Skip to content

Adultery గురించి బైబిల్ వచనాలు

242 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు యేసుతో, “బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.

  2. అలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మనకు ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు. ఇప్పుడు నీవేమంటావు?” అని అడిగారు.

  3. యేసు తన తలయెత్తి, “అమ్మా, వారెక్కడ? ఎవరు నిన్ను శిక్షించలేదా?” అని అడిగారు.

  4. ఆమె, “అయ్యా ఎవరూ లేరు” అన్నది. అందుకు యేసు, “నేను కూడ నిన్ను శిక్షించను. నీవు వెళ్లి, ఇప్పటినుండి పాపం చేయకుండ బ్రతుకు” అన్నారు.

  5. దానికి బదులుగా, విగ్రహాలకు అర్పించి అపవిత్రపరచిన ఆహారాన్ని తినడం, లైంగిక అనైతికత సంబంధాలను, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, రక్తాన్ని తినడం మానుకోవాలని మనం వారికి ఉత్తరం వ్రాసి తెలియచేయాలి.

  6. విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం, రక్తం తినడం, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, లైంగిక అనైతికత సంబంధాలను మానుకోవాలి. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే మీకు మేలు కలుగుతుంది. మీకు క్షేమం కలుగును గాక.

  7. అంతేగాక, వారు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండడం విలువైనదిగా భావించలేదు, కాబట్టి వారు చేయరాని పనులు చేసేటట్లు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించారు.

  8. వారు ప్రతి విధమైన దుర్మార్గంతో, చెడుతనంతో, దురాశలతో, దుర్నీతితో నిండి ఉన్నారు. వారు అసూయ కలిగినవారిగా హత్యలు చేసేవారిగా, కొట్లాటలను మోసాన్ని ఓర్వలేనితనాన్ని కలిగి ఉన్నారు. వారు వదరుబోతులు,

  9. ఇలాంటి పనులు చేసినవారు మరణానికి పాత్రులవుతారు అనే దేవుని నీతిశాసనం గురించి తెలిసి కూడా వారు అవే పనులు చేయడమే కాక వాటిని చేస్తున్నవారిని కూడా అంగీకరించారు.

  10. అయితే ఆమె తన భర్త బ్రతికి ఉండగానే మరొక వ్యక్తితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటే ఆమె వ్యభిచారిణి అవుతుంది. ఒకవేళ ఆమె భర్త చనిపోతే ఆ ధర్మం నుండి ఆమె విడుదల పొందుకున్నది కాబట్టి ఆమె మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే ఆమె వ్యభిచారిణి కాదు.

  11. “మీరు వ్యభిచారం చేయకూడదు, మీరు హత్య చేయకూడదు, మీరు దొంగతనం చేయకూడదు, ఇతరులదేదీ మీరు ఆశించకూడదు” అనే ఆజ్ఞలు ఇతర ఆజ్ఞలు ఉన్నప్పటికీ అవన్నీ, “మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి.

  12. అతి త్రాగి మత్తులు కావడం, హద్దు అదుపు లేని లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, వ్యభిచారం చేయడం, గొడవపడడం, అసూయపడడం మొదలైన వాటిని విడిచి, పగటివేళ నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాం.

  13. మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాము. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట కదా! ఇలాంటి వ్యభిచారం దేవుని ఎరుగనివారు కూడా సహించరు.

  14. ఇలా ఉండి కూడా మీరు గర్విస్తున్నారా! నిజానికి ఈ విషయం గురించి మీరు దుఃఖించి ఈ పని చేసిన వానిని మీ సహవాసం నుండి వెలివేయాలి కదా!

  15. నా మట్టుకైతే, నేను శారీరకంగా మీతో అక్కడ లేకపోయినా నా ఆత్మలో నేను మీతోనే ఉన్నాను. కాబట్టి మీతో ఉన్న వానిగానే మన ప్రభువైన యేసు నామంలో ఈ పని చేసిన వాని మీద తీర్పు ఇదివరకే తెలియజేశాను.

  16. ఎలాగంటే, ప్రభు యేసు నామంలో మీరు సమకూడినప్పుడు ప్రభువైన యేసు శక్తి ద్వారా నేను ఆత్మలో మీతో ఉన్నాను.

  17. కాబట్టి ప్రభువు దినాన వాని ఆత్మ రక్షించబడేలా వాని శరీరం నశించడానికి వానిని సాతానుకు అప్పగించాలి.

  18. మీరు ఆ విషయంలో గర్వించడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమే అయినా మొత్తం పిండిని పులియజేస్తుందని మీకు తెలుసు కదా!

  19. క్రీస్తు అనే మన పస్కా గొర్రెపిల్ల మీ కోసం వధించబడి ప్రాయశ్చిత్తం చేశారు కాబట్టి మీరు పులియని క్రొత్త పిండి ముద్దగా ఉండడానికి పులిసిన పాత పిండిని పారవేయండి.

  20. కాబట్టి అసూయ, దుర్మార్గం అనే పులిసిన పాత పిండితో కాకుండా నిజాయితీ సత్యమనే పులియని రొట్టెతో పస్కా పండుగ ఆచరిద్దాము.

  21. లైంగిక దుర్నీతి కలిగినవారితో సహవాసం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాశాను.

  22. అయితే నేను, ఈ లోకపు వ్యభిచారులతో గాని, అత్యాశపరులతో గాని, మోసం చేసేవారితో గాని, విగ్రహారాధికులతో గాని ఏమాత్రం కలిసి ఉండవద్దని చెప్పడం లేదు, అలాగైతే మీరు లోకాన్నే విడిచి వెళ్లవలసి ఉంటుంది కదా!

  23. ఇప్పుడైతే, సహోదరి అని సహోదరుడని పిలువబడే సంఘసభ్యుల గురించి వ్రాస్తున్నాను. ఎవరైనా వ్యభిచారిగా, అత్యాశపరునిగా, విగ్రహారాధికునిగా లేదా నిందలువేసే వారిగా, త్రాగుబోతుగా లేదా మోసగానిగా ఉంటే అలాంటి వారితో కలిసి ఉండవద్దు. అలాంటి వారితో భోజనం కూడా చేయవద్దని మీకు వ్రాస్తున్నాను.

  24. సంఘానికి బయట ఉన్నవారిని విమర్శించడం నాకెందుకు? మీకు సంఘసభ్యులను తీర్చు తీర్చే బాధ్యత లేదా?

  25. సంఘం బయటివారికి దేవుడే తీర్పు తీరుస్తారు. కాబట్టి వాక్యంలో ఉన్నట్లు, “ఆ దుష్టున్ని మీ మధ్య నుండి వెలివేయండి.”