కంటెంట్‌కు వెళ్లండి

circa 1406–1380 BC

Conquest of Canaan

Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.

658 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. యెహోషువ 12:22సుమారు క్రీ.పూ. 1450

    కెదెషు రాజు ఒక్కడు కర్మెలులోని యొక్నీము రాజు ఒక్కడు

  2. యెహోషువ 12:23సుమారు క్రీ.పూ. 1450

    దోరు రాజు (నఫోత్ దోరు లోని) ఒక్కడు గిల్గాలులో గోయీం రాజు ఒక్కడు

  3. యెహోషువ 12:24సుమారు క్రీ.పూ. 1450

    తిర్సా రాజు ఒక్కడు

  4. యెహోషువ 13:1సుమారు క్రీ.పూ. 1444

    యెహోషువ ముసలివాడయ్యాక, యెహోవా అతనితో, “నీవు ముసలివాడవయ్యావు, ఇంకా చాలా ప్రాంతాలు స్వాధీనం చేసుకోవలసి ఉంది.

  5. యెహోషువ 13:2సుమారు క్రీ.పూ. 1444

    “ఇంకా మిగిలి ఉన్న ప్రాంతాలు: “ఫిలిష్తీయుల, గెషూరీయుల అన్ని ప్రాంతాలు,

  6. యెహోషువ 13:3సుమారు క్రీ.పూ. 1444

    కనానీయులవని పిలువబడిన ఈజిప్టు తూర్పున ఉన్న షీహోరు నది నుండి ఉత్తరాన ఎక్రోను భూభాగం వరకు, అయిదుగురు ఫిలిష్తీయ పాలకులకు సంబంధించిన గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోను; ఆవీయుల భూభాగం,

  7. యెహోషువ 13:4సుమారు క్రీ.పూ. 1444

    దక్షిణాన; సీదోనీయుల ఆరా నుండి ఆఫెకు, అమోరీయుల సరిహద్దుల వరకు ఉన్న కనానీయుల దేశమంతా;

  8. యెహోషువ 13:5సుమారు క్రీ.పూ. 1444

    గెబాలీయుల ప్రాంతం; హెర్మోను పర్వతం క్రింద బయల్-గాదు నుండి లెబో హమాతు వరకు తూర్పున ఉన్న లెబానోను ప్రాంతమంతా.

  9. యెహోషువ 13:6సుమారు క్రీ.పూ. 1444

    “లెబానోను నుండి మిస్రెఫోత్-మయీము వరకు ఉన్న పర్వత ప్రాంతాల నివాసులందరిని అంటే, సీదోనీయులందరినీ ఇశ్రాయేలీయుల ముందు నుండి నేనే వారిని వెళ్లగొడతాను. నేను నీకు ఆజ్ఞాపించినట్లుగా ఈ భూమిని ఇశ్రాయేలుకు వారసత్వంగా ఇవ్వాలి,

  10. యెహోషువ 13:7సుమారు క్రీ.పూ. 1444

    దానిని తొమ్మిది గోత్రాలకు, మనష్షే అర్థగోత్రానికి వారసత్వంగా పంచి ఇవ్వాలి” అని చెప్పారు.

  11. యెహోషువ 13:8సుమారు క్రీ.పూ. 1444

    మనష్షే గోత్రంలో మిగిలిన సగభాగం, రూబేనీయులు, గాదీయులు యొర్దాను తూర్పున యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన విధంగా యొర్దాను తూర్పున వారసత్వంగా పొందారు.

  12. యెహోషువ 13:9సుమారు క్రీ.పూ. 1444

    ఇది అర్నోను కొండగట్టు అంచున ఉన్న అరోయేరు నుండి, కొండగట్టు మధ్యలో ఉన్న పట్టణం నుండి, మెదెబా మొత్తం పీఠభూమితో సహా దీబోను వరకు విస్తరించి ఉంది,

  13. యెహోషువ 13:10సుమారు క్రీ.పూ. 1444

    హెష్బోనులో అమ్మోనీయుల సరిహద్దు వరకు పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోను పట్టణాలన్ని ఉన్నాయి.

  14. యెహోషువ 13:11సుమారు క్రీ.పూ. 1444

    అందులో గిలాదు, గెషూరు, మయకా ప్రజల భూభాగం, హెర్మోను పర్వతం మొత్తం, సలేకా వరకు ఉన్న బాషాను కూడా ఉన్నాయి,

  15. యెహోషువ 13:12సుమారు క్రీ.పూ. 1444

    అంటే, అష్తారోతు ఎద్రెయీలో పాలించిన బాషానులోని ఓగు రాజ్యం మొత్తము. (అతడు రెఫాయీయులలో చివరివాడు.) మోషే వారిని ఓడించి వారి భూమిని స్వాధీనం చేసుకున్నాడు.

  16. యెహోషువ 13:13సుమారు క్రీ.పూ. 1444

    కానీ ఇశ్రాయేలీయులు గెషూరు, మయకా ప్రజలను బయటకు వెళ్లగొట్టలేదు, కాబట్టి వారు ఇప్పటికీ ఇశ్రాయేలీయుల మధ్యనే నివసిస్తున్నారు.

  17. యెహోషువ 13:14సుమారు క్రీ.పూ. 1444

    కానీ లేవీ గోత్రానికి అతడు ఎలాంటి వారసత్వాన్ని ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన వారికి వాగ్దానం చేసినట్లు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు అర్పించబడిన హోమబలులే వారి వారసత్వము.

  18. యెహోషువ 13:15సుమారు క్రీ.పూ. 1444

    రూబేను గోత్రం వారికి వారి వంశాల ప్రకారం మోషే వారికిచ్చింది:

  19. యెహోషువ 13:16సుమారు క్రీ.పూ. 1444

    అర్నోను నది లోయ ప్రక్కన ఉన్న అరోయేరు లోయ మొదలుకొని ఆ లోయలో ఉన్న పట్టణం నుండి మెదెబా దగ్గరి పూర్తి మైదానం,

  20. యెహోషువ 13:17సుమారు క్రీ.పూ. 1444

    ఇదీగాక హెష్బోను దాని మైదానంలోని పట్టణాలన్ని, దీబోను, బామోత్ బయలు బేత్-బయల్-మెయోను,

  21. యెహోషువ 13:18సుమారు క్రీ.పూ. 1444

    యహజు, కెదేమోతు, మెఫాతు,

  22. యెహోషువ 13:19సుమారు క్రీ.పూ. 1444

    కిర్యతాయిము, షిబ్మా లోయలో ఉన్న కొండ మీది శెరెత్ షహరు,

  23. యెహోషువ 13:20సుమారు క్రీ.పూ. 1444

    బేత్-పెయోరు, పిస్గా కొండచరియలు, బేత్-యెషిమోతు,

  24. యెహోషువ 13:21సుమారు క్రీ.పూ. 1444

    మైదానంలోని పట్టణాలన్ని, హెష్బోనులో పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోను రాజ్యం మొత్తం వారసత్వంగా ఇచ్చాడు. మోషే అతన్ని, ఆ దేశంలో నివసించిన సీహోనుతో జతకట్టిన మిద్యానీయుల ప్రధానులైన ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ అనే వారిని ఓడించాడు.

  25. యెహోషువ 13:22సుమారు క్రీ.పూ. 1444

    ఇశ్రాయేలీయులు యుద్ధంలో చంపినవారితో పాటు, బెయోరు కుమారుడైన భవిష్యవాణి చెప్పే బిలామును కత్తితో చంపారు.