కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నేను ఎఫ్రాయిమును, అందమైన స్థలంలో నాటబడిన తూరులా చూశాను. కాని ఎఫ్రాయిం తన పిల్లలను, వధించే వాని దగ్గరకు తెస్తుంది.”

  2. యెహోవా, వారికి ఇవ్వండి, వారికి మీరేమి ఇస్తారు, జన్మనివ్వలేని గర్భాలను, ఎండిపోయిన రొమ్ములను వారికి ఇవ్వండి.

  3. “గిల్గాలులో వారి చెడుతనం అంతటిని బట్టి, అక్కడ వారిని ద్వేషిస్తున్నాను. వారు పాప క్రియలనుబట్టి, నేను వారిని నా మందిరంలో నుండి వెళ్లగొడతాను. నేను ఇక ఎన్నడూ వారిని ప్రేమించను; వారి నాయకులంతా తిరుగుబాటుదారులు.

  4. ఎఫ్రాయిమువారు మొత్తబడ్డారు, వారి వేరు ఎండిపోయింది, వారు ఇక ఫలించరు. ఒకవేళ వారు పిల్లలు కన్నా, వారి ప్రియమైన సంతతిని నేను నాశనం చేస్తాను.”

  5. వారు నా దేవునికి లోబడలేదు కాబట్టి, ఆయన వారిని తిరస్కరించారు; వారు ఇతర దేశాల్లో తిరుగుతూ ఉంటారు.

  6. వారి హృదయం కపటమైనది, ఇప్పుడు వారు తమ అపరాధానికి శిక్షను భరించాలి. యెహోవా వారి బలిపీఠాలను పడగొట్టి, వారి పవిత్ర రాళ్లను నాశనం చేస్తారు.

  7. అప్పుడు వారు, “మనకు రాజు లేడు ఎందుకంటే మనం యెహోవాకు భయపడలేదు. ఒకవేళ మనకు రాజు ఉన్నా కూడా, అతడు మనకు ఏమి చేయగలడు?” అంటారు.

  8. నాకు ఇష్టమైనప్పుడు, నేను వారిని శిక్షిస్తాను; వారి రెండంతల పాపం కోసం వారిని బంధకాలలో పెట్టడానికి దేశాలు వారికి విరుద్ధంగా కూడుకుంటాయి.

  9. ఎఫ్రాయిం శిక్షణ పొందిన పెయ్యలా ఉంది, నూర్పిడి అంటే దానికి ఇష్టం; కాబట్టి దాని నున్నటి మెడ మీద నేను కాడి పెడతాను, నేను ఎఫ్రాయిం మీద స్వారీ చేస్తాను, యూదా భూమిని దున్నాలి, యాకోబు భూమిని చదును చేయాలి.

  10. మీ కోసం నీతిని విత్తండి, మారని ప్రేమ అనే పంట కోయండి. దున్నబడని భూమిని చదును చేయండి; ఎందుకంటే, యెహోవా మీ దగ్గరకు వచ్చి, నీతి వర్షం మీపై కురిపించే వరకు, యెహోవాను వెదికే సమయం ఇదే.

  11. “ఇశ్రాయేలు శిశువుగా ఉన్నప్పుడు నేను అతన్ని ప్రేమించాను, ఈజిప్టులో నుండి నేను నా కుమారుని పిలిచాను.

  12. ఎఫ్రాయిం ప్రజలను చేయి పట్టుకుని, నడవడం నేర్పింది నేనే; అయితే వారిని స్వస్థపరచింది నేనని వారు గ్రహించలేదు.

  13. నేను మనుష్యుల మంచితనం అనే త్రాళ్లతో, ప్రేమ బంధాలతో వారిని నడిపించాను. ఒకడు చిన్నబిడ్డను ముఖం దగ్గరకు ఎలా తీసుకుంటారో, అలా నేను వారికి ఉంటూ వారి మీద నుండి కాడిని తీసివేశాను, నేను క్రిందికి వంగి వారిని పోషించాను.

  14. నా ప్రజలు నా నుండి తిరిగిపోవాలని నిశ్చయించుకున్నారు. వారు మహోన్నత దేవుడనైన నాకు మొరపెట్టినా, నేను ఏ విధంగాను వారిని హెచ్చించను.

  15. “ఎఫ్రాయిమూ, నిన్ను ఎలా వదిలేయగలను? ఇశ్రాయేలూ, నిన్ను ఎలా అప్పగించగలను? నిన్ను ఎలా అద్మాలా పరిగణించగలను? సెబోయిములా నిన్ను ఎలా చేయగలను? నా హృదయం నాలో మారింది; నా జాలి అంతా ఉప్పొంగుతుంది.

  16. నేను నా కోపాగ్నిని చూపించను, ఎఫ్రాయిమును మరలా నాశనం చేయను. నేను దేవుడను, మనిషిని కాను, మీ మధ్య ఉన్న పరిశుద్ధ దేవుడను. నేను వారి పట్టణాలకు విరుద్ధంగా రాను.

  17. వారు యెహోవాను అనుసరిస్తారు; ఆయన సింహంలా గర్జిస్తారు, ఆయన గర్జించినప్పుడు, ఆయన పిల్లలు పడమటి నుండి వణకుతూ వస్తారు.

  18. వారు వణకుతూ ఈజిప్టు నుండి పక్షుల్లా ఎగిరి వస్తారు, అష్షూరు నుండి గువ్వల్లా అల్లాడుతూ వస్తారు. వారిని తమ ఇళ్ళలో నివసించేలా చేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  19. ఎఫ్రాయిం అబద్ధాలతో నన్ను చుట్టుముట్టింది, ఇశ్రాయేలు మోసంతో నన్ను ఆవరించింది. యూదా దేవునికి విరుద్ధంగా ఉంది, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు.

  20. యెహోవా యూదా మీద నేరారోపణ చేస్తున్నారు; ఆయన యాకోబును తన మార్గాలను బట్టి శిక్షిస్తారు ఆయన అతని క్రియలనుబట్టి అతనికి ప్రతిఫలం ఇస్తారు.

  21. తల్లి గర్భంలో అతడు తన సోదరుని కాలి మడమను పట్టుకున్నాడు; అతడు పెద్దవాడయ్యాక దేవునితో పోరాడాడు.

  22. ఆయన సైన్యాల అధిపతియైన యెహోవా, ఆయన పేరు యెహోవా!

  23. అయితే నీవు నీ దేవుని దగ్గరకు తిరిగి రావాలి; ప్రేమ, న్యాయం కలిగి ఉండాలి, నీ దేవుని కోసం ఎల్లప్పుడు వేచి ఉండాలి.

  24. “మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పటి నుండి యెహోవానైన నేను మీకు దేవునిగా ఉన్నాను; మీ నియమించబడిన పండుగ రోజుల్లో ఉన్నట్లు నేను మిమ్మల్ని మరలా గుడారాల్లో నివసింపజేస్తాను.

  25. నేను ప్రవక్తలతో మాట్లాడాను. వారికి అనేక దర్శనాలను ఇచ్చి ఉపమానరీతిగా వారికి చెప్పాను.”