కంటెంట్‌కు వెళ్లండి

Abraham గురించి బైబిల్ వచనాలు: Divine call of

9 వచనాలు · 39 కోణాలు

"Abraham" కోసం వెతకండి

Divine call of గురించి వచనాలు

  1. యెహోవా అబ్రాముతో ఇలా అన్నారు, “నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు.

  2. “నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను; నీ పేరును గొప్పగా చేస్తాను, నీవు దీవెనగా ఉంటావు.

  3. నిన్ను దీవించే వారిని దీవిస్తాను, శపించే వారిని శపిస్తాను; నిన్ను బట్టి భూమి మీద ఉన్న సర్వ జనాంగాలు దీవించబడతారు.”

  4. అయితే నేను మీ తండ్రి అబ్రాహామును యూఫ్రటీసు అవతల ఉన్న దేశం నుండి తీసుకువచ్చి కనానుకు నడిపించి, అతనికి చాలామంది సంతానాన్ని ఇచ్చాను. అయితే నేను అతనికి ఇస్సాకును ఇచ్చాను,

  5. “యెహోవా దేవా, అబ్రామును ఏర్పరచుకుని, అతన్ని కల్దీయుల ఊరు అనే చోటు నుండి బయటకు తీసుకువచ్చి అతనికి అబ్రాహాము అని పేరు పెట్టింది మీరే.

  6. మీ తండ్రియైన అబ్రాహామును, మీకు జన్మనిచ్చిన శారాను చూడండి, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను, అతన్ని ఆశీర్వదించి అతన్ని అనేకమందిగా చేశాను.

  7. అందుకు అతడు, “సహోదరులారా తండ్రులారా, నా మాటను వినండి! మన పితరుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై,

  8. ‘నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు’ అని చెప్పారు.

  9. విశ్వాసం ద్వారానే అబ్రాహాము, తాను స్వాస్థ్యంగా పొందబోతున్న ప్రదేశానికి వెళ్లమని పిలువబడినపుడు ఆ పిలుపుకు లోబడి తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియకపోయినా అతడు బయలుదేరి వెళ్లాడు.