Skip to content

The Wind గురించి బైబిల్ వచనాలు

73 వచనాలు · 55 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆకాశం నుండి ఆయన తూర్పు గాలిని వదిలారు. తన శక్తితో దక్షిణ గాలి విసిరేలా చేశారు.

  2. మీ తుఫానుతో వారిని వెంటాడండి మీ సుడిగాలితో వారిని భయపెట్టండి.

  3. దాని మీద గాలి వీస్తే అది లేకుండా పోతుంది, దాని చోటుకు అది జ్ఞాపకం కూడా ఉండదు.

  4. దైవాజ్ఞకు తుఫాను లేచింది, అలలు రేగాయి.

  5. అతడు తుఫానును గుసగుసలాడేలా చేశాడు, సముద్ర తరంగాలు సద్దుమణిగాయి.

  6. ఆయన భూమి అంచుల నుండి మేఘాలను లేచేలా చేస్తారు; వర్షంతో పాటు మెరుపులను పంపిస్తారు తన కోటలో నుండి గాలిని బయటకు పంపిస్తారు.

  7. మెరుపులు, వడగళ్ళు, మంచు, మేఘాలు, ఈదురు గాలులు,

  8. బహుమతి ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వని వ్యక్తి వర్షము కురిపించని మబ్బు గాలి లాంటివాడు.

  9. ఊహించని వర్షాన్ని తెచ్చే ఉత్తర గాలిలా కపటమైన నాలుక భయానకంగా కనిపించేలా చేస్తుంది.

  10. ఆకాశానికెక్కి మరలా దిగినవారెవరు? తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్న వారెవరు? బట్టలో నీళ్లు మూట గట్టినవారెవరు? భూమి దిక్కులను నెలకొల్పినది ఎవరు? ఆయన పేరేంటి, ఆయన కుమారుని పేరేంటి? ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి!

  11. గాలి దక్షిణం వైపు వీస్తూ అంతలోనే ఉత్తరానికి తిరుగుతుంది; అది సుడులు సుడులుగా తిరుగుతూ, తన దారిలోనే తిరిగి వస్తుంది.

  12. ఉత్తర వాయువూ, మేలుకో, దక్షిణ వాయువూ, రా! నా ఉద్యానవనం మీద వీచండి, తద్వారా అందలి పరిమళ వాసన అన్ని వైపుల వ్యాపించాలి. నా ప్రియుడు తన ఉద్యాన వనానికి వచ్చి నచ్చిన పండ్లు రుచి చేయును గాక.

  13. అప్పుడు దావీదు ఇంటివారికి, “అరాము ఎఫ్రాయిముతో పొత్తు పెట్టుకుంది” అని తెలియజేయబడింది; కాబట్టి గాలికి అడవి చెట్లు కదిలినట్లు ఆహాజు, అతని ప్రజల హృదయాలు వణికాయి.

  14. యెహోవా ఈజిప్టు సముద్రపు అగాధాన్ని నాశనం చేస్తారు; తన వేడి గాలితో యూఫ్రటీసు నది మీద తన చేయి ఆడిస్తారు. ఆయన ఏడు కాలువలుగా దానిని చీల్చుతారు చెప్పులు తడువకుండ మనుష్యులు దానిని దాటేలా చేస్తారు.

  15. మేము గర్భం ధరించి ప్రసవవేదన పడ్డాము. కాని గాలికి జన్మనిచ్చాము. మేము భూమికి రక్షణను తీసుకురాలేదు, ఈ లోక ప్రజలు పుట్టలేదు.

  16. మీరు యుద్ధంతో వెళ్లగొట్టి దానిని శిక్షించారు తూర్పు నుండి బలమైన గాలి వీచినట్లు ఆయన తన బలమైన గాలితో దానిని తరిమికొట్టారు.

  17. ఉరుముతో, భూకంపంతో, గొప్ప శబ్దంతో సుడిగాలి తుఫానుతో దహించే అగ్నిజ్వాలలతో సైన్యాల యెహోవా వస్తారు.

  18. గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి ఎందుకంటే యెహోవా తన ఊపిరి వాటి మీద ఊదుతారు. నిజంగా ప్రజలు గడ్డిలా ఉన్నారు.

  19. నీవు వాటిని చెరగగా, గాలికి కొట్టుకుపోతాయి, సుడిగాలి వాటిని చెదరగొడుతుంది. అయితే నీవు యెహోవాలో సంతోషిస్తావు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడతావు.

  20. చూడండి, వారందరు మాయాస్వరూపులే వారి క్రియలు మోసమే; వారి పోత విగ్రహాలు వట్టి గాలి అవి శూన్యములే.

  21. మేమందరం అపవిత్రులమయ్యాము, మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డలుగా ఉన్నాయి; మేమందరం ఆకులా వాడిపోయాము, గాలిలా మా పాపాలు మమ్మల్ని తుడిచివేస్తున్నాయి.

  22. ఆ సమయంలో ఈ ప్రజలకు, యెరూషలేముకు ఇలా ప్రకటించబడుతుంది: “ఎడారిలో బంజరు కొండల నుండి మండే గాలి నా ప్రజల వైపు వీస్తుంది, కానీ పొట్టు చెరగడానికో లేదా శుభ్రం చేయడానికో కాదు.

  23. ఆయన ఉరిమినప్పుడు ఆకాశ జలాలు గర్జిస్తాయి; ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. ఆయన వర్షంతో మెరుపులు పంపి తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు.

  24. సున్నం వేస్తున్నవారితో అది కూలిపోతుందని చెప్పు. నేను వర్షం, వడగండ్లు కురిపించినప్పుడు బలమైన గాలులు వీచి అది పడిపోతుంది.

  25. “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నేను ఉగ్రతతో బలమైన గాలిని, కోపంతో వడగండ్లు కుండపోత వర్షాన్ని పంపి దానిని పడగొడతాను.