కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సైన్యాల యెహోవా అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి దావీదు అంతకంతకు శక్తిమంతుడయ్యాడు.

  2. ఇశ్రాయేలుకు యెహోవా వాగ్దానం చేసిన ప్రకారం దావీదును ఆ ప్రాంతమంతటికి రాజుగా చేయడానికి అతనికి ఇశ్రాయేలు వారందరితో కలిసి సహాయం చేసిన వీరులలో ప్రధానులు వీరు.

  3. కాని వీరు పొలం మధ్యలో నిలబడి, దానిని కాపాడి ఫిలిష్తీయులను చంపారు. యెహోవా వారికి గొప్ప విజయాన్ని ఇచ్చారు.

  4. అప్పుడు ఆ ముగ్గురు ఫిలిష్తీయుల శిబిరం గుండా చొరబడి బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు తోడుకొని దావీదుకు తెచ్చి ఇచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు త్రాగడానికి నిరాకరించాడు; బదులుగా వాటిని యెహోవాకు అర్పణగా పారబోశాడు.

  5. “నేను ఈ నీళ్లు త్రాగకుండా నా దేవుడు నన్ను కాపాడును గాక! ప్రాణానికి తెగించి వెళ్లి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుష్యుల రక్తాన్ని నేను త్రాగాలా?” అన్నాడు. వాటిని తీసుకురావడానికి వారు తమ ప్రాణాలకు తెగించి తెచ్చారు కాబట్టి దావీదు ఆ నీళ్లు త్రాగలేదు. ఆ ముగ్గురు పరాక్రమ యోధులు చేసిన సాహసాలు ఇలాంటివి.

  6. దావీదు వారిని కలుసుకోడానికి బయలుదేరి వెళ్లి వారితో, “మీరు సమాధానంతో నాకు సహాయం చేయడానికి నా దగ్గరకు వస్తే, మిమ్మల్ని నాతో చేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నా వలన మీకు ప్రమాదమేమి లేదని తెలుసుకుని మీరు నన్ను శత్రువులకు అప్పగించడానికి వచ్చి ఉంటే, మన పూర్వికుల దేవుడు దానిని చూసి మీకు తీర్పు తీర్చును గాక” అన్నాడు.

  7. అప్పుడు ముప్పైమందికి నాయకుడైన అమాశై మీదికి ఆత్మ రాగా అతడు అన్నాడు: “దావీదూ, మేము నీ వారము! యెష్షయి కుమారుడా! మేము నీతో ఉన్నాము. నీకు సమాధానం, సమాధానం, నీ సహాయకులకు సమాధానం కలుగును, నీ దేవుడే నీకు సహాయం చేస్తారు.” కాబట్టి దావీదు వారిని చేర్చుకొని తన బలగాలకు నాయకులుగా నియమించాడు.

  8. ప్రతిరోజు దావీదుకు సహాయం చేయడానికి మనుష్యులు వస్తుండడంతో, అతని సైన్యం దేవుని సైన్యంవలె మహా సైన్యంగా మారింది.

  9. యెహోవా చెప్పినట్లు, సౌలు రాజ్యాన్ని దావీదు వశం చేయడానికి హెబ్రోనులో అతని దగ్గరకు ఆయుధాలు ధరించి వచ్చిన యుద్ధవీరుల లెక్కలు ఇవే:

  10. తర్వాత అతడు ఇశ్రాయేలు సమాజమంతటితో, “ఈ ఆలోచన మీకు మంచిదనిపిస్తే, ఇది మన దేవుడైన యెహోవా చిత్తమైతే, ఇశ్రాయేలు దేశమంతటా మిగిలి ఉన్న మన ప్రజలందరు, అలాగే వారి పట్టణాల్లో పచ్చిక మైదానాల్లో వారితో పాటు ఉంటున్న యాజకులు, లేవీయులు వచ్చి మనతో చేరాలని వారికి కబురు పంపండి.

  11. మన దేవుని నిబంధన మందసాన్ని తిరిగి తీసుకువద్దాము. సౌలు పాలనలో దాని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నాం” అన్నాడు.

  12. కాబట్టి దావీదు దేవుని మందసాన్ని కిర్యత్-యారీము నుండి తీసుకురావడానికి ఈజిప్టులో ఉన్న షీహోరు నది నుండి లెబో హమాతు వరకు ఉన్న ఇశ్రాయేలీయులందరిని సమకూర్చాడు.

  13. కెరూబుల మధ్య ఆసీనుడైన దేవుడు అని పిలువబడే యెహోవా దేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు, ఇశ్రాయేలీయులందరు యూదాలోని కిర్యత్-యారీము అని పిలువబడే బాలాకు వెళ్లారు.

  14. వారు దేవుని మందసాన్ని క్రొత్త బండిమీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుండి బయలుదేరారు, ఉజ్జా, అహియోలు ఆ బండిని తోలారు.

  15. దావీదు, ఇశ్రాయేలీయులందరు పాటలు పాడుతూ, సితారలు, వీణలు, తంబురలు, తాళాలు, బూరలు వాయిస్తూ తమ శక్తి అంతటితో దేవుని ఎదుట ఉత్సహిస్తూ ఉన్నారు.

  16. ఉజ్జా మందసం మీద చేయి వేసినందుకు యెహోవా కోపం అతని మీద రగులుకుని ఆయన అతన్ని మొత్తగా అతడు అక్కడే దేవుని ఎదుట చనిపోయాడు.

  17. యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకున్నందుకు దావీదుకు కోపం వచ్చింది కాబట్టి ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకు దానికి అదే పేరు.

  18. ఆ రోజు దావీదు దేవునికి భయపడి, “దేవుని మందసాన్ని నా దగ్గరకు ఎలా తెచ్చుకోవాలి?” అని అడిగాడు.

  19. దేవుని మందసం ఓబేద్-ఎదోము ఇంట్లో అతని కుటుంబం దగ్గర మూడు నెలలు ఉంది. యెహోవా అతన్ని, అతని ఇంటివారిని అతనికి కలిగిన సమస్తాన్ని దీవించారు.

  20. ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా తనను రాజుగా స్థిరపరిచారని, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం తన రాజ్యాన్ని ఎంతో గొప్ప చేశారని దావీదు గ్రహించాడు.

  21. అప్పుడు దావీదు, “నేను వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేయాలా? మీరు నాకు వారిని అప్పగిస్తారా?” అని దేవుని అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు, నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను” అని అతనికి జవాబిచ్చారు.

  22. కాబట్టి దావీదు తన మనుష్యులతో బయల్-పెరాజీముకు వెళ్లి వారిని ఓడించాడు. అతడు, “నీళ్లు కొట్టుకుపోయినట్లుగా దేవుడు నా శత్రువులను నా ఎదుట ఉండకుండ నా చేత నాశనం చేశారు” అని చెప్పి ఆ స్థలానికి బయల్-పెరాజీము అని పేరు పెట్టారు.

  23. కాబట్టి దావీదు దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు, “నీవు నేరుగా వారి వెనుక వెళ్లకుండా చుట్టూ తిరిగివెళ్లి, కంబళి చెట్లకు ఎదురుగా వారిమీద దాడి చేయి.

  24. కంబళి చెట్ల కొనల్లో అడుగుల శబ్దం వినబడగానే, యుద్ధానికి బయలుదేరు. ఎందుకంటే ఫిలిష్తీయుల సైన్యాన్ని నాశనం చేయడానికి దేవుడు నీ ముందుగా వెళ్లారని దాని అర్థం” అని జవాబిచ్చారు.

  25. కాబట్టి దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లే దావీదు చేశాడు, వారు గిబియోను నుండి గెజెరు వరకు ఫిలిష్తీయుల సైన్యాన్ని తరుముతూ వారిని హతం చేశారు.