God
God ను ప్రస్తావించే వచనాలు
అప్పుడు సమూయేలు సౌలును, “నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందరపెట్టావు?” అని అడిగాడు. అందుకు సౌలు, “నేను చాలా బాధల్లో ఉన్నాను; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి వస్తే దేవుడు నా నుండి దూరమయ్యారు. ప్రవక్తల ద్వారా గాని కలల ద్వారా గాని ఆయన నాకు ఏ సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి నేను ఏం చేయాలో నాకు చెప్తావని నిన్ను పిలిచాను” అన్నాడు.
అందుకు సమూయేలు, “యెహోవా నిన్ను విడిచిపెట్టి నీకు శత్రువైనప్పుడు నీవు నన్ను ఎందుకు అడుగుతావు?
యెహోవా నా ద్వారా ప్రవచించిన దానిని నెరవేర్చారు. యెహోవా నీ చేతి నుండి రాజ్యాన్ని తీసివేసి దానిని నీ పొరుగువాడైన దావీదుకు ఇచ్చారు.
నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకుండా అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపాన్ని అమలు చేయలేదు కాబట్టి యెహోవా ఈ రోజు నీకు ఈ విధంగా చేస్తున్నారు.
యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తారు, రేపు నీవు నీ కుమారులు నాతో పాటు ఉంటారు. యెహోవా ఇశ్రాయేలీయుల సైన్యాన్ని కూడా ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తారు” అని సౌలుతో చెప్పాడు.
కాబట్టి ఆకీషు దావీదును పిలిచి అతనితో, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీవు నిజంగా యథార్థవంతుడవు; సైన్యంలో నీవు నాతో పాటు కలిసి పని చేయడం నాకు ఇష్టమే. నీవు నా దగ్గరకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నిజాయితీగా ఉన్నావు, కానీ ఈ అధికారులు నిన్ను తీసుకెళ్లడానికి అంగీకరించడం లేదు.
అందుకు ఆకీషు దావీదుతో, “నీవు నా కంటికి దేవదూతలా మంచిగా కనబడుతున్నావు; కాని ఫిలిష్తీయుల దళాధిపతులు, ‘ఇతడు మనతో పాటు యుద్ధానికి రాకూడదు’ అని అంటున్నారు.
అక్కడున్న మనుష్యులు తమ కుమారులు కుమార్తెల గురించి తీవ్రంగా దుఃఖపడి ఆ బాధతో దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకోవడంతో దావీదు ఎంతో దుఃఖపడ్డాడు. కాని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.
అప్పుడు దావీదు, “నేను ఈ గుంపును వెంటాడితే వారిని పట్టుకోగలనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. అందుకు యెహోవా, “నీవు వెంటాడు, ఖచ్చితంగా నీవు వారిని పట్టుకుని నీ వారినందరిని విడిపించడంలో విజయం పొందుతావు” అని జవాబిచ్చారు.
“ఆ దోపిడి మూక దగ్గరకు నీవు నాకు దారి చూపిస్తావా?” అని దావీదు అడిగాడు. అప్పుడు వాడు, “నీవు నన్ను చంపవని నా యజమానికి అప్పగించనని దేవుని మీద నాకు ప్రమాణము చేస్తే ఆ గుంపును కలుసుకోడానికి నీకు దారి చూపిస్తాను” అన్నాడు.
అందుకు దావీదు వారితో, “నా సోదరులారా; యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దోపిడి మూకను మనకు అప్పగించి మనకు దయ చేసిన దాని విషయంలో మీరు ఇలా చేయకూడదు.
దావీదు సిక్లగుకు వచ్చినప్పుడు దోచుకున్న సొమ్ములో కొంత తీసి, “యెహోవా శత్రువుల దగ్గర నేను దోచుకున్న సొమ్ములో కొంత మీకు ఒక కానుకగా ఇస్తున్నాను” అని చెప్పి తన స్నేహితులైన యూదా పెద్దలకు పంపించాడు.
సౌలు, అతని కుమారుడు యోనాతాను, యెహోవా సైన్యం ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఖడ్గంతో చంపబడ్డారని విని, వారి కోసం సాయంకాలం వరకు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉపవాసం ఉన్నారు.
అందుకు దావీదు, “యెహోవా అభిషేకించినవాన్ని చంపడానికి నీకు భయం వేయలేదా?” అని అడిగాడు.
వెంటనే అతడు వాన్ని కొట్టి చంపాడు. ఎందుకంటే దావీదు ఆ యువకునితో, “ ‘నేను యెహోవా అభిషేకించినవాన్ని చంపాను’ అని నీ నోరే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది కాబట్టి నీ చావుకు నీవే బాధ్యుడవు” అన్నాడు.
కొంతకాలం తర్వాత దావీదు యెహోవా దగ్గర విచారణ చేసి, “యూదా పట్టణాలకు నేను వెళ్ల వచ్చా?” అని అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు” అని చెప్పారు. “ఎక్కడికి వెళ్లాలి?” అని దావీదు అడిగాడు. అందుకు యెహోవా, “హెబ్రోనుకు వెళ్లు” అని చెప్పారు.
దావీదు యాబేషు గిలాదు ప్రజల దగ్గరకు దూతను పంపి, “మీ ప్రభువైన సౌలును పాతిపెట్టి అతని పట్ల మీకున్న దయ చూపించారు కాబట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
యెహోవా మీకు తన దయను నమ్మకత్వాన్ని చూపించును గాక, మీరు చేసిన ఈ పనిని బట్టి నేను కూడా మీమీద అదే దయను చూపిస్తాను.
అందుకు యోవాబు, “సజీవుడైన దేవుని పేరిట, నీవు ఈ మాటలు చెప్పకపోతే వీరు తన సోదరులను ఉదయం వరకు తరుముతూనే ఉండేవారు” అన్నాడు.
యెహోవా దావీదుకు ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసినట్టుగా సౌలు ఇంటి నుండి రాజ్యాన్ని తీసివేసి, దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలు మీద యూదా మీద దావీదు సింహాసనాన్ని నేను స్థాపించకపోతే, దేవుడు అబ్నేరుతో కఠినంగా వ్యవహరించును గాక” అని అన్నాడు.
‘నా సేవకుడైన దావీదు ద్వారా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విడిపిస్తాను’ అని యెహోవా దావీదుకు ప్రమాణం చేశారు, కాబట్టి ఇప్పుడు మీ కోరిక నెరవేర్చుకోండి” అన్నాడు.
తర్వాత ఈ సంగతి తెలిసిన దావీదు, “నేరు కుమారుడైన అబ్నేరు రక్తం విషయంలో నేను నా రాజ్యం ఎప్పటికీ యెహోవా దృష్టిలో నిర్దోషులమే.
ఇంకా వెలుగుగా ఉన్నప్పుడే ప్రజలందరూ దావీదు దగ్గరకు వచ్చి భోజనం చేయమని బ్రతిమిలాడారు కాని దావీదు ఒట్టు పెట్టుకుని, “సూర్యాస్తమయానికి ముందు నేను ఏమైనా ఆహారం తింటే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షించును గాక” అన్నాడు.
నేను రాజుగా అభిషేకించబడినా ఈ రోజు నేను బలహీనుడిని అయిపోయాను. ఈ సెరూయా కుమారులు నా కంటే బలవంతులు. ఈ చెడ్డ పని చేసినవాడికి యెహోవాయే తగిన శిక్ష విధించి ప్రతీకారం చేస్తారు” అన్నాడు.
హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకు ఇష్-బోషెతు తల తీసుకువచ్చి రాజుతో, “రాజా! నిన్ను చంపాలనుకున్న నీ శత్రువు సౌలు కుమారుడైన ఇష్-బోషెతు తల ఇదిగో. ఈ రోజున నా ప్రభువు రాజువైన నీ పక్షంగా సౌలుకు అతని సంతానానికి యెహోవా ప్రతీకారం చేశారు” అన్నాడు.