కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే మనమిద్దరం మాట్లాడుకున్న సంగతులు జ్ఞాపకం ఉంచుకో, నీకు నాకు మధ్య ఎల్లప్పుడు యెహోవాయే సాక్షి” అన్నాడు.

  2. అప్పుడు యోనాతాను, “యెహోవా నీకు నాకు మధ్య, నీ సంతానానికి నా సంతానానికి మధ్య ఎప్పటికీ సాక్షిగా ఉండును గాక. మనమిద్దరం యెహోవా నామాన్ని బట్టి ప్రమాణం చేసుకున్నాం కాబట్టి మనస్సులో నెమ్మది కలిగి వెళ్లు” అని దావీదుతో చెప్పగా దావీదు బయలుదేరి వెళ్లిపోయాడు. యోనాతాను పట్టణానికి తిరిగి వెళ్లాడు.

  3. యాజకుడు అతనికి వెచ్చని రొట్టెలు వేసే రోజున తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను ఇచ్చాడు, ఎందుకంటే అక్కడ యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప వేరే లేవు.

  4. ఆ రోజు సౌలు సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిలో ఉన్నాడు; అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు, అతడు సౌలు యొక్క బలవంతుడైన కాపరి.

  5. దావీదు అక్కడినుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, “నా పట్ల దేవుని చిత్తం ఏమిటో నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులను వచ్చి మీ దగ్గర ఉండనివ్వగలరా?” అని మోయాబు రాజును అడిగాడు.

  6. అహీమెలెకు అతని తరపున యెహోవా దగ్గర విచారణ చేసి, ఆహారాన్ని ఫిలిష్తీయుడైన గొల్యాతు కత్తిని అతనికి ఇచ్చాడు” అని చెప్పాడు.

  7. సౌలు అతనితో, “నీవూ యెష్షయి కుమారుడు కలిసి ఎందుకు నా మీద కుట్ర చేశారు? నీవు అతనికి ఆహారాన్ని ఖడ్గాన్ని ఇచ్చి అతని తరపున దేవుని దగ్గర విచారణ చేశావు, అందుకు అతడు నా మీద తిరుగుబాటు చేస్తూ ఇలా ఈ రోజు నా కోసం పొంచి ఉన్నాడు” అని అన్నాడు.

  8. అతని తరపున నేను దేవుని దగ్గర విచారణ చేయడం ఈ రోజే ప్రారంభించానా? కాదు కదా! ఈ విషయం గురించి నీ సేవకుడనైన నాకు ఏమాత్రం తెలియదు కాబట్టి రాజు తన సేవకుని మీద గాని అతని తండ్రి ఇంటివారి మీద నేరం మోపకూడదు” అన్నాడు.

  9. తర్వాత, “యెహోవా యాజకులైన వీరు దావీదు పక్షం ఉన్నారు. అతడు పారిపోయిన విషయం తెలిసినా నాకు చెప్పలేదు కాబట్టి మీరు వెళ్లి వీరందరిని చంపండి” అని తన చుట్టూ నిలబడి ఉన్న సైనికులకు ఆజ్ఞాపించాడు. అయితే రాజు అధికారులు యెహోవా యాజకులను చంపడానికి ఒప్పుకోలేదు.

  10. And Abiathar shewed David that Saul had slain the LORD'S priests.

  11. దావీదు, “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను చంపనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. అందుకు యెహోవా, “నీవు వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేసి కెయీలాను రక్షించు” అని అతనికి జవాబిచ్చారు.

  12. దావీదు మరోసారి యెహోవా దగ్గర విచారణ చేసినప్పుడు, “నీవు లేచి కెయీలాకు వెళ్లు, నేను ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తాను” అని యెహోవా జవాబిచ్చారు.

  13. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని, “ద్వారాలు అడ్డు గడియలు ఉన్న పట్టణం లోపలికి వెళ్లి దావీదు అందులో బందీ అయ్యాడు కాబట్టి దేవుడు అతన్ని నా చేతికి అప్పగించారు” అనుకున్నాడు.

  14. అప్పుడు దావీదు, “ఇశ్రాయేలీయుల దేవుడవైన యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నా కారణంగా పట్టణాన్ని నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నాడని మీ దాసుడనైన నాకు ఖచ్చితంగా తెలిసింది.

  15. కెయీలా పౌరులు నన్ను అతని చేతికి అప్పగిస్తారా? మీ సేవకుడనైన నేను విన్నట్లుగా సౌలు వస్తాడా? ఇశ్రాయేలీయుల దేవుడవైన యెహోవా, దయచేసి మీ సేవకుడనైన నాకు చెప్పండి” అని ప్రార్థించాడు. “అతడు వస్తాడు” అని యెహోవా జవాబిచ్చారు.

  16. దావీదు మరల, “కెయీలా పౌరులు నన్ను నా ప్రజలను సౌలు చేతికి అప్పగిస్తారా?” అని అడిగాడు. అందుకు యెహోవా, “వారు నిన్ను అప్పగిస్తారు” అని జవాబిచ్చారు.

  17. అయితే దావీదు అరణ్యంలో, బలమైన కోటలలో, జీఫు అడవి కొండల్లో నివసించాడు. ప్రతిరోజు సౌలు అతన్ని వెదికాడు కాని దేవుడు సౌలు చేతికి అతని అప్పగించలేదు.

  18. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను హోరేషులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చి దేవుని బట్టి అతన్ని బలపరుస్తూ,

  19. వీరిద్దరు యెహోవా ఎదుట నిబంధన చేసుకున్న తర్వాత యోనాతాను ఇంటికి వెళ్లిపోయాడు కాని దావీదు హోరేషులోనే ఉన్నాడు.

  20. అప్పుడు సౌలు వారితో, “మీకు నాపై ఉన్న కనికరాన్ని బట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.

  21. ఆ మనుష్యులు, “ ‘నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తాను’ అని యెహోవా నీతో చెప్పిన రోజు ఇదే” అన్నారు. అప్పుడు దావీదు ప్రాకుతూ ముందుకు వెళ్లి సౌలు వస్త్రపు అంచును కత్తిరించాడు.

  22. “ఇతడు యెహోవాచేత అభిషేకించబడినవాడు కాబట్టి యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువుకు నేను ఈ పని చేయను. యెహోవాను బట్టి అతన్ని నేను చంపను” అని తన ప్రజలతో చెప్పాడు.

  23. గుహలో యెహోవా నిన్ను నా చేతికి ఎలా అప్పగించారో ఈ రోజు మీరు మీ కళ్లతో చూశారు. కొందరు నిన్ను చంపమని నన్ను ప్రోత్సహించారు, కాని నేను నిన్ను వదిలేశాను; ‘ఎందుకంటే నా ప్రభువు యెహోవాచేత అభిషేకించబడినవాడు కాబట్టి నేను ఆయన మీద చేయి వేయను’ అని చెప్పాను.

  24. నీకు నాకు మధ్య యెహోవా న్యాయం తీరుస్తారు. నీవు నా పట్ల చేసినవాటికి యెహోవాయే ప్రతీకారం చేస్తారు కాని నా చేయి నిన్ను తాకదు.

  25. యెహోవా మనకు న్యాయమూర్తిగా ఉండి మన మధ్య తీర్పు తీర్చును గాక. ఆయన నా విషయాన్ని పరిశీలించి నా తరుపున దానిని సమర్థిస్తారు; నీ చేతి నుండి నన్ను విడిపించి ఆయనే నాకు న్యాయం చేస్తారు” అన్నాడు.