కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 3:9సుమారు క్రీ.పూ. 595

    నేను నీ నుదుటిని వజ్రం కంటే గట్టి రాయిలా చేస్తాను. వారు తిరుగుబాటుదారులు అయినప్పటికీ వారికి బెదరకు వారిని చూసి భయపడకు.”

  2. యెహెజ్కేలు 3:10సుమారు క్రీ.పూ. 595

    ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నేను మాట్లాడే మాటలు జాగ్రత్తగా విని మనస్సులో ఉంచుకో.

  3. యెహెజ్కేలు 3:11సుమారు క్రీ.పూ. 595

    బందీలుగా ఉన్న నీ ప్రజలు దగ్గరకు వెళ్లి వారు విన్నా వినకపోయినా, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే’ అని ప్రకటించు” అన్నారు.

  4. యెహెజ్కేలు 3:12సుమారు క్రీ.పూ. 595

    ఆత్మ నన్ను పైకెత్తగా నా వెనుక ఆయన ఉన్న స్థలం నుండి యెహోవా మహిమకు స్తోత్రం కలుగుతుంది అనే గొప్ప గర్జన లాంటి శబ్దం వినిపించింది.

  5. యెహెజ్కేలు 3:13సుమారు క్రీ.పూ. 595

    అది జీవుల రెక్కలు ఒకదానికొకటి తగులుతుంటే వచ్చిన శబ్దము. వాటి ప్రక్కన ఉన్న చక్రాల శబ్దం గొప్ప గర్జన వంటి శబ్దంలా ఉంది.

  6. యెహెజ్కేలు 3:14సుమారు క్రీ.పూ. 595

    అప్పుడు ఆత్మ నన్ను ఎత్తుకుని తీసుకెళ్లాడు. నేనలాగే కొట్టుకొని పోయాను. నా మనస్సులో పుట్టిన కోపానికి ఎంతో కలత చెందినప్పుడు యెహోవా చేయి నా మీదికి బలంగా వచ్చింది.

  7. యెహెజ్కేలు 3:15సుమారు క్రీ.పూ. 595

    కెబారు నది దగ్గర ఉన్న తేలాబీబు అనే స్థలంలో బందీలుగా ఉన్న వారి దగ్గరకు వచ్చాను. వారు కూర్చున్న చోటే దిగులుగా ఏడు రోజులు కూర్చుండిపోయాను.

  8. యెహెజ్కేలు 3:16సుమారు క్రీ.పూ. 595

    ఏడు రోజులు గడిచిన తర్వాత యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చి:

  9. యెహెజ్కేలు 3:17సుమారు క్రీ.పూ. 595

    “మనుష్యకుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను; కాబట్టి నేను చెప్పే మాట విని నా తరపున వారిని హెచ్చరించు.

  10. యెహెజ్కేలు 3:18సుమారు క్రీ.పూ. 595

    నేను దుర్మార్గునితో, ‘నీవు తప్పక చస్తావు’ అని చెప్పినప్పుడు, నీవు వాన్ని హెచ్చరించకపోయినా, లేదా వాని ప్రాణం కాపాడబడేలా చెడు మార్గాలను విడిచిపెట్టమని వాన్ని హెచ్చరించకపోయినా, ఆ దుర్మార్గుడు వాని పాపాలను బట్టి చనిపోతే, వాని చావుకు నిన్ను జవాబుదారీని చేస్తాను.

  11. యెహెజ్కేలు 3:19సుమారు క్రీ.పూ. 595

    అయితే ఒకవేళ నీవు ఆ దుర్మార్గులను హెచ్చరించినా వారు తమ దుర్మార్గాన్ని, దుష్ట మార్గాలను వదలకపోతే, వారు తమ పాపాలను బట్టి చస్తారు; కాని నీవు తప్పించుకుంటావు.

  12. యెహెజ్కేలు 3:20సుమారు క్రీ.పూ. 595

    “నీతిమంతుడు తన నీతి నుండి తొలగిపోయి చెడు చేస్తే నేను అతని ముందు అభ్యంతరం పెడతాను అప్పుడతడు చస్తాడు. అయితే నీవు అతన్ని హెచ్చరించలేదు కాబట్టి అతడు తన పాపాన్ని బట్టి చస్తాడు. అతడు చేసిన నీతిక్రియలను నేను జ్ఞాపకం చేసుకోను, కాని అతని రక్తానికి నిన్నే జవాబుదారీని చేస్తాను.

  13. యెహెజ్కేలు 3:21సుమారు క్రీ.పూ. 595

    ఒకవేళ పాపం చేయకూడదని నీవు నీతిమంతుని హెచ్చరించినప్పుడు అతడు పాపం చేయకపోతే అతడు ఖచ్చితంగా బ్రతుకుతాడు, ఎందుకంటే అతడు ఆ హెచ్చిరికకు లోబడ్డాడు. అలాగే నిన్ను నీవు కాపాడుకుంటావు.”

  14. యెహెజ్కేలు 3:22సుమారు క్రీ.పూ. 595

    అప్పుడు యెహోవా చేయి నా మీదికి బలంగా వచ్చి, ఆయన నాతో, “నీవు లేచి, సమతల మైదాన ప్రాంతానికి వెళ్లు. అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని అన్నారు.

  15. యెహెజ్కేలు 3:23సుమారు క్రీ.పూ. 595

    కాబట్టి నేను లేచి సమతల మైదానానికి వెళ్లాను. కెబారు నది దగ్గర నేను చూసిన యెహోవా మహిమ అక్కడ నిలబడి ఉంది. నేను ముఖం నేలకు ఆనించి మోకాళ్లమీద ఉన్నాను.

  16. యెహెజ్కేలు 3:24సుమారు క్రీ.పూ. 595

    అప్పుడు ఆత్మ నా లోనికి వచ్చి నా కాళ్లమీద నన్ను నిలబెట్టాడు. తర్వాత యెహోవా నాతో ఇలా చెప్పారు: “నీ ఇంటి లోపలికి వెళ్లి, తలుపులు మూసివేసుకో.

  17. యెహెజ్కేలు 3:25సుమారు క్రీ.పూ. 595

    మనుష్యకుమారుడా, వారు నిన్ను త్రాళ్లతో కట్టి బంధించబోతున్నారు కాబట్టి నీవు వారి మధ్యకు వెళ్లవద్దు.

  18. యెహెజ్కేలు 3:26సుమారు క్రీ.పూ. 595

    వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి నీవు వారిని గద్దించకుండా మౌనంగా ఉండేలా నీ నాలుక నీ అంగిటికి అంటుకుపోయేలా చేస్తాను.

  19. యెహెజ్కేలు 3:27సుమారు క్రీ.పూ. 595

    కాని నేను నీతో మాట్లాడినప్పుడు నీవు వారితో, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు’ చెప్పడానికి నేను నీ నోరు తెరుస్తాను. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి వినేవారు వింటారు విననివారు వినరు.

  20. యెహెజ్కేలు 4:1సుమారు క్రీ.పూ. 595

    “మనుష్యకుమారుడా, ఒక మట్టి ఇటుకను తీసుకుని, నీ ముందు పెట్టుకుని, దాని మీద యెరూషలేము పట్టణ నమూనాను గీయి.

  21. యెహెజ్కేలు 4:2సుమారు క్రీ.పూ. 595

    తర్వాత అది ముట్టడి వేయబడినట్లుగా దాని ఎదురుగా ముట్టడి దిబ్బలు, బురుజు కట్టినట్లు, దానికి ఎదురుగా సైనిక శిబిరాలు, గోడలను పడగొట్టే యంత్రాలు ఉన్నట్లు గీయి.

  22. యెహెజ్కేలు 4:3సుమారు క్రీ.పూ. 595

    తర్వాత ఒక ఇనుప రేకును తీసుకుని, దాన్ని నీకు, పట్టణానికి మధ్య ఇనుప గోడలా ఉంచి, నీ ముఖాన్ని దాని వైపుకు త్రిప్పి నిలబడు. నీవు పట్టణాన్ని ముట్టడి చేస్తున్నట్లుగా ఉంటావు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఒక సూచనగా ఉంటుంది.

  23. యెహెజ్కేలు 4:4సుమారు క్రీ.పూ. 595

    “అప్పుడు నీవు నీ ఎడమవైపుకు పడుకుని ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని నీ మీద వేసుకో. నీవు నీవైపు పడుకుని ఉన్న అన్ని రోజులు వారి పాపాన్ని నీవు భరించాలి.

  24. యెహెజ్కేలు 4:5సుమారు క్రీ.పూ. 595

    ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు పాపం చేశారో అన్ని రోజులు నేను నీకు నిర్ణయిస్తాను. దాని ప్రకారం 390 రోజులు నీవు వారి పాపాన్ని భరించాలి.

  25. యెహెజ్కేలు 4:6సుమారు క్రీ.పూ. 595

    “నీవు ఇది పూర్తి చేసిన తర్వాత, ఈసారి నీ కుడి వైపుకు తిరిగి పడుకుని యూదా ప్రజల పాపాన్ని భరించు. నేను నీకు 40 రోజులు, ప్రతి సంవత్సరానికి ఒక రోజు నియమించాను.