Abraham గురించి బైబిల్ వచనాలు: Children of
Children of గురించి వచనాలు
హాగరు అబ్రాముకు కుమారుని కన్నది, అబ్రాము అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు.
సరిగ్గా దేవుడు వాగ్దానం చేసిన నిర్ణీత కాలంలో శారా గర్భవతియై, వృద్ధాప్యంలో ఉన్న అబ్రాహాముకు కుమారున్ని కన్నది.
అబ్రాహాము, శారా తన కోసం కన్న కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు.
అబ్రాహాము కెతూరా అనే మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు,
ఆమె అతనికి కన్న కుమారులు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు.
యొక్షాను కుమారులు షేబ, దేదాను; అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు దేదాను వారసులు.
ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా మిద్యాను కుమారులు. వీరంతా కెతూరా సంతానము.
అబ్రాహాము ఉంపుడుగత్తె కెతూరాకు పుట్టిన కుమారులు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. యొక్షాను కుమారులు: షేబ, దేదాను.
మిద్యాను కుమారులు: ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా.
అబ్రాహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారులు: ఏశావు, ఇశ్రాయేలు.