Skip to content

Adultery గురించి బైబిల్ వచనాలు

242 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అలాంటివారు, పాపంతో నిండిన అన్ని రకాల దురాశలకు బానిసలైన మోసపూరిత స్త్రీల ఇళ్ళలో చొరబడి వారిని లోబరుచుకుంటారు.

  2. పెళ్ళి అందరిచేత గౌరవించబడాలి, పెళ్ళి పాన్పు శుద్ధమైనదిగా ఉండాలి, ఎందుకంటే దేవుడు వ్యభిచారులను లైంగిక అనైతికత గల వారందరిని తీర్పు తీరుస్తాడు.

  3. “వ్యభిచారం చేయకూడదు,” అని చెప్పిన దేవుడు, “మీరు హత్య చేయకూడదు” అని కూడా చెప్పారు. నీవు వ్యభిచారం చేయకపోయినా నరహత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే.

  4. ఎందుకంటే, మీరు గతకాలంలో దేవుని ఎరుగనివారిగా జీవించారు, సిగ్గుమాలిన వారై, వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా, అల్లరితో కూడిన ఆటపాటలు, అసహ్యకరమైన విగ్రహారాధనలు చేస్తూ జీవించారు.

  5. మీరు ఆ యూదేతరులతో కలిసి విచ్చలవిడిగా నిర్లక్ష్యంగా జీవించకపోవడం చూసి వారు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తున్నారు.

  6. అదే విధంగా భక్తులను శ్రమలలో నుండి ఎలా విడిపించాలో ప్రభువుకు తెలుసు. అలాగే తీర్పు దినాన దుష్టులను ఎలా శిక్షించాలో కూడా ఆయనకు తెలుసు.

  7. మరి ముఖ్యంగా శరీరాశలను అనుసరించి చెడిపోయిన వారిని, ఆయన అధికారాన్ని తృణీకరించిన వారిని శిక్షించడం ఆయనకు తెలుసు. వీరు ధైర్యంగా దురహంకారంతో పరలోక సంబంధులను దూషించడానికి భయపడరు.

  8. వ్యభిచారం నిండిన కళ్లతో, పాపం చేయడం వారెప్పటికి మానరు; వారు అస్థిరమైన వ్యక్తులను ప్రలోభపెడతారు; వారు దురాశ కోసం వారి హృదయాలకు శిక్షణనిచ్చారు; వీరు శాపగ్రస్తులైన పిల్లలు!

  9. అదే విధంగా, సొదొమ, గొమొర్రాలు ఆ చుట్టుప్రక్కల పట్టణ ప్రజలు లైంగిక దుర్నీతికి పాల్పడ్డారు, ప్రకృతి విరుద్ధమైన వ్యామోహానికి లోనయ్యారు. ఆ ప్రజలు నిత్యాగ్ని శిక్షను అనుభవించబోయే వారికి ఒక ఉదాహరణగా ఉన్నారు.

  10. అయినా నేను నీ మీద తప్పు మోపవలసివున్నది: తాను ప్రవక్తిని అని చెప్పుకొనే యెజెబెలును మీరు సహిస్తున్నారు. లైంగిక దుర్నీతి, విగ్రహాలకు అర్పించిన ఆహారం తినాలని నా సేవకులకు బోధిస్తూ ఆమె వారిని మోసం చేస్తుంది.

  11. ఆమె లైంగిక దుర్నీతి గురించి పశ్చాత్తాపపడడానికి నేను సమయం ఇచ్చాను కాని ఆమె దానికి ఇష్టపడలేదు.

  12. కాబట్టి నేను ఆమెను శ్రమల పడకపై పడవేస్తాను. అలాగే ఆమెతో వ్యభిచరించిన వారు పశ్చాత్తాపపడకపోతే వారిని కూడా తీవ్రమైన బాధలకు గురిచేస్తాను.

  13. వారు చేసే హత్యలు, మంత్రపు ప్రయోగాలు, లైంగిక దుర్నీతి, దొంగతనం అనేవి తప్పు అని గ్రహించి పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగలేదు.

  14. ఆమెతో వ్యభిచరించి ఆమె సుఖభోగాలను అనుభవించిన భూ రాజులు ఆమె కాలుతున్నప్పుడు వచ్చే పొగను చూసి ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు.

  15. ఆమె పడే వేదన చూసి భయపడి, వారు దూరంగా నిలబడి ఇలా రోదిస్తారు: “మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ! బబులోను మహా పట్టణమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చింది.”

  16. అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పారు.

  17. అయితే మాంత్రికులు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహాలను పూజించే వారు, అబద్ధాలు చెప్తూ వాటిని ప్రేమించే వారందరు ఆ పట్టణానికి బయట ఉండే కుక్కలు.