కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 పేతురు 2:6సుమారు క్రీ.శ. 66

    దేవుడు సొదొమ, గొమొర్రాలకు తీర్పు తీర్చి వాటిని కాల్చి బూడిద చేసి భక్తిహీనులకు ఏమి జరుగుతుందో తెలియజేయడానికి వాటిని ఒక మాదిరిగా ఉంచారు.

  2. 2 పేతురు 2:7సుమారు క్రీ.శ. 66

    దుష్టుల కామ వికార ప్రవర్తన వలన బాధపడిన నీతిమంతుడైన లోతును ఆయన రక్షించారు.

  3. 2 పేతురు 2:8సుమారు క్రీ.శ. 66

    ఎందుకంటే, ఈ నీతిమంతుడు దినదినం వారి మధ్య జీవిస్తూ వారి చెడు కార్యాలను చూసి, వారి మాటలు విని తన నీతిగల మనస్సులో వేదన చెందాడు.

  4. 2 పేతురు 2:9సుమారు క్రీ.శ. 66

    అదే విధంగా భక్తులను శ్రమలలో నుండి ఎలా విడిపించాలో ప్రభువుకు తెలుసు. అలాగే తీర్పు దినాన దుష్టులను ఎలా శిక్షించాలో కూడా ఆయనకు తెలుసు.

  5. 2 పేతురు 2:10సుమారు క్రీ.శ. 66

    మరి ముఖ్యంగా శరీరాశలను అనుసరించి చెడిపోయిన వారిని, ఆయన అధికారాన్ని తృణీకరించిన వారిని శిక్షించడం ఆయనకు తెలుసు. వీరు ధైర్యంగా దురహంకారంతో పరలోక సంబంధులను దూషించడానికి భయపడరు.

  6. 2 పేతురు 2:11సుమారు క్రీ.శ. 66

    బలవంతులు శక్తిమంతులైన దేవదూతలు సహితం ప్రభువు తీర్పు తెచ్చినప్పుడు వారిని అలా దూషించరు.

  7. 2 పేతురు 2:12సుమారు క్రీ.శ. 66

    కాని ఈ ప్రజలు తాము గ్రహించలేని విషయాలను దూషిస్తారు. వారు స్వాభావికంగా పట్టబడడానికి, నశించడానికి పుట్టిన వివేకంలేని జంతువుల వంటివారు, ఆ జంతువుల్లా వీరు కూడా నశించిపోతారు.

  8. 2 పేతురు 2:13సుమారు క్రీ.శ. 66

    వారు ఇతరులకు చేసిన హానికి ప్రతిఫలంగా వారికి హాని కలుగుతుంది. వారు పట్ట పగలే త్రాగుతూ ఆనందించాలని భావిస్తారు. వారు కళంకులు నిందలుగలవారై విందుల్లో మీతో పాల్గొని తిని త్రాగి ఆనందిస్తారు.

  9. 2 పేతురు 2:14సుమారు క్రీ.శ. 66

    వ్యభిచారం నిండిన కళ్లతో, పాపం చేయడం వారెప్పటికి మానరు; వారు అస్థిరమైన వ్యక్తులను ప్రలోభపెడతారు; వారు దురాశ కోసం వారి హృదయాలకు శిక్షణనిచ్చారు; వీరు శాపగ్రస్తులైన పిల్లలు!

  10. 2 పేతురు 2:15సుమారు క్రీ.శ. 66

    వారు సరియైన మార్గాన్ని విడిచిపెట్టి, దుష్టత్వానికి వచ్చే జీతాన్ని ప్రేమించిన బెయోరు కుమారుడైన బిలాము మార్గాన్ని అనుసరించడానికి వెళ్లారు.

  11. 2 పేతురు 2:16సుమారు క్రీ.శ. 66

    అయితే అతడు తన చెడు కార్యాన్ని బట్టి ఒక గాడిద చేత గద్దింపబడ్డాడు, ఒక మాట్లాడలేని జంతువు మానవ స్వరంతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డుకున్నది.

  12. 2 పేతురు 2:17సుమారు క్రీ.శ. 66

    వీరు నీళ్లు లేని ఊటల వంటివారు. తుఫాను తీవ్రతకు కొట్టుకొని పోవు మేఘాల వంటివారు. కటిక చీకటి వారి కోసం సిద్ధపరచబడింది.

  13. 2 పేతురు 2:18సుమారు క్రీ.శ. 66

    ఎందుకంటే, వారి మాటలు వట్టివి డాంబికమైనవి, వారు శరీర సంబంధమైన దురాశలు కలవారై, చెడు మార్గంలో జీవిస్తూ అప్పుడే తప్పించుకున్నవారికి పోకిరి చేష్టలను ఎరగా చూపించి ప్రలోభపెడతారు.

  14. 2 పేతురు 2:19సుమారు క్రీ.శ. 66

    తామే దుర్నీతికి బానిసలై ఉండి, అలాంటి వారికి స్వాతంత్ర్యం ఇస్తామని చెప్తారు. ఎందుకంటే “ఒకరు దేని చేతిలో ఓడిపోతారో దానికే దాసులవుతారు.”

  15. 2 పేతురు 2:20సుమారు క్రీ.శ. 66

    మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తును తెలుసుకోవడం వల్ల లోకంలోని పాపం నుండి తప్పించుకుని, మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడితే, వారి చివరి స్థితి మొదటి స్ధితి కన్నా దారుణంగా ఉంటుంది.

  16. 2 పేతురు 2:21సుమారు క్రీ.శ. 66

    వారు నీతి మార్గాన్ని తెలుసుకొని వారికి ఇవ్వబడిన పరిశుద్ధ ఆజ్ఞల నుండి వెనుకకు తిరిగితే, ఆ మార్గం వారికి తెలియక పోవడమే మంచిది.

  17. 2 పేతురు 2:22సుమారు క్రీ.శ. 66

    “కుక్క తను కక్కిన దానికి తిరిగినట్లు, కడుగబడిన పంది బురదలో దొర్లడానికి మళ్లినట్లు” అనే సామెతలు వీరి విషయంలో నిజం.

  18. 2 పేతురు 3:1సుమారు క్రీ.శ. 66

    ప్రియ స్నేహితుల్లారా, ఇది మీకు వ్రాస్తున్న నా రెండవ పత్రిక. మీలో పరిపూర్ణమైన ఆలోచనను ప్రేరేపించడానికి జ్ఞాపకం చేయాలని ఈ రెండు పత్రికలను మీకు వ్రాశాను.

  19. 2 పేతురు 3:2సుమారు క్రీ.శ. 66

    పూర్వకాలంలో పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలుకబడిన వాక్యాలను, మన ప్రభువైన రక్షకుని వలన అపొస్తలుల ద్వారా మీకు ఇవ్వబడిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను.

  20. 2 పేతురు 3:3సుమారు క్రీ.శ. 66

    అన్నిటికి మించి, అంత్యదినాలలో తమ చెడు కోరికలనే అనుసరించే అపహాసకులు వస్తారని మీరు గ్రహించాలి.

  21. 2 పేతురు 3:4సుమారు క్రీ.శ. 66

    “ ‘వస్తాను’ అని ఆయన చేసిన వాగ్దానం ఎక్కడ ఉంది? మన పితరులు ఎప్పుడో చనిపోయారు, సృష్టి ఆరంభం నుండి ఎలా ఉందో, మార్పు లేకుండా అంతా అలాగే జరుగుతుంది” అని వారు చెప్తారు.

  22. 2 పేతురు 3:5సుమారు క్రీ.శ. 66

    అయితే, పూర్వకాలంలో దేవుని వాక్యం వలన ఆకాశాలు సృజింపబడ్డాయని, నీళ్ల నుండి నీళ్ల ద్వారా భూమి ఏర్పడిందని వారు ఉద్దేశపూర్వకంగా మరచిపోతారు.

  23. 2 పేతురు 3:6సుమారు క్రీ.శ. 66

    ఈ నీళ్ల వల్లనే, అప్పటి లోకం ముంచివేయబడి నాశనం చేయబడింది.

  24. 2 పేతురు 3:7సుమారు క్రీ.శ. 66

    అదే వాక్యం వల్ల ఇప్పుడున్న భూమి, ఆకాశాలు దహించబడడానికి ఉంచబడ్డాయి, భక్తిహీనులు నాశనం కొరకై తీర్పు దినం వరకు భద్రపరచబడి ఉంటారు.

  25. 2 పేతురు 3:8సుమారు క్రీ.శ. 66

    కాని ప్రియ స్నేహితుల్లారా, ఈ ఒక్క విషయాన్ని మరువకండి: దేవుని దృష్టిలో ఒక రోజు వెయ్యి సంవత్సరాల్లా, వెయ్యి సంవత్సరాలు ఒక రోజులా ఉన్నాయి.