- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- యెహెజ్కేలు 4:7సుమారు క్రీ.పూ. 595
ముట్టడిలో ఉన్న యెరూషలేము వైపు నీ ముఖాన్ని త్రిప్పి చొక్కా తీసివేసి చేయి ఎత్తి, దానికి వ్యతిరేకంగా ప్రవచించు.
- యెహెజ్కేలు 4:8సుమారు క్రీ.పూ. 595
నీ ముట్టడి రోజులు పూర్తయ్యే వరకు నీవు ఒకవైపు నుండి మరోవైపుకు తిరగకుండా నిన్ను త్రాళ్లతో బంధిస్తాను.
- యెహెజ్కేలు 4:9సుమారు క్రీ.పూ. 595
“గోధుమలు, యవలు, చిక్కుడు కాయలు, అలచందలు, జొన్నలు తీసుకోండి; వాటిని ఒక పాత్రలో నిల్వ ఉంచి వాటితో రొట్టెలు చేసుకుని నీవు ఒకవైపు పడుకున్న 390 రోజులు వాటిని తినాలి.
- యెహెజ్కేలు 4:10సుమారు క్రీ.పూ. 595
ప్రతిరోజు తినడానికి ఇరవై షెకెళ్ళ ఆహారాన్ని తూకం వేసి, నిర్ణీత సమయాల్లో తినాలి.
- యెహెజ్కేలు 4:11సుమారు క్రీ.పూ. 595
అలాగే ఒక హిన్ లో ఆరవ వంతు నీరు కొలిచి నిర్ణీత సమయాల్లో త్రాగాలి.
- యెహెజ్కేలు 4:12సుమారు క్రీ.పూ. 595
యవలతో రొట్టెలు చేసుకుని ప్రజలంతా చూస్తుండగా మానవ మలంతో వాటిని కాల్చుకుని తినాలి.
- యెహెజ్కేలు 4:13సుమారు క్రీ.పూ. 595
నేను వారిని ఏ జాతుల మధ్యకు వెళ్లగొడతానో వారి మధ్య ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అపవిత్రమైన ఆహారం తింటారు” అని యెహోవా నాకు చెప్పారు.
- యెహెజ్కేలు 4:14సుమారు క్రీ.పూ. 595
అప్పుడు నేను, “అలా కాదు, ప్రభువా, యెహోవా! నన్ను నేను ఎప్పుడూ అపవిత్రం చేసుకోలేదు. నా చిన్నప్పటి నుండి ఇప్పటివరకు చనిపోయింది గాని అడవి జంతువులు చంపిన దానిని గాని నేను తినలేదు. ఏ అపవిత్రమైన మాంసం నా నోటిలోకి వెళ్లలేదు” అని అన్నాను.
- యెహెజ్కేలు 4:15సుమారు క్రీ.పూ. 595
అందుకు ఆయన, “మంచిది, అలా అయితే మానవ మలం బదులు ఆవు పేడ మీద కాల్చడానికి నేను నిన్ను అనుమతిస్తాను” అని అన్నారు.
- యెహెజ్కేలు 4:16సుమారు క్రీ.పూ. 595
ఇంకా ఆయన నాతో ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, నేను యెరూషలేములో ఆహార సరఫరాను నిలిపివేయబోతున్నాను. ప్రజలు ఆందోళనకు గురియై కొలత ప్రకారం ఆహారం తింటారు, అలాగే కొలత ప్రకారం నీరు త్రాగుతారు.
- యెహెజ్కేలు 4:17సుమారు క్రీ.పూ. 595
ఆహారానికి నీటికి కొరత ఏర్పడుతుంది. వారు ఒకరినొకరు చూసి దిగులుపడతారు, వారి పాపం కారణంగా వారు నశించిపోతారు.
- యెహెజ్కేలు 5:1సుమారు క్రీ.పూ. 594
“మనుష్యకుమారుడా, పదునైన కత్తిని తీసుకుని దానిని మంగలి కత్తిలా ఉపయోగించి నీ తలను, గడ్డాన్నీ క్షౌరం చేసుకో. ఒక త్రాసు తెచ్చి ఆ వెంట్రుకలను తూచి భాగాలుగా చేయి.
- యెహెజ్కేలు 5:2సుమారు క్రీ.పూ. 594
నీ ముట్టడి రోజులు పూర్తి కాగానే ఈ వెంట్రుకలలో మూడవ భాగాన్ని పట్టణం లోపల కాల్చివేయాలి. మూడవ భాగాన్ని తీసుకుని ఖడ్గంతో పట్టణం చుట్టూ చెదరగొట్టాలి. మిగిలిన మూడవ భాగాన్ని గాలికి ఎగిరిపోనివ్వాలి. ఎందుకంటే నేను ఖడ్గంతో వారిని వెంటాడతాను.
- యెహెజ్కేలు 5:3సుమారు క్రీ.పూ. 594
అయితే కొన్ని వెంట్రుకలు తీసుకుని నీ బట్టల అంచుకు కట్టుకో.
- యెహెజ్కేలు 5:4సుమారు క్రీ.పూ. 594
మరికొన్నిటిని తీసుకుని అగ్నిలో వేసి కాల్చు, అందులో నుండి అగ్ని వచ్చి ఇశ్రాయేలంతా వ్యాపిస్తుంది.
- యెహెజ్కేలు 5:5సుమారు క్రీ.పూ. 594
“ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అనేక జాతుల మధ్య నేను ఉంచిన యెరూషలేము ఇదే! దాని చుట్టూరా దేశాలున్నాయి.
- యెహెజ్కేలు 5:6సుమారు క్రీ.పూ. 594
అయితే అది దాని చుట్టూ ఉన్న జాతుల కన్నా, రాజ్యాల కన్నా ఎక్కువగా నా ధర్మశాస్త్రాన్ని, శాసనాలను నిర్లక్ష్యం చేసింది. అది నా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించి నా శాసనాలను పాటించలేదు.
- యెహెజ్కేలు 5:7సుమారు క్రీ.పూ. 594
“కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: మీ చుట్టూ ఉన్న జాతుల కంటే మీరే దుష్టులు, నా శాసనాలను అనుసరించలేదు, నా చట్టాలను పాటించలేదు. కనీసం మీ చుట్టూ ఉన్న జాతుల ప్రమాణాలకు కూడా మీరు అనుగుణంగా ఉండరు.
- యెహెజ్కేలు 5:8సుమారు క్రీ.పూ. 594
“కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: యెరూషలేమా, నేనే నీకు వ్యతిరేకంగా ఉన్నాను, జాతులు చూస్తుండగానే నేను నీకు శిక్ష విధిస్తాను.
- యెహెజ్కేలు 5:9సుమారు క్రీ.పూ. 594
మీ అసహ్యమైన విగ్రహాలన్నిటిని బట్టి నేను ఇంతకు ముందెన్నడూ చేయనిది, ఇకపై ఎన్నడూ చేయనిది మీకు చేస్తాను.
- యెహెజ్కేలు 5:10సుమారు క్రీ.పూ. 594
కాబట్టి మీ మధ్య తల్లిదండ్రులు తమ పిల్లలను తింటారు, పిల్లలు తమ తల్లిదండ్రులను తింటారు. నేను మీకు శిక్ష విధించి మీలో మిగిలిన వారినందరిని గాలికి చెదరగొడతాను.
- యెహెజ్కేలు 5:11సుమారు క్రీ.పూ. 594
నా జీవం తోడు, నిశ్చయంగా, నీవు నీ నీచమైన ప్రతిమలతోను అసహ్యమైన ఆచారాలతోను నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరిచావు కాబట్టి, నేనే నీకు క్షౌరం చేస్తాను; నేను నీపై జాలిపడను, నిన్ను కనికరించను” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
- యెహెజ్కేలు 5:12సుమారు క్రీ.పూ. 594
మీ ప్రజల్లో మూడవ భాగం మీలోనే తెగులుతో చస్తారు, కరువుతో నశిస్తారు; మరో మూడవ భాగం మీ గోడల బయట ఖడ్గానికి కూలిపోతారు. మిగిలిన భాగాన్ని నేను గాలికి చెదరగొట్టి ఖడ్గంతో వారిని వెంటాడతాను.
- యెహెజ్కేలు 5:13సుమారు క్రీ.పూ. 594
“అప్పుడు నా కోపం తీరుతుంది, వారి మీద నా ఉగ్రత తగ్గుతుంది, నా ప్రతీకారం తీరుతుంది. నేను వారి మీద నా ఉగ్రతను పూర్తిగా కుమ్మరించినప్పుడు, యెహోవానైన నేను రోషంతో మాట్లాడానని వారు తెలుసుకుంటారు.
- యెహెజ్కేలు 5:14సుమారు క్రీ.పూ. 594
“నీ చుట్టూ ఉన్న జాతుల మధ్యలో నిన్ను చూసే వారందరి ఎదుట నిన్ను నిర్జనంగాను నిందగాను చేస్తాను.