కంటెంట్‌కు వెళ్లండి

Judah

244 వచనాలు · 20 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Judas, Juda

Judah ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యూదా ప్రజలు గిల్గాలులో ఉన్న యెహోషువ దగ్గరకు వచ్చి, కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో, “నీ గురించి, నా గురించి కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా ఏమి చెప్పారో నీకు తెలుసు.

  2. యూదా గోత్రానికి దాని వంశాల ప్రకారం కేటాయించబడిన భాగం, ఎదోము సరిహద్దు వరకు, దక్షిణాన సీను ఎడారి వరకు విస్తరించి ఉంది.

  3. పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్ర తీరప్రాంతము.

  4. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబుకు యూదాలో ఒక భాగాన్ని అనగా కిర్యత్-అర్బాను, అంటే హెబ్రోనును ఇచ్చాడు. (అర్బా అనాకు యొక్క పూర్వికుడు.)

  5. ఇది యూదా గోత్రానికి దాని వంశాల ప్రకారం కేటాయించబడిన వారసత్వం:

  6. ఎదోము సరిహద్దు వైపున దక్షిణ ప్రాంతంలోని యూదా గోత్రానికి చెందిన దక్షిణాన ఉన్న పట్టణాలు: కబ్సెయేలు, ఏదెరు, యాగూరు,

  7. యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయులను యూదా వారు వెళ్లగొట్టలేకపోయారు; నేటి వరకు యెబూసీయులు యూదా ప్రజలతో కలిసి అక్కడ నివసిస్తున్నారు.

  8. మీరు భూమిని ఏడు భాగాలుగా విభజించాలి. యూదా వారు దక్షిణాన ఉన్న తన ప్రాంతంలోనూ, యోసేపు గోత్రాలు ఉత్తరాన ఉన్న తమ ప్రాంతాల్లోనూ ఉండాలి.

  9. బెన్యామీను గోత్రానికి వారి వంశాల ప్రకారం మొదటి చీటి వచ్చింది. వారికి కేటాయించబడిన భూభాగం యూదా, యోసేపు గోత్రాల మధ్య ఉంది.

  10. అక్కడినుండి దక్షిణాన బేత్-హోరోనుకు ఎదురుగా ఉన్న కొండ నుండి పడమటి దిక్కున దక్షిణంగా సాగి యూదా వారి పట్టణమైన కిర్యత్-బయలు అనే కిర్యత్-యారీము దగ్గర అంతమయ్యింది. ఇది పడమటి సరిహద్దు.

  11. రెండవ చీటి షిమ్యోను గోత్రానికి దాని వంశాల ప్రకారం వచ్చింది. వారి వారసత్వం యూదా భూభాగంలో ఉంది.

  12. యూదా వాటా వారికి ఎక్కువగా ఉన్నందున షిమ్యోనీయుల వారసత్వం యూదా వాటా నుండి తీసుకోబడింది. కాబట్టి షిమ్యోనీయులు యూదా భూభాగంలో తమ వారసత్వాన్ని పొందారు.

  13. దాని సరిహద్దు పశ్చిమాన అస్నోత్-తాబోరు గుండా వెళ్లి హుక్కోకు దగ్గరకు వచ్చింది. అది దక్షిణాన జెబూలూను, పశ్చిమాన ఆషేరు, యూదా, తూర్పున యొర్దాను తాకింది.

  14. కాబట్టి వారు నఫ్తాలి కొండ సీమలోని గలిలయలో ఉన్న కెదెషును, ఎఫ్రాయిం కొండ సీమలోని షెకెమును, యూదా కొండ సీమలోని కిర్యత్-అర్బాను (అంటే హెబ్రోను) ప్రత్యేకపరిచారు.

  15. కహాతీయులకు వారి వంశాల ప్రకారం మొదటి చీటి వచ్చింది. యాజకుడైన అహరోను సంతతివారైన లేవీయులకు యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు.

  16. వారు యూదా, షిమ్యోను గోత్రాల నుండి క్రింద చెప్పిన పట్టణాలను కేటాయించారు.

  17. వారు యూదా కొండ సీమలోని కిర్యత్-అర్బాను (అంటే హెబ్రోను) దాని చుట్టూ ఉన్న పచ్చికబయళ్లతో పాటు వారికి ఇచ్చారు. (అర్బా అనాకు పితరుడు.)

  18. యెహోవా జవాబిస్తూ, “యూదా వారు వెళ్లాలి; నేను ఆ దేశాన్ని వారి చేతికి అప్పగించాను” అన్నారు.

  19. యూదా గోత్రం వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోను గోత్రం వారితో, “మాకు కేటాయించబడిన భూభాగంలో ఉన్న కనానీయులతో యుద్ధానికి మాతో పాటు రండి. అలాగే మీతో పాటు మేము కూడా మీ భూభాగం కోసం వస్తాం” అన్నారు. కాబట్టి షిమ్యోనీయులు వారితో వెళ్లారు.

  20. యూదా దాడి చేసినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజ్జీయులను వారి చేతికి అప్పగించారు; వారు బెజెకు దగ్గర పదివేలమంది పురుషులను హతం చేశారు.

  21. యూదా వారు యెరూషలేము మీద దాడి చేసి దానిని పట్టుకుని అక్కడి ప్రజలను ఖడ్గంతో చంపి, వారు పట్టణాన్ని కాల్చివేశారు.

  22. ఆ తర్వాత యూదా వారు కొండ సీమలో, దక్షిణ దేశంలో, పశ్చిమ కొండ దిగువ ప్రాంతంలో ఉన్న కనానీయులతో పోరాడటానికి వెళ్లారు.

  23. వారు గతంలో కిర్యత్-అర్బా అని పిలువబడిన హెబ్రోనులో ఉన్న కనానీయుల మీదికి వెళ్లి షేషయి అహీమాను తల్మయి అనే వారిని ఓడించారు.

  24. కెనీయుడైన మోషే మామ యూదా ప్రజలతో ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా ఎడారికి వెళ్లి అక్కడ ఉన్నవారితో నివసించారు.

  25. తర్వాత యూదా వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోనీయులతో వెళ్లి జెఫతులో నివసిస్తున్న కనానీయులపై దాడి చేసి, పట్టణాన్ని పూర్తిగా నాశనం చేశారు. కాబట్టి ఆ పట్టణానికి హోర్మా అని పేరు పెట్టారు.