- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 930–586 BC
The Divided Kingdom
The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.
ఈ కాలపు వచనాలు
- 1 రాజులు 18:11సుమారు క్రీ.పూ. 906
ఇప్పుడు నన్ను వెళ్లి నా యజమానితో, ‘ఏలీయా ఇక్కడ ఉన్నాడు’ అని చెప్పమంటున్నారు.
- 1 రాజులు 18:12సుమారు క్రీ.పూ. 906
నేను మిమ్మల్ని విడిచి వెళ్లిన తర్వాత, యెహోవా ఆత్మ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాడో నాకు తెలియదు. నేను అహాబుకు చెప్పినప్పుడు, ఒకవేళ అతనికి మీరు కనబడకపోతే అతడు నన్ను చంపేస్తాడు. అది సరికాదు; మీ సేవకుడనైన నేను కూడ బాల్యం నుండే యెహోవాను ఆరాధించే వాన్ని.
- 1 రాజులు 18:13సుమారు క్రీ.పూ. 906
నా ప్రభువా, యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపిస్తూ ఉన్నప్పుడు నేను ఏమి చేశానో మీరు వినలేదా? యెహోవా ప్రవక్తల్లో వందమందిని రెండు గుహల్లో దాచాను, ఒక్కొక్క గుహలో యాభైమంది లెక్కన ఉంచి వారికి భోజనం పెట్టి పోషించాను.
- 1 రాజులు 18:14సుమారు క్రీ.పూ. 906
మరి మీరేమో నన్ను నా యజమాని దగ్గరకు వెళ్లి, ‘ఏలీయా ఇక్కడ ఉన్నాడు’ అని చెప్పమంటున్నారు. అతడు నన్ను చంపుతాడు!” అన్నాడు.
- 1 రాజులు 18:15సుమారు క్రీ.పూ. 906
అందుకు ఏలీయా, “నేను సేవించే సజీవుడైన సైన్యాల యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు ఖచ్చితంగా నేను అహాబుకు కనబడతాను.”
- 1 రాజులు 18:16సుమారు క్రీ.పూ. 906
ఓబద్యా అహాబును కలుసుకోడానికి వెళ్లి ఈ విషయం తెలియజేయగా అహాబు ఏలీయాను కలుసుకోడానికి వెళ్లాడు.
- 1 రాజులు 18:17సుమారు క్రీ.పూ. 906
అహాబు ఏలీయాను చూడగానే అతనితో, “ఇశ్రాయేలును కష్టపెట్టేవాడివి నీవే గదా?” అన్నాడు.
- 1 రాజులు 18:18సుమారు క్రీ.పూ. 906
అందుకు ఏలీయా, “నేను కాదు; నీవు, నీ తండ్రి కుటుంబం యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను తిరస్కరించి, బయలును అనుసరించి మీరే ఇశ్రాయేలును కష్టపెట్టారు.
- 1 రాజులు 18:19సుమారు క్రీ.పూ. 906
ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులందరిని కర్మెలు పర్వతం మీద నన్ను కలవమని పిలిపించు. యెజెబెలు బల్ల దగ్గర తినే నాలుగు వందల యాభై బయలు ప్రవక్తలను, నాలుగు వందల అషేరా ప్రవక్తలను కూడా రమ్మను” అని జవాబిచ్చాడు.
- 1 రాజులు 18:20సుమారు క్రీ.పూ. 906
కాబట్టి అహాబు ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించాడు. ఆ ప్రవక్తలను కూడా కర్మెలు పర్వతం మీద సమావేశపరిచాడు.
- 1 రాజులు 18:21సుమారు క్రీ.పూ. 906
ఏలీయా ప్రజల దగ్గరకు వెళ్లి, “మీరు ఎంతకాలం రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే అతన్ని అనుసరించండి” అని అన్నాడు. అయితే ప్రజలు ఏమి బదులు చెప్పలేదు.
- 1 రాజులు 18:22సుమారు క్రీ.పూ. 906
అప్పుడు ఏలీయా వారితో, “యెహోవా ప్రవక్తల్లో నేనొక్కడినే మిగిలాను, కాని బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభైమంది ఉన్నారు.
- 1 రాజులు 18:23సుమారు క్రీ.పూ. 906
మాకు రెండు ఎడ్లను తీసుకురండి, వారు ఆ ఎడ్లలో ఒకదాన్ని బయలు ప్రవక్తలు తీసుకుని దానిని ముక్కలుగా కోసి, క్రింద నిప్పు అంటించకుండా కట్టెల మీద పేర్చాలి. ఇంకొక ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద నిప్పు అంటించకుండా కట్టెల మీద పేరుస్తాను.
- 1 రాజులు 18:24సుమారు క్రీ.పూ. 906
మీరు మీ దేవుని పేరిట ప్రార్థన చేయండి, నేను యెహోవా పేరిట ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే అగ్నిని పంపి జవాబిస్తాడో ఆయనే నిజమైన దేవుడు” అని అన్నాడు. అప్పుడు ప్రజలంతా, “నీవు చెప్పింది బాగుంది” అన్నారు.
- 1 రాజులు 18:25సుమారు క్రీ.పూ. 906
ఏలీయా బయలు ప్రవక్తలతో, “మీరు చాలామంది ఉన్నారు కాబట్టి ముందు మీరు ఒక ఎద్దును తీసుకుని దానిని సిద్ధం చేయండి. మీ దేవుని పేరిట ప్రార్థన చేయండి, అయితే నిప్పు అంటించకూడదు” అన్నాడు.
- 1 రాజులు 18:26సుమారు క్రీ.పూ. 906
కాబట్టి వారు ఒక ఎద్దును తీసుకుని సిద్ధం చేశారు. తర్వాత వారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, “బయలా! మాకు జవాబివ్వు!” అని అంటూ బయలు పేరెత్తి బిగ్గరగా మొరపెట్టారు. కాని ఏ స్పందన లేదు; ఎవరూ జవాబివ్వలేదు. వారు సిద్ధం చేసిన బలిపీఠం చుట్టూ నాట్యం చేయడం మొదలుపెట్టారు.
- 1 రాజులు 18:27సుమారు క్రీ.పూ. 906
మధ్యాహ్న సమయంలో ఏలీయా వారిని గేలి చేస్తూ, “బిగ్గరగా అరవండి! అతడు నిజంగా దేవుడే కదా! బహుశ అతడు ఏదైన ఆలోచనలో నిమగ్నమై ఉన్నాడేమో, లేదా పనిలో ఉన్నాడేమో లేదా ప్రయాణంలో ఉన్నాడేమో. బహుశ పడుకున్నాడేమో, అతన్ని నిద్ర లేపాలేమో” అన్నాడు.
- 1 రాజులు 18:28సుమారు క్రీ.పూ. 906
కాబట్టి వారు ఇంకా బిగ్గరగా కేకలువేస్తూ వారి అలవాటు ప్రకారం రక్తం ధారలుగా కారే వరకు కత్తులతో, ఈటెలతో తమను తాము కోసుకున్నారు.
- 1 రాజులు 18:29సుమారు క్రీ.పూ. 906
మధ్యాహ్నం దాటింది, సాయంత్రం బలి సమయం వరకు వారు తమ వెర్రి ప్రవచనాలను కొనసాగించారు. అయినా స్పందన లేదు, ఎవరు జవాబివ్వలేదు, ఎవరూ పట్టించుకోలేదు.
- 1 రాజులు 18:30సుమారు క్రీ.పూ. 906
అప్పుడు ఏలీయా ప్రజలందరితో, “ఇక్కడకు నా దగ్గరకు రండి” అన్నాడు. వారతని దగ్గరకు రాగా అతడు పడిపోయిన యెహోవా బలిపీఠాన్ని తిరిగి నిర్మించాడు.
- 1 రాజులు 18:31సుమారు క్రీ.పూ. 906
అప్పుడు ఏలీయా, “నీ పేరు ఇశ్రాయేలు” అని యెహోవా వాగ్దానం పొందుకున్న యాకోబు గోత్రాల లెక్క చొప్పున పన్నెండు రాళ్లు తీసుకున్నాడు.
- 1 రాజులు 18:32సుమారు క్రీ.పూ. 906
రాళ్లతో యెహోవా పేరున బలిపీఠం కట్టి, దాని చుట్టూ రెండు శేయల గింజలు పట్టేటంత పెద్దగా కందకం తవ్వాడు.
- 1 రాజులు 18:33సుమారు క్రీ.పూ. 906
అతడు బలిపీఠం మీద కట్టెలు పేర్చి ఎద్దును ముక్కలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచాడు. తర్వాత వారితో, “నాలుగు పెద్ద జాడీలు నీళ్లతో నింపి, అర్పణ మీద కట్టెల మీద పోయండి” అన్నాడు.
- 1 రాజులు 18:34సుమారు క్రీ.పూ. 906
అతడు, “మళ్ళీ అలాగే చేయండి” అని చెప్పగా వారు మళ్ళీ అలాగే చేశారు. అతడు, “మూడవసారి కూడా అలాగే చేయండి” అనగానే వారు మళ్ళీ దహనబలి పశుమాంసం మీద కట్టెల మీద నీళ్లు పోశారు.
- 1 రాజులు 18:35సుమారు క్రీ.పూ. 906
నీళ్లు బలిపీఠం మీద నుండి చుట్టూ పారుతూ కందకం కూడా నిండిపోయింది.