కంటెంట్‌కు వెళ్లండి

circa 1406–1380 BC

Conquest of Canaan

Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.

658 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. యెహోషువ 15:50సుమారు క్రీ.పూ. 1443

    అనాబు, ఎష్టెమో, అనీము,

  2. యెహోషువ 15:51సుమారు క్రీ.పూ. 1443

    గోషేను, హోలోను గిలోహు, మొత్తం పదకొండు పట్టణాలు వాటి గ్రామాలు.

  3. యెహోషువ 15:52సుమారు క్రీ.పూ. 1443

    అరబు, దూమా, ఎషాను,

  4. యెహోషువ 15:53సుమారు క్రీ.పూ. 1443

    యానీము, బేత్-తప్పూయ, ఆఫెకా,

  5. యెహోషువ 15:54సుమారు క్రీ.పూ. 1443

    హుమ్తా, కిర్యత్-అర్బా (అదే హెబ్రోను) సీయోరు మొత్తం తొమ్మిది పట్టణాలు వాటి గ్రామాలు.

  6. యెహోషువ 15:55సుమారు క్రీ.పూ. 1443

    మాయోను, కర్మెలు, జీఫు, యుత్తా,

  7. యెహోషువ 15:56సుమారు క్రీ.పూ. 1443

    యెజ్రెయేలు, యొక్దెయాము, జానోహ

  8. యెహోషువ 15:57సుమారు క్రీ.పూ. 1443

    కయీను, గిబియా, తిమ్నా అనేవి మొత్తం పది పట్టణాలు, వారి గ్రామాలు.

  9. యెహోషువ 15:58సుమారు క్రీ.పూ. 1443

    హల్హూలు, బేత్-సూరు, గెదోరు,

  10. యెహోషువ 15:59సుమారు క్రీ.పూ. 1443

    మారాతు, బేత్-అనోతు, ఎల్తెకోను అనేవి మొత్తం ఆరు పట్టణాలు, వాటి గ్రామాలు.

  11. యెహోషువ 15:60సుమారు క్రీ.పూ. 1443

    కిర్యత్-బయలు (అంటే కిర్యత్-యారీము), రబ్బా అనేవి మొత్తం రెండు పట్టణాలు, వాటి గ్రామాలు.

  12. యెహోషువ 15:61సుమారు క్రీ.పూ. 1443

    అరణ్యంలో: బేత్-అరాబా, మిద్దీను, సెకాకా,

  13. యెహోషువ 15:62సుమారు క్రీ.పూ. 1443

    నిబ్షాను, ఉప్పు పట్టణం, ఎన్-గేదీ అనేవి మొత్తం ఆరు పట్టణాలు, వాటి గ్రామాలు.

  14. యెహోషువ 15:63సుమారు క్రీ.పూ. 1443

    యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయులను యూదా వారు వెళ్లగొట్టలేకపోయారు; నేటి వరకు యెబూసీయులు యూదా ప్రజలతో కలిసి అక్కడ నివసిస్తున్నారు.

  15. యెహోషువ 16:1సుమారు క్రీ.పూ. 1443

    యోసేపు సంతతివారికి చీట్ల వల్ల వచ్చిన భూభాగం తూర్పున ఉన్న యెరికో నీటి ఊటల దగ్గర యొర్దాను నుండి మొదలై ఎడారి గుండా బేతేలు కొండసీమ లోపలి వరకు ఉంది.

  16. యెహోషువ 16:2సుమారు క్రీ.పూ. 1443

    అది లూజు అనబడే బేతేలు వరకు వెళ్లి అతారోతులో ఉన్న అర్కీయుల భూభాగం దాటి,

  17. యెహోషువ 16:3సుమారు క్రీ.పూ. 1443

    దిగువ బేత్-హోరోను ప్రాంతం వరకు పడమటివైపుగా యఫ్లెతీయుల భూభాగం వరకు, మధ్యధరా సముద్రం దగ్గర ముగిసే గెజెరు వరకు దిగారు.

  18. యెహోషువ 16:4సుమారు క్రీ.పూ. 1443

    అక్కడ యోసేపు వంశస్థులైన మనష్షే, ఎఫ్రాయిం వారి వారసత్వాన్ని పొందారు.

  19. యెహోషువ 16:5సుమారు క్రీ.పూ. 1443

    ఎఫ్రాయిమీయుల వంశాల ప్రకారం వారి సరిహద్దు ఈ విధంగా: వారి వారసత్వపు సరిహద్దు తూర్పున అతారోత్-అద్దారు నుండి ఎగువ బేత్-హోరోను వరకు వెళ్లి,

  20. యెహోషువ 16:6సుమారు క్రీ.పూ. 1443

    మధ్యధరా సముద్రం వరకు కొనసాగింది. దానికి ఉత్తరాన ఉన్న మిక్మెతాతు నుండి అది తూర్పున తానత్ షిలోహు వరకు తిరిగి, తూర్పున ఉన్న యానోహ వరకు వెళ్లింది.

  21. యెహోషువ 16:7సుమారు క్రీ.పూ. 1443

    అది యానోహ నుండి అతారోతు, నయరా వైపుకు దిగి, యెరికోను తాకి, యొర్దాను దగ్గర అంతమయ్యింది.

  22. యెహోషువ 16:8సుమారు క్రీ.పూ. 1443

    తప్పూయ నుండి ఆ సరిహద్దు కానా కనుమ వరకు పడమటి వైపుగా వెళ్లి సముద్రం దగ్గర అంతమయ్యింది. ఇది ఎఫ్రాయిం గోత్రం వారికి వారి వంశాల ప్రకారం లభించిన వారసత్వము.

  23. యెహోషువ 16:9సుమారు క్రీ.పూ. 1443

    మనష్షే వారి వారసత్వంలో ఎఫ్రాయిమీయుల కోసం కేటాయించబడిన అన్ని పట్టణాలు, వాటి గ్రామాలు కూడా ఉన్నాయి.

  24. యెహోషువ 16:10సుమారు క్రీ.పూ. 1443

    గెజెరులో నివసిస్తున్న కనానీయులను వారు వెళ్లగొట్టలేదు; ఈ రోజు వరకు కనానీయులు ఎఫ్రాయిం ప్రజలమధ్య నివసిస్తూ దాసులుగా కష్టపడి పని చేస్తున్నారు.

  25. యెహోషువ 17:1సుమారు క్రీ.పూ. 1443

    యోసేపు మొదటి సంతానంగా మనష్షే గోత్రానికి కేటాయించబడిన భాగం ఇదే. మనష్షే మొదటి కుమారుడు, గిలాదీయుల పూర్వికుడైన మాకీరుకు గిలాదు, బాషానులు ఇవ్వబడ్డాయి ఎందుకంటే మాకీరీయులు గొప్ప సైనికులు.