కంటెంట్‌కు వెళ్లండి

circa 1406–1380 BC

Conquest of Canaan

Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.

658 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. యెహోషువ 13:23సుమారు క్రీ.పూ. 1444

    రూబేనీయుల సరిహద్దు యొర్దాను నది తీరము. ఈ పట్టణాలు, వాటి గ్రామాలు రూబేనీయులకు వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఇవ్వబడ్డాయి.

  2. యెహోషువ 13:24సుమారు క్రీ.పూ. 1444

    గాదు గోత్రానికి దాని వంశాల ప్రకారం మోషే ఇచ్చింది ఇదే:

  3. యెహోషువ 13:25సుమారు క్రీ.పూ. 1444

    యాజెరు ప్రాంతం, గిలాదు పట్టణాలన్ని, అమ్మోనీయుల దేశంలో సగం అంటే రబ్బాకు సమీపంలో ఉన్న అరోయేరు వరకు;

  4. యెహోషువ 13:26సుమారు క్రీ.పూ. 1444

    హెష్బోను నుండి రామాత్ మిస్పే, బెతోనీము వరకు, మహనయీము నుండి దెబీరు ప్రాంతం వరకు;

  5. యెహోషువ 13:27సుమారు క్రీ.పూ. 1444

    లోయలో, బేత్-హారాము, బేత్-నిమ్రా, సుక్కోతు, సాఫోను, హెష్బోను రాజైన సీహోను యొక్క ప్రాంతం (యొర్దాను తూర్పు వైపు, కిన్నెరెతు సముద్రం చివరి వరకు ఉన్న ప్రాంతం).

  6. యెహోషువ 13:28సుమారు క్రీ.పూ. 1444

    ఈ పట్టణాలు, వాటి గ్రామాలు గాదీయులకు వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఇవ్వబడ్డాయి.

  7. యెహోషువ 13:29సుమారు క్రీ.పూ. 1444

    మోషే మనష్షే యొక్క అర్థగోత్రానికి, అంటే మనష్షే వంశస్థుల సగం కుటుంబానికి, దాని వంశాల ప్రకారం ఇచ్చింది ఇదే:

  8. యెహోషువ 13:30సుమారు క్రీ.పూ. 1444

    వారి సరిహద్దు మహనయీము నుండి బాషాను రాజైన ఓగు రాజ్యం మొత్తం, అంటే బాషానులోని యాయీరు స్థిరనివాసాలైన అరవై పట్టణాలు,

  9. యెహోషువ 13:31సుమారు క్రీ.పూ. 1444

    గిలాదులో సగం, అష్తారోతు, ఎద్రెయీ (బాషానులోని ఓగు యొక్క రాజ పట్టణాలు).

  10. యెహోషువ 13:32సుమారు క్రీ.పూ. 1444

    యెరికోకు తూర్పున యొర్దాను అవతల మోయాబు సమతల మైదానంలో ఉన్నప్పుడు మోషే ఇచ్చిన వారసత్వం ఇదే.

  11. యెహోషువ 13:33సుమారు క్రీ.పూ. 1444

    కానీ లేవీ గోత్రానికి, మోషే వారసత్వం ఇవ్వలేదు; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారికి వాగ్దానం చేసినట్లు ఆయనే వారి స్వాస్థ్యము.

  12. యెహోషువ 14:1సుమారు క్రీ.పూ. 1444

    ఇవి ఇశ్రాయేలీయులు కనాను దేశంలో వారసత్వంగా పొందిన ప్రాంతాలు, వీటిని యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు గోత్ర వంశ పెద్దలు వారికి కేటాయించారు.

  13. యెహోషువ 14:2సుమారు క్రీ.పూ. 1444

    యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లుగా, తొమ్మిదిన్నర గోత్రాలకు చీటి ద్వారా వారి వారసత్వాలు కేటాయించబడ్డాయి.

  14. యెహోషువ 14:3సుమారు క్రీ.పూ. 1444

    మోషే యొర్దాను తూర్పున ఉన్న రెండున్నర గోత్రాలకు వారి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు కానీ మిగిలిన వాటిలో లేవీయులకు వారసత్వం ఇవ్వలేదు,

  15. యెహోషువ 14:4సుమారు క్రీ.పూ. 1444

    ఎందుకంటే యోసేపు సంతతివారైన మనష్షే, ఎఫ్రాయిములు రెండు గోత్రాలుగా అయ్యారు. లేవీయులకు భూమిలో వాటా లేదు, కానీ వారి మందలు, గొర్రెల మందల కోసం పచ్చికబయళ్లు, నివసించడానికి పట్టణాలు మాత్రమే పొందుకున్నారు.

  16. యెహోషువ 14:5సుమారు క్రీ.పూ. 1444

    కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు దేశాన్ని విభజించారు.

  17. యెహోషువ 14:6సుమారు క్రీ.పూ. 1444

    యూదా ప్రజలు గిల్గాలులో ఉన్న యెహోషువ దగ్గరకు వచ్చి, కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో, “నీ గురించి, నా గురించి కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా ఏమి చెప్పారో నీకు తెలుసు.

  18. యెహోషువ 14:7సుమారు క్రీ.పూ. 1444

    యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నియా నుండి దేశాన్ని పరిశోధించడానికి నన్ను పంపినప్పుడు నాకు నలభై సంవత్సరాలు. నా నమ్మకం ప్రకారం నేను అతనికి ఒక నివేదికను తీసుకువచ్చాను,

  19. యెహోషువ 14:8సుమారు క్రీ.పూ. 1444

    కానీ నాతో వచ్చిన నా తోటి ఇశ్రాయేలీయులు ప్రజల గుండెలు భయంతో కరిగిపోయేలా చేశారు. అయితే, నేను నా దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా అనుసరించాను.

  20. యెహోషువ 14:9సుమారు క్రీ.పూ. 1444

    కాబట్టి ఆ రోజున మోషే నాతో ప్రమాణం చేసి, ‘నీవు నా దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా అనుసరించావు కాబట్టి నీవు అడుగుపెట్టిన దేశం నీకు, నీ పిల్లలకు శాశ్వత వారసత్వంగా ఉంటుంది’ అని చెప్పాడు.

  21. యెహోషువ 14:10సుమారు క్రీ.పూ. 1444

    “యెహోవా వాగ్దానం చేసినట్లుగా, ఆయన మోషేతో ఈ మాట చెప్పినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరిగిన ఈ నలభై అయిదు సంవత్సరాలు నన్ను బ్రతికించారు. ఇప్పుడు నాకు ఎనభై అయిదు సంవత్సరాలు!

  22. యెహోషువ 14:11సుమారు క్రీ.పూ. 1444

    మోషే నన్ను బయటకు పంపిన రోజు ఎంత బలంగా ఉన్నానో ఈ రోజు కూడా అంతే బలంగా ఉన్నాను; నేను అప్పటిలాగే ఇప్పుడు కూడా యుద్ధానికి వెళ్లడానికి చాలా శక్తివంతంగా ఉన్నాను.

  23. యెహోషువ 14:12సుమారు క్రీ.పూ. 1444

    ఆ రోజు యెహోవా నాకు వాగ్దానం చేసిన ఈ కొండ సీమను ఇప్పుడు నాకు ఇవ్వండి. అనాకీయులు అక్కడ ఉన్నారని, వారి పట్టణాలు కోటగోడలతో విశాలంగా ఉన్నాయని అప్పుడు నీవే స్వయంగా విన్నావు. అయితే, యెహోవా నాకు సహాయం చేస్తున్నారు, ఆయన చెప్పినట్లుగానే నేను వారిని వెళ్లగొడతాను” అని చెప్పాడు.

  24. యెహోషువ 14:13సుమారు క్రీ.పూ. 1444

    అప్పుడు యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబును దీవించి అతనికి హెబ్రోనును వారసత్వంగా ఇచ్చాడు.

  25. యెహోషువ 14:14సుమారు క్రీ.పూ. 1444

    అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను హృదయమంతటితో అనుసరించాడు కాబట్టి అప్పటినుండి హెబ్రోను కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడు కాలేబుకు వారసత్వంగా ఉంది.