Skip to content

The Wind గురించి బైబిల్ వచనాలు

73 వచనాలు · 55 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అది ఒకచోట నుండి మరొక చోట నాటబడింది, అది వృద్ధి చెందుతుందా? తూర్పు గాలి దాని మీద వీచినపుడు అది నాటబడిన చోటనే ఎండిపోదా?’ ”

  2. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, ఊపిరి వచ్చేలా ప్రవచించి ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఊపిరీ! నీవు నాలుగు వైపుల నుండి వచ్చి, ఈ హతులైన వీరి బ్రతికేలా వీరిలో ఊపిరి నింపు.’ ”

  3. “వారు గాలిని విత్తుతారు, సుడిగాలిని కోస్తారు. పైరుకు కంకులు లేవు, దాని నుండి పిండి రాదు. అది ఒకవేళ పంటకు వస్తే, విదేశీయులు దాన్ని మ్రింగివేస్తారు.

  4. ఎఫ్రాయిం గాలిని మేస్తున్నాడు; అతడు రోజంతా తూర్పు గాలిని వెంటాడుతున్నాడు, విస్తారంగా అబద్ధాలాడుతూ, దౌర్జన్యం చేస్తున్నాడు. అతడు అష్షూరుతో ఒప్పందం చేస్తున్నాడు ఈజిప్టుకు ఒలీవనూనె పంపిస్తున్నాడు.

  5. నేను ఎఫ్రాయిం పట్ల దయ చూపించను. యెహోవా నుండి తూర్పు గాలి వస్తుంది, ఎడారి నుండి అది వీస్తుంది. అతని నీటిబుగ్గ ఎండిపోతుంది అతని బావి ఇంకిపోతుంది. అతని ధననిధులు, ప్రియమైన వస్తువులు దోచుకోబడతాయి.

  6. పర్వతాలను ఏర్పరచింది గాలిని సృష్టించింది ఆయనే, తన ఆలోచనలను మనుష్యులకు వెల్లడి చేసేది, ఉదయాన్ని చీకటిగా మార్చేది ఆయనే, భూమి ఎత్తైన స్థలాల్లో ఆయన నడుస్తారు ఆయన పేరు దేవుడైన సైన్యాల యెహోవా.

  7. అప్పుడు యెహోవా సముద్రం మీద పెనుగాలిని పంపగా బలమైన తుఫాను లేచింది, అది ఓడను బద్దలు చేసేంత భయంకరంగా ఉంది.

  8. వారు యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు, వెంటనే పొంగుతూ ఉన్న సముద్రం నిమ్మళించింది.

  9. సూర్యుడు ఉదయించినప్పుడు, దేవుడు తూర్పు నుండి వడగాలిని పంపించారు, యోనా తలకు ఎండదెబ్బ తగిలి అతడు నీరసించిపోయాడు. “నేను బ్రతికి ఉండడం కంటే చావడం మేలు” అని తనలో తాను అనుకున్నాడు.

  10. వాన కురిసి వరదలు వచ్చి గాలులు వీచి ఆ ఇంటిని తాకాయి. అప్పుడు పెద్ద శబ్దంతో అది కూలిపోయింది.”

  11. అందుకు ఆయన, “అల్పవిశ్వాసులారా, మీరు ఎందుకంతగా భయపడుతున్నారు?” అని కోప్పడి లేచి గాలులను అలలను గద్దించారు. అప్పుడు అంతా ప్రశాంతంగా మారిపోయింది.

  12. యోహాను శిష్యులు వెళ్లిపోతుండగా, యేసు జనంతో యోహాను గురించి మాట్లాడటం ప్రారంభించాడు, “ఏమి చూడడానికి మీరు అరణ్యంలోనికి వెళ్లారు? గాలికి ఊగే రెల్లునా?

  13. అప్పటికే ఆ పడవ ఒడ్డుకు దూరంగా ఉంది, ఎదురుగాలి వీస్తూ అలలు వచ్చి ఆ పడవను కొడుతున్నాయి.

  14. వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణగిపోయింది.

  15. అలాగే దక్షిణపు గాలి వీచినప్పుడు, ‘వేడిగా ఉండబోతుంది’ అని అంటారు, అది అలాగే ఉంటుంది.

  16. గాలి తనకు ఇష్టమైన చోట వీస్తుంది, దాని శబ్దం వినగలవు కానీ అది ఎక్కడ నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో చెప్పలేవు. అలాగే ఆత్మ మూలంగా జన్మించినవారు కూడా అంతే” అన్నారు.

  17. బలమైన గాలి వీస్తూ అలల ఉధృతి పెరిగింది.

  18. అప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి వేగంగా వీస్తున్న గాలి లాంటి ధ్వని వచ్చి వారు కూర్చున్న ఇల్లంతా నింపింది.

  19. ఎక్కువసేపు అవ్వక ముందే, ఈశాన్యగాలి అని పిలువబడే, పెనుగాలి బలంగా వీయడంతో, ద్వీపం నుండి దూరంగా కొట్టుకొని పోయాము.

  20. తుఫాను గాలి భయంకరంగా కొడుతుంది కాబట్టి మరుసటిరోజు ఓడలోని సరుకులను సముద్రంలో పడవేయడం మొదలుపెట్టారు.

  21. మనం ఇంకా పసిపిల్లలం కాదు కాబట్టి, మనుష్యులు మోసపూరిత యోచనలతో వంచనలతో కుయుక్తితో చేసే బోధలు అనే ప్రతీ గాలికి ఇటు అటు ఎగిరిపోతూ, అలలచే ముందుకు వెనుకకు కొట్టుకొనిపోయేవారంగా ఉండకూడదు.

  22. ఓడలను చూడండి; చాలా పెద్దగా ఉంటాయి, అవి బలమైన గాలికి కొట్టుకొనిపోతున్నా దానిని నడిపేవాని ఇష్ట ప్రకారం చాలా చిన్నగా ఉండే చుక్కాని సహాయంతో త్రిప్పబడుతుంది.

  23. బలమైన గాలికి అంజూర చెట్టు నుండి రాలిపడిన కాయల్లా ఆకాశం నుండి నక్షత్రాలు భూమి మీద రాలాయి.