కంటెంట్‌కు వెళ్లండి

Judah

244 వచనాలు · 20 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Judas, Juda

Judah ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రాజదండం యూదా దగ్గర నుండి తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండం తొలగదు, అది ఎవరికి చెందుతుందో అతడు వచ్చేవరకు తొలగదు, దేశాలు అతనికి విధేయులై ఉంటాయి.

  2. రూబేను, షిమ్యోను, లేవీ, యూదా;

  3. “చూడు, నేను యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును ఏర్పరచుకొని,

  4. తర్వాత మోషే ఇశ్రాయేలీయులతో, “చూడండి, యెహోవా యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును ఏర్పరచుకొని,

  5. యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడు హూరు మనుమడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాడు;

  6. యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను;

  7. యూదా సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.

  8. యూదా గోత్రం నుండి లెక్కించబడినవారు 74,600.

  9. తూర్పున, సూర్యుడు ఉదయించే వైపు: యూదా శిబిరానికి చెందిన దళాలవారు తమ జెండాల దగ్గర దిగాలి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా ప్రజల నాయకుడు.

  10. యూదా శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన పురుషులందరు, 1,86,400. వారు ముందుగా వెళ్తారు.

  11. మొదటి రోజు తన అర్పణను తెచ్చిన వారు యూదా గోత్రానికి చెందిన అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను.

  12. యూదా శిబిరం యొక్క విభజనలు వారి పతాకాన్ని పట్టుకుని ముందుగా వెళ్లాయి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా గోత్రం వారిని నడిపించాడు.

  13. యూదా గోత్రం నుండి యెఫున్నె కుమారుడైన కాలేబు;

  14. యూదా కుమారులు ఏరు ఓనాను, కానీ వారు కనాను దేశంలో చనిపోయారు.

  15. యూదా వారసులు వారి వంశాల ప్రకారం: షేలా ద్వార, షేలాహీయుల వంశం; పెరెసు ద్వార, పెరెజీయుల వంశం; జెరహు ద్వార, జెరహీయుల వంశము.

  16. ఇవి యూదా వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 76,500.

  17. “వారి పేర్లు ఇవి: “యూదా గోత్రం నుండి, యెఫున్నె కుమారుడైన కాలేబు;

  18. మీరు యొర్దాను నది దాటిన తర్వాత, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రాల వారు గెరిజీము పర్వతం మీద నిలబడి ప్రజలను దీవించాలి.

  19. యూదా గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా, యూదా మొరను వినండి; అతని ప్రజల దగ్గరకు అతన్ని చేర్చండి. అతడు తన చేతులతో తన కోసం పోరాడేలా, అతని శత్రువులకు వ్యతిరేకంగా అతనికి సహాయంగా ఉండండి!”

  20. నఫ్తాలి ప్రాంతమంతటిని, ఎఫ్రాయిం మనష్షేల ప్రాంతాలను, పశ్చిమదిక్కున ఉన్న మధ్యధరా సముద్రం వరకు ఉన్న యూదా ప్రాంతాన్ని,

  21. శపించబడిన వాటి విషయంలో ఇశ్రాయేలీయులు నమ్మకద్రోహులుగా ఉన్నారు. యూదా గోత్రపు వాడైన జెరహు కుమారుడు జబ్ది, జబ్ది కుమారుడు కర్మీ, కర్మీ కుమారుడైన ఆకాను వాటిలో కొన్నిటిని తీసుకున్నాడు. కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలీయులపై రగులుకుంది.

  22. మరుసటిరోజు తెల్లవారుజామున యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను గోత్రాల ప్రకారం ముందుకు రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టుబడింది.

  23. యూదా వంశాలు ముందుకు వచ్చినప్పుడు జెరహీయులు పట్టుబడ్డారు. అతడు జెరహీయుల వంశాన్ని కుటుంబాల ప్రకారం ముందుకు వచ్చినప్పుడు జబ్ది ఎంపిక చేయబడ్డాడు.

  24. యెహోషువ అతని కుటుంబాన్ని ఒక్కొక్కరిగా ముందుకు రప్పించగా, యూదా గోత్రానికి చెందిన జెరహు కుమారుడైన జిమ్రీ, జిమ్రీ కుమారుడైన కర్మీ, కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడ్డాడు.

  25. ఆ సమయంలో యెహోషువ వెళ్లి కొండ ప్రాంతంలో అనగా హెబ్రోను, దెబీరు, అనాబు, యూదా, ఇశ్రాయేలు కొండ ప్రాంతమంతా నివసించిన అనాకీయులందరినీ, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేశాడు.