Skip to content

Adultery గురించి బైబిల్ వచనాలు

242 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తప్పు చేసినవారు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు తెలియదా? మోసపోకండి: లైంగిక దుర్నీతైనా, విగ్రహారాధికులైనా, వ్యభిచారులైనా, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులైనా,

  2. దొంగలైనా, అత్యాశపరులైనా, త్రాగుబోతులైనా, దూషకులైనా, మోసగించేవారైనా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

  3. “ఆహారం కడుపు కోసం, కడుపు ఆహారం కోసం నియమించబడ్డాయని మీరు చెప్తారు, కానీ దేవుడు రెండింటిని నాశనం చేస్తారు.” మీ శరీరాన్ని లైంగిక దుర్నీతి కోసం కాదు గాని ప్రభువు కొరకే, ప్రభువు శరీరం కొరకే.

  4. మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? అయితే నేను క్రీస్తు అవయవాలను తీసుకుని వేశ్య అవయవాలుగా చేస్తానా? అలా ఎన్నడు జరుగకూడదు.

  5. వేశ్యతో కలిసేవాడు ఆమెతో ఏక శరీరమై ఉన్నాడని మీకు తెలియదా? వాక్యంలో, “వారిద్దరు ఏకశరీరం అవుతారు” అని వ్రాయబడి ఉంది కదా!

  6. లైంగిక దుర్నీతికి దూరంగా పారిపోండి. మానవుడు చేసే ఇతర పాపాలన్నీ శరీరానికి బయట చేసేవే, కానీ లైంగిక పాపం చేసేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.

  7. వారిలా మనం లైంగిక దుర్నీతికి పాల్పడకూడదు. వారిలో కొందరు అలా చేయడం వలన ఒక్క రోజులోనే ఇరవై మూడువేలమంది చనిపోయారు.

  8. మరల నేను వచ్చినప్పుడు దేవుడు మీ ముందు నన్ను చిన్నబుచ్చుకునేలా చేస్తాడేమోనని భయపడుతున్నాను, అంతేగాక గతంలో పాపం చేసి జరిగించిన అపవిత్రత, లైంగిక పాపం, పోకిరి చేష్టల గురించి పశ్చాత్తాపం చెందని వారి గురించి కూడ నేను దుఃఖపడాల్సి వస్తుందేమో అని భయపడుతున్నాను.

  9. శరీర సంబంధమైన క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేమంటే: లైంగిక దుర్నీతి, అపవిత్రత, వేశ్యాలోలత్వము;

  10. ఓర్వలేనితనం, మద్యం మత్తు, పోకిరి ఆటలు మొదలైనవి. నేను గతంలో మిమ్మల్ని హెచ్చరించినట్లుగా ఇలాంటి జీవితాన్ని జీవించేవారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మళ్ళీ హెచ్చరిస్తున్నాను.

  11. కాబట్టి మీరు, ఇకమీదట దేవుని భయంలేని యూదేతరులు నడుచుకొనునట్లు వ్యర్థమైన ఆలోచనలతో నడుచుకొనకూడదని ప్రభువు ఇచ్చిన అధికారంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.

  12. వారు సిగ్గును వదిలి అత్యాశతో నానా విధాలైన అపవిత్ర కార్యాలను జరిగిస్తూ, తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు.

  13. అయితే మీరు క్రీస్తు గురించి విన్నప్పుడు యేసులో ఉన్న సత్యానికి అనుగుణంగా ఆయనలో బోధించబడినప్పుడు మీరు నేర్చుకున్న జీవన విధానం ఇది కాదు.

  14. లైంగిక అపవిత్రత గాని లేదా ఇతర అపవిత్రత గాని అత్యాశ గాని మీ మధ్యలో ఎంత మాత్రం ఉండకూడదు, ఎందుకంటే ఇవి దేవుని పరిశుద్ధ ప్రజలకు తగినవి కావు.

  15. వ్యభిచారులు, అపవిత్రులు, అత్యాశపడేవారు అందరు విగ్రహారాధికులే; దేవునికి క్రీస్తుకు చెందిన రాజ్యంలో వారికి వారసత్వం లేదని మీకు ఖచ్చితంగా తెలుసు.

  16. వ్యర్థమైన మాటలతో ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, ఎందుకంటే వీటిని బట్టి అవిధేయులైనవారి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది.

  17. నిష్ఫలమైన చీకటి క్రియలలో పాల్గొనకుండా వాటిని బట్టబయలు చేయండి.

  18. అవిధేయులు రహస్యంగా చేసిన వాటిని గురించి మాట్లాడడం కూడా అవమానమే.

  19. కాబట్టి మీ భూసంబంధమైన స్వభావానికి సంబంధించిన వాటిని అనగా: లైంగిక దుర్నీతిని, అపవిత్రతను, కామవాంఛలను, దుష్ట కోరికలను, విగ్రహారాధనయైన దురాశలను చంపివేయండి.

  20. మీరు లైంగిక దుర్నీతికి దూరంగా ఉంటూ పరిశుద్ధులుగా ఉండడమే దేవునికి ఇష్టం;

  21. మీలో ప్రతివారు మీ సొంత శరీరమనే పాత్రను పరిశుద్ధంగా, ఘనత కలిగినదిగా ఉండేలా దానిపై నియంత్రణ కలిగి జీవించాలి.

  22. దేవుని ఎరుగనివారి కామోద్రేకాన్ని కలిగి ఉండవద్దు.

  23. పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు.

  24. అంతేకాక ధర్మశాస్త్రం నీతిమంతుల కోసం కాదు గాని, చట్టానికి విరుద్ధంగా ఉన్నవారికి, తిరుగుబాటు చేసేవారికి, భక్తిహీనులకు, పాపులకు, అపవిత్రులకు, నాస్తికులకు, తమ తల్లిదండ్రులను చంపేవారి కోసం, హంతకుల కోసం

  25. లైంగిక అనైతికత కలిగినవారి కోసం, స్వలింగసంపర్కులకు, బానిస వ్యాపారం చేసేవారికి, అబద్ధాలు చెప్పేవారికి, దొంగ సాక్ష్యం చెప్పేవారికి, స్వచ్ఛమైన బోధకు వ్యతిరేకంగా ఉన్న వారి కోసం నియమించబడిందని మనకు తెలుసు.