కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 5:15సుమారు క్రీ.పూ. 594

    నేను కోపంలో, ఉగ్రతలో, కఠోరమైన మందలింపుతో నిన్ను శిక్షించినప్పుడు, నీ చుట్టూ ఉన్న జాతులకు నీవు ఒక నిందగా హేళనగా ఒక హెచ్చరికగా ఒక భయానకమైనదానిగా ఉంటావు. యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను.

  2. యెహెజ్కేలు 5:16సుమారు క్రీ.పూ. 594

    నేను నిన్ను నాశనం చేయడానికి ఘోరమైన, నాశనకరమైన కరువు బాణాలను నీ మీదికి విసురుతాను. నేను నీ మీదికి ఇంకా ఇంకా ఎక్కువ కరువు రప్పించి, నీ ఆహార సరఫరాను నిలిపివేస్తాను.

  3. యెహెజ్కేలు 5:17సుమారు క్రీ.పూ. 594

    నేను నీ మీదికి కరువును, అడవి మృగాలను పంపుతాను, అవి మీకు సంతానం లేకుండా చేస్తాయి. తెగులు, రక్తపాతం నిన్ను తుడిచివేస్తాయి, నేను నీ మీదికి ఖడ్గాన్ని రప్పిస్తానని యెహోవానైన నేనే చెప్పాను.”

  4. యెహెజ్కేలు 6:1సుమారు క్రీ.పూ. 594

    యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  5. యెహెజ్కేలు 6:2సుమారు క్రీ.పూ. 594

    “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయుల పర్వతాల వైపు తిరిగి, వాటికి వ్యతిరేకంగా ప్రవచిస్తూ,

  6. యెహెజ్కేలు 6:3సుమారు క్రీ.పూ. 594

    ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలు పర్వతాల్లారా, పర్వతాలకు, కొండలకు, కనుమలకు, లోయలకు ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను మీ మీదికి ఖడ్గాన్ని రప్పించి, మీ క్షేత్రాలను నాశనం చేస్తాను.

  7. యెహెజ్కేలు 6:4సుమారు క్రీ.పూ. 594

    మీ బలిపీఠాలు కూల్చివేయబడతాయి, మీ ధూపవేదికలు పగులగొట్టబడతాయి; మీ విగ్రహాల ముందు నేను నీ ప్రజలను చంపుతాను.

  8. యెహెజ్కేలు 6:5సుమారు క్రీ.పూ. 594

    ఇశ్రాయేలీయుల శవాలను వారి విగ్రహాల ముందు పడవేస్తాను, మీ బలిపీఠాలు చుట్టూ మీ ఎముకలు వెదజల్లుతాను.

  9. యెహెజ్కేలు 6:6సుమారు క్రీ.పూ. 594

    మీరు ఎక్కడ నివసించినా, ఆ పట్టణాలు నిర్జనమవుతాయి, క్షేత్రాలు పడగొట్టబడతాయి, తద్వారా మీ బలిపీఠాలు అపవిత్రమవుతాయి, మీ విగ్రహాలు పగిలి శిథిలమవుతాయి, మీ ధూపవేదికలు పగులగొట్టబడతాయి, మీరు తయారుచేసినవి తుడిచివేయబడతాయి.

  10. యెహెజ్కేలు 6:7సుమారు క్రీ.పూ. 594

    మీ ప్రజలు మీ మధ్య చంపబడతారు, అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.

  11. యెహెజ్కేలు 6:8సుమారు క్రీ.పూ. 594

    “ ‘అయినా నేను కొందరిని విడిచిపెడతాను, ఎందుకంటే మీరు వివిధ దేశాలకు జాతుల మధ్యకు చెదరగొట్టబడినపుడు మీలో కొంతమంది ఖడ్గం నుండి తప్పించుకుంటారు.

  12. యెహెజ్కేలు 6:9సుమారు క్రీ.పూ. 594

    అప్పుడు తప్పించుకుని ఇతర దేశాల్లో బందీలుగా ఉన్నవారు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. నాకు దూరంగా ఉన్న వారి వ్యభిచార హృదయాలను బట్టి నేను ఎలా దుఃఖించానో, వారి విగ్రహాల పట్ల వారి కళ్లల్లో కనిపించిన మోహాన్ని బట్టి నేను ఎలా బాధపడ్డానో జ్ఞాపకం చేసుకుంటారు. వారు చేసిన చెడును బట్టి వారి అసహ్యమైన ఆచారాలన్నిటిని బట్టి తమను తాము అసహ్యించుకుంటారు.

  13. యెహెజ్కేలు 6:10సుమారు క్రీ.పూ. 594

    అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు; వారిపైకి కీడు రప్పిస్తానని నేను ఊరకనే బెదిరించలేదు.

  14. యెహెజ్కేలు 6:11సుమారు క్రీ.పూ. 594

    “ ‘ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: మీ చేతులను చరిచి మీ పాదాలతో నేలను తన్ని ఇశ్రాయేలు ప్రజల దుర్మార్గమైన అసహ్యమైన క్రియలనుబట్టి “అయ్యో!” అని ఏడువు ఎందుకంటే వారు ఖడ్గం కరువు తెగులు ద్వారా చస్తారు.

  15. యెహెజ్కేలు 6:12సుమారు క్రీ.పూ. 594

    దూరాన ఉన్నవారు తెగులు వచ్చి చస్తారు. దగ్గరగా ఉన్నవారు ఖడ్గంతో చస్తారు, ఎవరైనా మిగిలినా, విడిచిపెట్టబడినా, వారు కరువుతో చస్తారు. నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను.

  16. యెహెజ్కేలు 6:13సుమారు క్రీ.పూ. 594

    తమ విగ్రహాల మధ్య, తమ బలిపీఠాల చుట్టూరా, ఎత్తైన కొండలన్నిటి మీద, పర్వత శిఖరాలన్నిటి మీద, మహా వృక్షాల క్రింద, ఏపుగా పెరిగిన సింధూర వృక్షాలన్నిటి క్రింద ఎక్కడైతే తమ విగ్రహాలన్నిటికి పరిమళ ధూపం వేశారో అక్కడ వారి ప్రజలందరూ చచ్చి పడి ఉండడం చూసి, నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.

  17. యెహెజ్కేలు 6:14సుమారు క్రీ.పూ. 594

    నేను వారికి వ్యతిరేకంగా నా చేయి చాపి వారెక్కడ నివసించినా ఆ దేశాన్ని ఎడారి నుండి రిబ్లా వరకు నిర్జనమైన వ్యర్థంగా చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”

  18. యెహెజ్కేలు 7:1సుమారు క్రీ.పూ. 594

    యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  19. యెహెజ్కేలు 7:2సుమారు క్రీ.పూ. 594

    “మనుష్యకుమారుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలీయుల దేశానికి చెప్తున్న మాట ఇదే: “ ‘అంతం! అంతం వచ్చేసింది దేశం నలువైపులా వచ్చేసింది!

  20. యెహెజ్కేలు 7:3సుమారు క్రీ.పూ. 594

    ఇప్పుడు నీ మీద అంతం వచ్చేసింది! నా కోపాన్ని నీపై కుమ్మరిస్తాను. నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి నీ అసహ్యకరమైన ఆచారాలన్నిటిని బట్టి నీకు తిరిగి చెల్లిస్తాను.

  21. యెహెజ్కేలు 7:4సుమారు క్రీ.పూ. 594

    నీ మీద ఏమాత్రం దయ చూపించను నిన్ను వదిలిపెట్టను. నీ ప్రవర్తనకు నీ మధ్య ఉన్న అసహ్యకరమైన ఆచారాలన్నిటికి నీకు ప్రతిఫలమిస్తాను. “ ‘నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.’

  22. యెహెజ్కేలు 7:5సుమారు క్రీ.పూ. 594

    “ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: “ ‘విపత్తు! విపత్తు వెనకే విపత్తు చూడండి, అది వచ్చేస్తుంది!

  23. యెహెజ్కేలు 7:6సుమారు క్రీ.పూ. 594

    అంతం వచ్చేసింది! అంతం వచ్చేసింది! అది నీ కోసమే చూస్తుంది; ఇదిగో, వచ్చింది.

  24. యెహెజ్కేలు 7:7సుమారు క్రీ.పూ. 594

    దేశ నివాసులారా! మీ మీదికి వినాశనం వస్తుంది. సమయం దగ్గరకి వచ్చింది! ఆ రోజు సమీపంగా ఉంది! ఆనందం కాదు భయమే పర్వతాలమీద వినపడుతుంది.

  25. యెహెజ్కేలు 7:8సుమారు క్రీ.పూ. 594

    నా ఉగ్రత మీపై కుమ్మరించబోతున్నాను. నా కోపాన్ని మీమీద చూపిస్తాను. మీ ప్రవర్తనకు మీరు చేసిన అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను.