కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 పేతురు 4:10సుమారు క్రీ.శ. 60

    అనేక రకాలైన దేవుని వరాలకు మంచి నిర్వాహకుల్లా ప్రతి ఒక్కరు దేవుని నుండి తాము పొందిన విశేష కృపావరాలను ఇతరుల మేలుకోసం ఉపయోగించాలి.

  2. 1 పేతురు 4:11సుమారు క్రీ.శ. 60

    ఎవరైనా మాట్లాడితే, వారు దేవుని మాటలే మాట్లాడాలి. ఎవరైనా సేవ చేస్తే, దేవుడు ఇచ్చే శక్తితోనే సేవ చేయాలి. అప్పుడు అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు స్తుతించబడతారు. ఆయనకే మహిమ, ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.

  3. 1 పేతురు 4:12సుమారు క్రీ.శ. 60

    ప్రియ మిత్రులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీకు వచ్చిన అగ్నివంటి పరీక్షను చూసి మీకేదో వింత జరుగుతున్నట్లుగా ఆశ్చర్యపడకండి.

  4. 1 పేతురు 4:13సుమారు క్రీ.శ. 60

    క్రీస్తు మహిమ వెల్లడి అయినప్పుడు మీరు మహానందాన్ని అనుభవించేలా ఆయన బాధల్లో పాలుపొందామని ఆనందించండి.

  5. 1 పేతురు 4:14సుమారు క్రీ.శ. 60

    క్రీస్తు నామం కోసం మీరు నిందలపాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే మహిమగల దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని దాని భావము.

  6. 1 పేతురు 4:15సుమారు క్రీ.శ. 60

    ఒకవేళ మీరు శ్రమపడినా, హంతకునిగా దొంగగా దోషిగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకొన్న వారిగా ఆ శ్రమ ఉండకూడదు.

  7. 1 పేతురు 4:16సుమారు క్రీ.శ. 60

    అయినా, మీరు క్రైస్తవునిగా శ్రమపడితే సిగ్గుపడకండి, కాని మీరు ఆ నామాన్ని మోస్తున్నవారిగా దేవున్ని స్తుతించండి.

  8. 1 పేతురు 4:17సుమారు క్రీ.శ. 60

    తీర్పు మొదలయ్యే సమయం ఆసన్నమైంది; దేవుని ఇంటివారే ముందుగా తీర్పు తీర్చబడతారు. అది మనతోనే మొదలైతే దేవుని సువార్తను నమ్మనివారి గతి ఏంటి?

  9. 1 పేతురు 4:18సుమారు క్రీ.శ. 60

    అలాగే, “నీతిమంతుడే రక్షించబడడం కష్టమైతే, భక్తిహీనులు, పాపాత్ముల గతి ఏంటి?”

  10. 1 పేతురు 4:19సుమారు క్రీ.శ. 60

    కాబట్టి, దేవుని చిత్తప్రకారం బాధలు అనుభవించేవారు మంచి కార్యాలను కొనసాగిస్తూ, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి.

  11. 1 పేతురు 5:1సుమారు క్రీ.శ. 60

    తోటి సంఘపెద్దగా, క్రీస్తు పడిన శ్రమలకు సాక్షినై ఉండి, ప్రత్యక్షం కాబోతున్న మహిమలో భాగం పంచుకోబోతున్న నేను మీ సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే:

  12. 1 పేతురు 5:2సుమారు క్రీ.శ. 60

    మీ స్వాధీనంలో ఉన్న దేవుని మందకు కాపరులుగా ఉండండి. అయిష్టంతో కాక దేవుని చిత్తం అనుకుని ఇష్టపూర్వకంగా దాన్ని కాపాడండి. లాభం మీద దురాశతో కాక మనస్సు పూర్వకంగా దాన్ని కాయండి;

  13. 1 పేతురు 5:3సుమారు క్రీ.శ. 60

    మీకు అప్పగించబడిన మందపై అధికారం చెలాయించక, మీరు మందకు మాదిరిగా ఉండండి.

  14. 1 పేతురు 5:4సుమారు క్రీ.శ. 60

    ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మీరు ఎప్పటికీ తరిగిపోని మహిమ కిరీటం పొందుతారు.

  15. 1 పేతురు 5:5సుమారు క్రీ.శ. 60

    అలానే, యవ్వనస్థులారా, మీరు మీ పెద్దలకు లోబడి ఉండండి. మీరందరు వినయం అనే వస్త్రాన్ని ధరించాలి. ఎందుకనగా, “దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు కాని దీనులకు దయ చూపిస్తారు.”

  16. 1 పేతురు 5:6సుమారు క్రీ.శ. 60

    దేవుని బలమైన చేతి క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు.

  17. 1 పేతురు 5:7సుమారు క్రీ.శ. 60

    ఆయన మీ గురించి చింతిస్తున్నారు కాబట్టి మీ చింతలన్ని ఆయనపై మోపండి.

  18. 1 పేతురు 5:8సుమారు క్రీ.శ. 60

    మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించు సింహంలా తిరుగుతూ ఎవరినైన మ్రింగివేయాలని చూస్తున్నాడు.

  19. 1 పేతురు 5:9సుమారు క్రీ.శ. 60

    దృఢ విశ్వాసులై వానిని ఎదిరించండి. ప్రపంచమంతా ఉన్న విశ్వాసుల కుటుంబం ఇలాంటి బాధలనే అనుభవిస్తుందని మీకు తెలుసు.

  20. 1 పేతురు 5:10సుమారు క్రీ.శ. 60

    తన శాశ్వత మహిమలోనికి క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియైన దేవుడు, మీరు కొంతకాలం బాధలు పొందిన తర్వాత ఆయనే స్వయంగా మీకు స్థిరత్వాన్ని, బలాన్ని అనుగ్రహిస్తారు.

  21. 1 పేతురు 5:11సుమారు క్రీ.శ. 60

    ఆయనకే నిరంతరం ప్రభావం కలుగును గాక ఆమేన్.

  22. 1 పేతురు 5:12సుమారు క్రీ.శ. 60

    నేను నమ్మకమైన సహోదరునిగా భావించే సీల సహాయంతో ఈ కొద్ది మాటలు వ్రాస్తున్నాను, మిమ్మల్ని ప్రోత్సహించాలని, ఇది దేవుని నిజమైన కృప మాత్రమే అని సాక్ష్యమిస్తున్నాను. మీరు దీనిలో నిలిచి ఉండండి.

  23. 1 పేతురు 5:13సుమారు క్రీ.శ. 60

    బబులోనులో మీలా ఏర్పరచబడిన మీ సహోదర సంఘం, నా కుమారుడైన మార్కు కూడ మీకు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.

  24. 1 పేతురు 5:14సుమారు క్రీ.శ. 60

    ప్రేమపూర్వకమైన ముద్దుతో ఒకరికొకరు శుభాలు చెప్పుకోండి. క్రీస్తులో ఉన్న మీకందరికి శాంతి కలుగును గాక.

  25. 2 పేతురు 1:1సుమారు క్రీ.శ. 66

    యేసు క్రీస్తు సేవకుడు అపొస్తలుడైన సీమోను పేతురు,