కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 రాజులు 16:19సుమారు క్రీ.పూ. 929

    యరొబాము జీవిత విధానాన్ని అనుసరిస్తూ యెహోవా దృష్టిలో పాపం చేసి, యరొబాములా ఇశ్రాయేలు ప్రజల పాపం చేయడానికి అతడు కారణమయ్యాడు కాబట్టి ఇలా జరిగింది.

  2. 1 రాజులు 16:20సుమారు క్రీ.పూ. 929

    జిమ్రీ పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతని తిరుగుబాటు వివరాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  3. 1 రాజులు 16:21సుమారు క్రీ.పూ. 929

    అప్పుడు ఇశ్రాయేలు రాజ్యంలో ప్రజలు రెండు వర్గాలయ్యారు; సగం మంది గీనతు కుమారుడైన తిబ్నీ రాజుగా ఉండాలని, మరో సగం ఒమ్రీ రాజుగా ఉండాలని ఆశించారు.

  4. 1 రాజులు 16:22సుమారు క్రీ.పూ. 929

    అయితే ఒమ్రీ వైపు ఉన్నవారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షం వారి మీద యుద్ధం చేసి గెలిచారు. కాబట్టి తిబ్నీ చనిపోయాడు, ఒమ్రీ రాజయ్యాడు.

  5. 1 రాజులు 16:23సుమారు క్రీ.పూ. 925

    యూదా రాజైన ఆసా పరిపాలన యొక్క ముప్పై ఒకటవ సంవత్సరంలో ఒమ్రీ ఇశ్రాయేలుకు రాజై పన్నెండు సంవత్సరాల పరిపాలనలో ఆరు సంవత్సరాలు తిర్సాలో పరిపాలన చేశాడు.

  6. 1 రాజులు 16:24సుమారు క్రీ.పూ. 925

    అతడు షెమెరు దగ్గర సమరయ కొండను రెండు తలాంతుల వెండికి కొని దాని మీద పట్టణం కట్టించి, ఆ కొండకు మునుపటి యజమానియైన షెమెరు పేరిట దానికి సమరయ అని పేరు పెట్టాడు.

  7. 1 రాజులు 16:25సుమారు క్రీ.పూ. 925

    అయితే ఒమ్రీ యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, అతని ముందున్న వారందరికంటే ఇంకా ఎక్కువ పాపం చేశాడు.

  8. 1 రాజులు 16:26సుమారు క్రీ.పూ. 925

    అతడు నెబాతు కుమారుడైన యరొబాము ఎలా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారణమై తమ అయోగ్యమైన విగ్రహాలను పెట్టుకుని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడో అదే విధానాన్ని అనుసరించాడు.

  9. 1 రాజులు 16:27సుమారు క్రీ.పూ. 925

    ఒమ్రీ పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతని విజయాలు, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  10. 1 రాజులు 16:28సుమారు క్రీ.పూ. 925

    ఒమ్రీ చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని సమరయలో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు అహాబు రాజయ్యాడు.

  11. 1 రాజులు 16:29సుమారు క్రీ.పూ. 918

    యూదా రాజైన ఆసా పరిపాలనలోని ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు సమరయలో ఇశ్రాయేలు మీద ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు.

  12. 1 రాజులు 16:30సుమారు క్రీ.పూ. 918

    ఒమ్రీ కుమారుడైన అహాబు అతని ముందున్న వారందరికంటే యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తించాడు.

  13. 1 రాజులు 16:31సుమారు క్రీ.పూ. 918

    అతడు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను తక్కువగా పరిగణించడమే కాకుండా, సీదోను రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును పెళ్ళి చేసుకుని బయలును సేవించి పూజించడం ప్రారంభించాడు.

  14. 1 రాజులు 16:32సుమారు క్రీ.పూ. 918

    అతడు సమరయలో బయలు గుడిని కట్టించి, అందులో బయలుకు బలిపీఠాన్ని నిర్మించాడు.

  15. 1 రాజులు 16:33సుమారు క్రీ.పూ. 918

    అహాబు అషేరా స్తంభాలను కూడా నిలిపి, ముందు ఉన్న ఇశ్రాయేలు రాజులందరికి కంటే ఎక్కువగా పాపం చేసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడు.

  16. 1 రాజులు 16:34సుమారు క్రీ.పూ. 918

    అహాబు కాలంలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణాన్ని మళ్ళీ కట్టించాడు. దాని పునాది వేసినప్పుడు అతని పెద్దకుమారుడైన అబీరాము చనిపోయాడు, దానికి గుమ్మాలు పెట్టినప్పుడు అతని చిన్నకుమారుడు సెగూబు చనిపోయాడు. ఈ విధంగా నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరింది.

  17. 1 రాజులు 17:1సుమారు క్రీ.పూ. 910

    గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామవాసియైన ఏలీయా అహాబుతో అన్నాడు, “నేను సేవించే ఇశ్రాయేలీయుల సజీవుడైన దేవుడు, యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, రాబోయే కొన్ని సంవత్సరాలు, నేను చెప్తేనే తప్ప, మంచు గాని, వర్షం గాని కురవదు.”

  18. 1 రాజులు 17:2సుమారు క్రీ.పూ. 910

    తర్వాత యెహోవా వాక్కు ఏలీయాకు వచ్చింది:

  19. 1 రాజులు 17:3సుమారు క్రీ.పూ. 910

    “ఈ స్థలం విడిచి, తూర్పు వైపుకు వెళ్లి, యొర్దానుకు తూర్పున, కెరీతు వాగు దగ్గర దాక్కో.

  20. 1 రాజులు 17:4సుమారు క్రీ.పూ. 910

    నీవు ఆ వాగు నీళ్లు త్రాగు, అక్కడ నీకు ఆహారం అందించాలని కాకులకు ఆదేశించాను.”

  21. 1 రాజులు 17:5సుమారు క్రీ.పూ. 910

    కాబట్టి యెహోవా చెప్పినట్లు ఏలీయా చేశాడు, అతడు యొర్దానుకు తూర్పున ఉన్న కెరీతు వాగు దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్నాడు.

  22. 1 రాజులు 17:6సుమారు క్రీ.పూ. 910

    ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కాకులు అతనికి మాంసం, రొట్టెలు తెచ్చేవి, అతడు ఆ వాగు నీళ్లు త్రాగేవాడు.

  23. 1 రాజులు 17:7సుమారు క్రీ.పూ. 909

    కొంతకాలానికి దేశంలో వర్షం లేకపోవడం వలన ఆ వాగు ఎండిపోయింది.

  24. 1 రాజులు 17:8సుమారు క్రీ.పూ. 909

    అప్పుడు యెహోవా వాక్కు అతనికి వచ్చింది:

  25. 1 రాజులు 17:9సుమారు క్రీ.పూ. 909

    “నీవు లేచి, సీదోనుకు చెందిన సారెపతుకు వెళ్లి, అక్కడ ఉండు. అక్కడ ఆహారం పెట్టాలని ఒక విధవరాలికి ఆదేశించాను.”