళ్ళకు గుమికూడారు.

  20. వారు బాగా మేపబడిన, కామంతో నిండిన మగ గుర్రాలు, ప్రతి ఒక్కరు పొరుగువాని భార్యను చూసి సకిలిస్తారు,

  21. “ ‘నీవు దొంగిలిస్తూ, హత్య చేస్తూ, వ్యభిచారం చేస్తూ, అబద్ధ ప్రమాణం, దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ, బయలుకు ధూపం వేస్తూ, నీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ,

  22. తర్వాత వచ్చి నా పేరుతో పిలువబడే ఈ మందిరంలో నా ముందు నిలబడి, “మేము క్షేమంగా ఉన్నాము” ఈ అసహ్యకరమైన వాటన్నిటిని చేయడానికి క్షేమంగా ఉన్నాము అని అంటారా?

  23. దేశమంతా వ్యభిచారులతో నిండిపోయింది; శాపం కారణంగా భూమి ఎండిపోయింది అరణ్యంలో పచ్చికబయళ్లు ఎండిపోయాయి. ప్రవక్తలు చెడు మార్గం అనుసరిస్తారు తమ అధికారాన్ని అన్యాయంగా ఉపయోగిస్తారు.

  24. వారి కారణంగా, బబులోనులో ఉన్న యూదా నుండి బందీలుగా వెళ్లిన వారందరూ, ‘సిద్కియా, అహాబులను బబులోను రాజు అగ్నిలో కాల్చివేసినట్టుగా, యెహోవా మీకు చేయును గాక’ అని శపిస్తారు.

  25. ఎందుకంటే వారు ఇశ్రాయేలులో అవమానకరమైన పనులు చేశారు; వారు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచారం చేశారు, నేను ప్రకటించని విషయాలలో వారు నా పేరిట అబద్ధాలు చెప్పారు. అది నాకు తెలుసు, నేనే దానికి సాక్షిని” అని యెహోవా తెలియజేస్తున్నారు.