- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 930–586 BC
The Divided Kingdom
The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.
ఈ కాలపు వచనాలు
- 1 రాజులు 17:10సుమారు క్రీ.పూ. 909
కాబట్టి అతడు లేచి సారెపతుకు వెళ్లాడు. పట్టణ ద్వారం దగ్గరకు చేరగానే, అక్కడ ఒక విధవరాలు కట్టెలు ఏరుకుంటూ కనిపించింది. అతడు ఆమెను పిలిచి, “త్రాగడానికి నాకు గిన్నెలో నీళ్లు తెస్తావా?” అని అడిగాడు.
- 1 రాజులు 17:11సుమారు క్రీ.పూ. 909
ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంటే, అతడు పిలిచి, “దయచేసి ఒక రొట్టె ముక్క కూడా తీసుకురా” అన్నాడు.
- 1 రాజులు 17:12సుమారు క్రీ.పూ. 909
అందుకు ఆమె జవాబిస్తూ, “సజీవుడు, మీ దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను, నా దగ్గర రొట్టె ఒక్కటి కూడా లేదు, కేవలం జాడీలో పిడికెడు పిండి, కూజలో కొంచెం నూనె ఉన్నాయి. నేను కొన్ని కట్టెలు ఏరుకుని ఇంటికి వెళ్లి నాకు నా కుమారునికి చివరి వంట చేసుకుని, తిని చనిపోతాము” అని అన్నది.
- 1 రాజులు 17:13సుమారు క్రీ.పూ. 909
ఏలీయా ఆమెతో, “భయపడకు. ఇంటికి వెళ్లి నేను నీకు చెప్పినట్లు చేయు. మొదట నా కోసం చిన్న రొట్టె చేసి తీసుకురా, తర్వాత నీకు, నీ కుమారునికి చేసుకో.
- 1 రాజులు 17:14సుమారు క్రీ.పూ. 909
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘దేశం మీద యెహోవా వర్షం కురిపించే వరకు, ఆ జాడీలో పిండి తగ్గిపోదు, కూజలో నూనె అయిపోదు’ ” అని చెప్పాడు.
- 1 రాజులు 17:15సుమారు క్రీ.పూ. 909
ఆమె వెళ్లి ఏలీయా చెప్పినట్లు చేసింది. కాబట్టి ప్రతిరోజు ఏలీయాకు, ఆ స్త్రీకి, తన కుటుంబానికి ఆహారం ఉండేది.
- 1 రాజులు 17:16సుమారు క్రీ.పూ. 909
ఎందుకంటే ఏలీయా ద్వారా యెహోవా చెప్పిన మాట ప్రకారం జాడీలో పిండి తరిగిపోలేదు, కూజలో నూనె అయిపోలేదు.
- 1 రాజులు 17:17సుమారు క్రీ.పూ. 908
కొంతకాలం తర్వాత ఇంటి యజమానురాలి కుమారునికి జబ్బుచేసింది. ఆ జబ్బు తీవ్రమైనందుకు అతడు ప్రాణం విడిచాడు.
- 1 రాజులు 17:18సుమారు క్రీ.పూ. 908
ఆమె ఏలీయాతో అన్నది, “దైవజనుడా, మీరు నాకు చేసిందేంటి? నా పాపం నాకు జ్ఞాపకంచేసి నా కుమారున్ని చంపడానికి వచ్చారా?”
- 1 రాజులు 17:19సుమారు క్రీ.పూ. 908
ఏలీయా జవాబిస్తూ, “నీ కుమారున్ని నాకు ఇవ్వు” అన్నాడు. ఆమె చేతిలో నుండి అతన్ని తీసుకుని, తాను ఉంటున్న మేడ గదికి తీసుకెళ్లి, తన పడక మీద పడుకోబెట్టాడు.
- 1 రాజులు 17:20సుమారు క్రీ.పూ. 908
తర్వాత అతడు యెహోవాకు మొరపెడుతూ అన్నాడు, “యెహోవా నా దేవా, నేను ఎవరి ఇంట్లో అతిథిగా ఉంటున్నానో ఆ విధవరాలి కుమారున్ని చనిపోయేలా చేసి, ఆమెకు కూడా విషాదాన్ని కలిగించారా?”
- 1 రాజులు 17:21సుమారు క్రీ.పూ. 908
తర్వాత అతడు ఆ బాలుని మీద మూడుసార్లు చాచుకొని, “యెహోవా, నా దేవా! ఈ బాలునికి ప్రాణం తిరిగి రానివ్వండి!” అని యెహోవాకు మొరపెట్టాడు.
- 1 రాజులు 17:22సుమారు క్రీ.పూ. 908
ఏలీయా చేసిన ప్రార్థన యెహోవా విన్నారు, బాలునికి ప్రాణం తిరిగి వచ్చింది, అతడు బ్రతికాడు.
- 1 రాజులు 17:23సుమారు క్రీ.పూ. 908
ఏలీయా ఆ బాలున్ని ఎత్తుకుని ఆ గది నుండి క్రింద ఇంట్లోకి తీసుకువచ్చి, ఆ బాలుని తల్లి చేతికి ఇస్తూ, “చూడు, నీ కుమారుడు సజీవంగా ఉన్నాడు” అన్నాడు.
- 1 రాజులు 17:24సుమారు క్రీ.పూ. 908
అప్పుడు ఆ స్త్రీ ఏలీయాతో, “ఇప్పుడు మీరు దైవజనులని, మీ నోట ఉన్న యెహోవా వాక్కు సత్యమని నాకు తెలిసింది” అన్నది.
- 1 రాజులు 18:1సుమారు క్రీ.పూ. 906
చాలాకాలం తర్వాత కరువులో మూడవ సంవత్సరం యెహోవా వాక్కు ఏలీయాకు వచ్చింది: “నీవు వెళ్లి అహాబుకు కనబడు, నేను దేశం మీద వర్షం కురిపిస్తాను.”
- 1 రాజులు 18:2సుమారు క్రీ.పూ. 906
కాబట్టి అహాబుకు కనబడటానికి ఏలీయా వెళ్లాడు. ఆ సమయంలో సమరయలో కరువు తీవ్రంగా ఉంది.
- 1 రాజులు 18:3సుమారు క్రీ.పూ. 906
కాబట్టి అహాబు తన రాజభవన నిర్వాహకుడైన ఓబద్యాను పిలిపించాడు. (ఓబద్యా యెహోవా పట్ల భయభక్తులు గలవాడు.
- 1 రాజులు 18:4సుమారు క్రీ.పూ. 906
యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపిస్తూ ఉన్నప్పుడు, ఓబద్యా వందమంది ప్రవక్తలను తీసుకెళ్లి వారిని దాచిపెట్టి, వారిని యాభైమంది చొప్పున రెండు గుహల్లో ఉంచి వారికి అన్నపానాలు అందించాడు.)
- 1 రాజులు 18:5సుమారు క్రీ.పూ. 906
అహాబు ఓబద్యాతో, “దేశంలో తిరిగి పర్యటిస్తూ అన్ని ఊటలను, వాగులను చూడు. మన గుర్రాలు, కంచరగాడిదలు చావకుండ వాటికి గడ్డి దొరుకుతుందేమో అప్పుడు కొన్ని పశువులనైనా చావకుండ చూడగలం” అన్నాడు.
- 1 రాజులు 18:6సుమారు క్రీ.పూ. 906
కాబట్టి వారు దేశమంతా తిరిగి చూడడానికి వీలుగా ఒకవైపు అహాబు, మరోవైపు ఓబద్యా వెళ్లారు.
- 1 రాజులు 18:7సుమారు క్రీ.పూ. 906
ఓబద్యా దారిన వెళ్తుండగా ఏలీయా అతనికి ఎదురయ్యాడు. ఓబద్యా అతన్ని గుర్తుపట్టి సాష్టాంగపడి, “నా ప్రభువా ఏలీయా, నిజంగా మీరేనా?” అన్నాడు.
- 1 రాజులు 18:8సుమారు క్రీ.పూ. 906
ఏలీయా అతనితో, “అవును నేనే. నీవు వెళ్లి, ఏలీయా ఇక్కడ ఉన్నాడని నీ యజమానితో చెప్పు” అన్నాడు.
- 1 రాజులు 18:9సుమారు క్రీ.పూ. 906
అందుకు ఓబద్యా, “నేను చనిపోయేలా మీ దాసుడనైన నన్ను అహాబుకు అప్పగించడానికి నేను ఏ చెడ్డపని చేశాను?
- 1 రాజులు 18:10సుమారు క్రీ.పూ. 906
సజీవుడైన మీ దేవుడు, యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను, నా యజమాని అహాబు మీకోసం వెదకడానికి అన్ని దేశాలకు, రాజ్యాలకు మనుష్యులను పంపాడు. ఏ దేశం వారైనా ఏలీయా లేడని చెప్పినప్పుడు మిమ్మల్ని ఆ దేశం వారు చూడలేదని వారి చేత ఒట్టు పెట్టించుకున్నాడు.