కంటెంట్‌కు వెళ్లండి

Esau

159 వచనాలు · 11 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Edom

Esau ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఏశావు తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన ఇంటి వారందరిని, పశువులను, అన్ని జంతువులను, కనానులో సంపాదించుకున్న వస్తువులన్నిటిని తీసుకుని తన తమ్ముడికి దూరంగా ఉన్న దేశానికి వెళ్లాడు.

  2. కాబట్టి ఏశావు అనగా ఎదోము శేయీరు కొండ సీమలో స్థిరపడ్డాడు.

  3. శేయీరు కొండ సీమలో స్థిరపడిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి:

  4. ఏశావు కుమారులు: ఏశావు భార్య ఆదా కుమారుడైన ఎలీఫజు, ఏశావు భార్య బాశెమతు కుమారుడైన రెయూయేలు.

  5. ఏశావు కుమారుడైన ఎలీఫజుకు తిమ్నా అనే ఉంపుడుగత్తె కూడా ఉంది. ఆమె అమాలేకును కన్నది. వీరు ఏశావు భార్య ఆదా యొక్క మనవళ్లు.

  6. రెయూయేలు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు ఏశావు భార్య బాశెమతు యొక్క మనవళ్లు.

  7. ఏశావు భార్య అనా కుమార్తెయైన సిబ్యోను మనవరాలైన ఒహోలీబామా ద్వారా కలిగిన ఏశావు కుమారులు: యూషు, యాలాము, కోరహు.

  8. ఏశావు వారసులలో నాయకులైన వారు వీరు: ఏశావు మొదటి కుమారుడైన ఎలీఫజు కుమారులు: నాయకులైన తేమాను, సెఫో, కనజు, ఓమారు,

  9. కోరహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోములో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు; వీరు ఏశావు భార్య ఆదా యొక్క మనవళ్లు.

  10. ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు: నాయకులైన నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు ఎదోములో రెయూయేలు నుండి వచ్చిన నాయకులు; వీరు ఏశావు భార్య బాశెమతు యొక్క మనవళ్లు.

  11. ఏశావు భార్య ఒహోలీబామా యొక్క కుమారులు: నాయకులైన యూషు, యాలాము, కోరహు. వీరు అనా కుమార్తె, ఏశావు భార్య అహోలీబామా నుండి వచ్చిన నాయకులు.

  12. వీరు ఏశావు అనగా ఎదోము కుమారులు, వీరు వారి నాయకులుగా ఉన్నవారు.

  13. దిషోను, ఏసెరు, దిషాను. ఎదోములో ఉన్న శేయీరు కుమారులైన వీరు హోరీయుల నాయకులు.

  14. ఇశ్రాయేలు రాజులెవరు పరిపాలించక ముందు ఎదోమును పరిపాలించిన రాజులు వీరు:

  15. బెయోరు కుమారుడైన బేల ఎదోముకు రాజయ్యాడు. అతని పట్టణానికి దిన్హాబా అని పేరు పెట్టబడింది.

  16. వారి వారి వంశాల ప్రకారం వారి వారి ప్రాంతాల ప్రకారం ఇవి ఏశావు వారసుల నాయకులు పేర్లు: తిమ్నా, అల్వా, యతేతు,

  17. మగ్దీయేలు, ఈరాము.

  18. ఎదోము పెద్దలు భయపడతారు, మోయాబు నాయకులకు వణుకు పుడుతుంది. కనాను ప్రజలు భయంతో నీరైపోతారు;

  19. మోషే కాదేషు నుండి ఎదోము రాజు దగ్గరకు ఈ వర్తమానంతో దూతలను పంపాడు: “నీ సహోదరుడైన ఇశ్రాయేలు ఇలా చెప్తున్నాడు: మా మీదికి వచ్చిన కష్టాలన్నిటి గురించి నీకు తెలుసు.

  20. కానీ ఎదోము రాజు ఇలా ఆజ్ఞాపించారు: “మీరు ఇక్కడినుండి వెళ్లకూడదు. వెళ్లడానికి ప్రయత్నిస్తే ఖడ్గంతో మీపై దాడి చేస్తాము.”

  21. వారు తిరిగి జవాబిచ్చారు: “మీరు దాటి వెళ్లకూడదు.” ఎదోము వారు వారిని ఎదుర్కోడానికి, శక్తిగల పెద్దబలగంతో వచ్చారు.

  22. ఎదోము వారు ఇశ్రాయేలీయులను తమ సరిహద్దులు దాటనివ్వలేదు కాబట్టి ఇశ్రాయేలీయులు అక్కడినుండి తిరిగిపోయారు.

  23. ఎదోము సరిహద్దు దగ్గర ఉన్న హోరు పర్వతం దగ్గర, యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు,

  24. ఎదోము చుట్టూ తిరిగి రావాలని వారు హోరు పర్వతం నుండి ఎర్ర సముద్రం మార్గాన ప్రయాణం చేశారు. అయితే ప్రజలు ఈ ప్రయాణంలో ఓపిక కోల్పోయారు;

  25. ఎదోము జయించబడుతుంది; అతని శత్రువైన శేయీరు జయించబడుతుంది. కానీ ఇశ్రాయేలు బలంగా ఎదుగుతుంది.