Skip to content

Abraham గురించి బైబిల్ వచనాలు

314 వచనాలు · 39 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అందుకు యెహోవా అతనితో, “ఒక దూడను, ఒక మేకను, ఒక పొట్టేలును, అన్నీ మూడు సంవత్సరాలవై ఉండాలి, వాటితో పాటు ఒక గువ్వను, ఒక పావురాన్ని నా దగ్గరకు తీసుకురా” అని చెప్పారు.

  2. అబ్రాము వాటన్నిటిని తెచ్చి, వాటిని సగానికి రెండు ముక్కలుగా కోసి, దేనికది ఎదురెదురుగా పేర్చాడు; అయితే అతడు పక్షులను మాత్రం సగం చేయలేదు.

  3. ఆ కళేబరాలపై వాలడానికి రాబందులు వచ్చాయి అయితే అబ్రాము వాటిని వెళ్లగొట్టాడు.

  4. సూర్యాస్తమయం అవుతుండగా అబ్రాముకు గాఢనిద్ర పట్టింది, భయంకరమైన కారుచీకటి అతని మీదుగా కమ్ముకుంది.

  5. అప్పుడు యెహోవా అబ్రాముతో ఇలా చెప్పారు, “నీవు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి; నీ వారసులు తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరాయివారిగా ఉంటారు, అక్కడ వారు బానిసలుగా ఉంటూ వేధించబడతారు.

  6. అయితే వారిని బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను, ఆ తర్వాత గొప్ప ఆస్తులతో వారు బయటకు వస్తారు.

  7. నీవైతే సమాధానంగా నీ పూర్వికుల దగ్గరకు చేరతావు, మంచి వృద్ధాప్యంలో పాతిపెట్టబడతావు.

  8. నీ సంతానంలో నాలుగవ తరం వారు ఇక్కడకు తిరిగి వచ్చేస్తారు, ఎందుకంటే ఇంకా అమోరీయుల పాపం పండలేదు.”

  9. సూర్యుడు అస్తమించి చీకటి కమ్మినప్పుడు పొగలేస్తున్న కుంపటి, మండుతున్న దివిటీ కనిపించి, ఆ ముక్కల మధ్యలో నుండి దాటి వెళ్లాయి.

  10. ఆ రోజు యెహోవా అబ్రాముతో నిబంధన చేసి, “నేను నీ సంతానానికి ఈజిప్టు వాగు నుండి యూఫ్రటీసు మహా నది వరకు అంటే,

  11. కెనీయులు, కెనిజ్జీయులు, కద్మోనీయులు,

  12. హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీయులు,

  13. అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు ఉన్న దేశమంతటిని ఇస్తున్నాను” అని అన్నారు.

  14. అబ్రాము కనానులో పది సంవత్సరాలు నివసించిన తర్వాత, శారాయి ఈజిప్టు నుండి దాసిగా తెచ్చుకున్న హాగరును తన భర్తకు భార్యగా ఇచ్చింది.

  15. హాగరు అబ్రాముకు కుమారుని కన్నది, అబ్రాము అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు.

  16. హాగరు ఇష్మాయేలుకు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరేళ్ళు.

  17. అబ్రాముకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, “నేను సర్వశక్తిగల దేవుడను, నా ఎదుట నీవు నమ్మకంగా నిందారహితునిగా జీవించాలి.

  18. అప్పుడు నేను నీకు నాకు మధ్య నిబంధన చేస్తాను, నీ సంతతిని అత్యధికంగా వర్ధిల్లజేస్తాను” అన్నారు.

  19. అబ్రాము సాష్టాంగపడ్డాడు, అప్పుడు దేవుడు అతనితో ఇలా అన్నారు,

  20. “నేను నీతో చేస్తున్న నిబంధన ఇదే: నీవు అనేక జనాంగాలకు తండ్రివవుతావు.

  21. ఇకమీదట నీ పేరు అబ్రాము కాదు; నీకు అబ్రాహాము అని పేరు పెడుతున్నాను ఎందుకంటే నేను నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేశాను.

  22. నిన్ను ఎంతో ఫలభరితంగా చేస్తాను; నిన్ను అనేక జనాంగాలుగా చేస్తాను, రాజులు నీ నుండి వస్తారు.

  23. నా నిబంధనను నాకు నీకు మరి నీ తర్వాత వచ్చు నీ వారసులకు మధ్య నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను, నీకు దేవునిగా, నీ తర్వాత నీ వారసులకు దేవునిగా ఉంటాను.

  24. నీవు పరదేశిగా ఉంటున్న కనాను దేశమంతా నీకు, నీ తర్వాత నీ వారసులకు నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను; వారికి నేను దేవునిగా ఉంటాను.”

  25. అప్పుడు దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నారు, “నీవైతే, నీవు, నీ తర్వాత నీ సంతానం తరతరాల వరకు నా నిబంధనను నిలుపుకోవాలి.