Skip to content

War గురించి బైబిల్ వచనాలు

639 వచనాలు · 45 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు యెహోషువ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మక్కేదా నుండి లిబ్నాకు వెళ్లి దానిపై దాడి చేశారు.

  2. యెహోవా ఆ పట్టణాన్ని దాని రాజును ఇశ్రాయేలు చేతికి అప్పగించారు. యెహోషువ ఆ పట్టణాన్ని, దానిలోని వారందరినీ కత్తితో చంపాడు. అక్కడ అతడు ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు. అతడు యెరికో రాజుకు చేసినట్లు దాని రాజుకు చేశాడు.

  3. అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు లిబ్నా నుండి లాకీషుకు వెళ్లి అక్కడ తన దళాలను మోహరించి దాని మీద దాడి చేశాడు.

  4. యెహోవా లాకీషును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించారు. రెండవ రోజు యెహోషువ దానిని పట్టుకుని లిబ్నాకు చేసినట్లే ఆ పట్టణాన్ని, అందులోని వారందరినీ ఖడ్గంతో చంపాడు.

  5. ఇంతలో గెజెరు రాజైన హోరాము లాకీషుకు సహాయం చేయడానికి రాగా అయితే యెహోషువ ఎవరూ ప్రాణాలతో మిగులకుండా అతన్ని అతని సైన్యాన్ని హతం చేశాడు.

  6. అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు లాకీషు నుండి ఎగ్లోనుకు వెళ్లారు; దానికి వ్యతిరేకంగా వారు తమ సైన్యాన్ని మోహరింపజేసి దాని మీద దాడి చేశాడు.

  7. వారు లాకీషుకు చేసినట్లుగా అదే రోజు దానిని పట్టుకుని ఖడ్గంతో అక్కడ ఉన్నవారందరిని పూర్తిగా నాశనం చేశారు.

  8. ఎగ్లోను నుండి యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు హెబ్రోనుకు వెళ్లి దాని మీద దాడి చేశారు.

  9. వారు దానిని పట్టుకుని దానిని దాని రాజును దానికి చెందిన అన్ని గ్రామాలను దానిలో ఉన్నవారినందరిని ఖడ్గంతో చంపారు. ఎగ్లోనుకు చేసినట్టే దానిని దానిలో ఉన్నవారినందరిని పూర్తిగా నాశనం చేశారు.

  10. తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు వెనుకకు వచ్చి దెబీరు మీద దాడి చేశాడు.

  11. వారు ఆ పట్టణాన్ని, దాని రాజును, దాని గ్రామాలను పట్టుకుని కత్తితో చంపారు. అందులో ఉన్నవారందరిని పూర్తిగా నాశనం చేశారు. వారు ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. లిబ్నాకు, దాని రాజుకు, హెబ్రోనుకు చేసినట్లే వారు దెబీరుకు, దాని రాజుకు చేశారు.

  12. కాబట్టి యెహోషువ కొండ ప్రాంతాన్ని, దక్షిణ ప్రాంతాన్ని, పడమటి పర్వతాలను, కొండ వాలులతో సహా మొత్తం ప్రాంతాన్ని వాటి రాజులందరితో పాటు స్వాధీనం చేసుకున్నాడు. ఎవ్వరినీ మిగల్చలేదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లుగానే, ఊపిరితో ఉన్నవారందరిని అతడు పూర్తిగా నాశనం చేశాడు.

  13. దానిలో ఉన్నవారందరిని కత్తితో చంపారు. ఊపిరి ఉన్న ఎవరినీ విడిచిపెట్టకుండా వారిని పూర్తిగా నాశనం చేశారు. అతడు హాసోరును కాల్చివేశాడు.

  14. యెహోషువ ఈ రాజ పట్టణాలన్నిటిని, వాటి రాజులందరినీ పట్టుకుని ఖడ్గంతో చంపాడు. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని పూర్తిగా నాశనం చేశాడు.

  15. అయితే యెహోషువ కాల్చివేసిన హాసోరు తప్ప మట్టి కొండలమీద కట్టిన పట్టణాలను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు.

  16. ఇశ్రాయేలీయులు ఈ పట్టణాలలోని దోపుడుసొమ్మును, పశువులన్నిటిని తమ కోసం తీసుకెళ్లారు, కాని మనుష్యుల్లో ఎవరినీ విడిచిపెట్టకుండా, వాటిని పూర్తిగా నాశనం చేసేంతవరకు ప్రజలందరినీ ఖడ్గంతో చంపారు.

  17. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు, యెహోషువ దానినే చేశాడు; మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటిలో అతడు ఏదీ వదల్లేదు.

  18. కాబట్టి యెహోషువ ఈ మొత్తం భూమిని స్వాధీనం అనగా కొండసీమ, దక్షిణ ప్రాంతం, గోషేను ప్రాంతమంతా, పశ్చిమ పర్వత ప్రాంతాలు, అరాబా, ఇశ్రాయేలు పర్వతాలు వాటి దిగువ ప్రాంతాలు,

  19. హలాకు పర్వతం నుండి శేయీరు వైపు, హెర్మోను పర్వతం క్రింద లెబానోను లోయలోని బయల్-గాదు వరకు అతడు స్వాధీనం చేసుకుని వాటి రాజులందరినీ పట్టుకుని చంపాడు.

  20. యెహోషువ ఈ రాజులందరితో చాలా కాలం యుద్ధం చేశాడు.

  21. గిబియోనులో నివసిస్తున్న హివ్వీయులు తప్ప, ఏ ఒక్క పట్టణం కూడా ఇశ్రాయేలీయులతో సమాధాన ఒప్పందం చేసుకోలేదు, వారు యుద్ధంలో వారందరినీ పట్టుకున్నారు.

  22. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు కనికరం లేకుండా వారిని పూర్తిగా నాశనం చేయాలని, ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వచ్చేలా యెహోవా వారి హృదయాలను కఠినపరిచారు.

  23. ఆ సమయంలో యెహోషువ వెళ్లి కొండ ప్రాంతంలో అనగా హెబ్రోను, దెబీరు, అనాబు, యూదా, ఇశ్రాయేలు కొండ ప్రాంతమంతా నివసించిన అనాకీయులందరినీ, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేశాడు.

  24. ఇశ్రాయేలీయుల భూభాగంలో అనాకీయులు ఎవరూ మిగల్లేదు; గాజా, గాతు, అష్డోదులలో మాత్రమే కొంతమంది మిగిలారు.

  25. యెహోవా మోషేకు చెప్పినట్లుగానే యెహోషువ ఆ దేశమంతటిని స్వాధీనం చేసుకుని, ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం వారసత్వంగా దానిని ఇచ్చాడు. తర్వాత దేశం యుద్ధాలు లేకుండ విశ్రాంతిగా ఉంది.