కంటెంట్‌కు వెళ్లండి

The Tribes of Israel గురించి బైబిల్ వచనాలు

241 వచనాలు · 21 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఒకవేళ వారు ఇతర ఇశ్రాయేలు గోత్రం వారిని పెళ్ళి చేసుకుంటే, అప్పుడు వారి వారసత్వం పూర్వికుల గోత్రం నుండి మారి వేరే వారు పెళ్ళి చేసుకున్న వారి గోత్రంలో కలిసిపోతుంది. కాబట్టి వారి వారసత్వం లోని భాగం తీసివేయబడుతుంది.

  2. ఇశ్రాయేలు యొక్క మహోత్సవ సంవత్సరం వచ్చినప్పుడు, వారి వారసత్వం వారు పెళ్ళి చేసుకున్న వారి గోత్రంలో కలిసిపోతుంది, మా పూర్వికుల వంశ వారసత్వం నుండి స్వాస్థ్యం పోతుంది” అని అంటూ చెప్పారు.

  3. అప్పుడు యెహోవా ఆజ్ఞమేరకు మోషే ఇశ్రాయేలీయులను ఆదేశించాడు: “యోసేపు సంతతివారి గోత్రం వారు తెచ్చిన ఫిర్యాదు సరియైనదే.

  4. సెలోఫెహాదు కుమార్తెల గురించి యెహోవా ఇలా ఆజ్ఞాపించారు: వారు తమకు ఇష్టం వచ్చిన వారిని పెళ్ళి చేసుకోవచ్చు, కానీ అది వారి తండ్రి గోత్ర వంశం వారై ఉండాలి.

  5. ఇశ్రాయేలు ప్రజల వారసత్వం ఒక గోత్రం నుండి ఇంకొక గోత్రం లోకి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరూ తమ పూర్వికుల గోత్ర వారసత్వాన్ని తమ వంశం లోనే ఉంచుకోవాలి.

  6. ఇశ్రాయేలు ప్రజల గోత్రాల్లో వారసత్వం ఉన్న ప్రతి కుమార్తె తన తండ్రి గోత్రం వారినే పెళ్ళి చేసుకోవాలి. ఈ విధంగా వారి వారి పూర్వికులు వారసత్వం వారి స్వాధీనంలోనే ఉంటుంది.

  7. వారసత్వం ఒక వంశం నుండి ఇంకొక వంశానికి వెళ్లకూడదు. ప్రతి ఇశ్రాయేలు గోత్రం వారు వారసత్వ భూమిని కాపాడుకోవాలి.”

  8. ఆ సమయంలో మనం స్వాధీనం చేసుకున్న దేశాన్ని అనగా అర్నోను వాగు లోయలో ఉన్న అరోయేరు నుండి గిలాదు కొండ ప్రాంతంలోని సగభాగాన్ని దానిలో ఉన్న పట్టణాలతో కలిపి రూబేనీయులకు గాదీయులకు ఇచ్చాను.

  9. గిలాదులో మిగతా ప్రాంతాన్ని, ఓగు రాజ్యమైన బాషాను అంతటిని మనష్షే అర్ధగోత్రానికి ఇచ్చాను. బాషానులోని అర్గోబు ప్రాంతమంతా రెఫాయీయుల దేశమని పిలువబడేది.

  10. మనష్షే సంతానమైన యాయీరు అర్గోబు ప్రాంతమంతా గెషూరీయుల మయకాతీయుల సరిహద్దుల వరకు స్వాధీనపరచుకున్నాడు. దానికి అతని పేరు పెట్టబడింది కాబట్టి నేటికీ బాషాను హవ్వోత్ యాయీరు అని పిలుస్తారు.

  11. గిలాదును మాకీరుకు ఇచ్చాను.

  12. అయితే రూబేనీయులకు, గాదీయులకు గిలాదు నుండి అర్నోను వాగు లోయ మధ్య వరకు, యబ్బోకు నది వరకు, అమ్మోనీయుల సరిహద్దు వరకు నేను ఇచ్చాను.

  13. దాని పశ్చిమ సరిహద్దు కిన్నెరెతు నుండి పిస్గా కొండచరియల తూర్పున, మృత సముద్రమనే అరాబా సముద్రం వరకు వ్యాపించి ఉన్న అరాబాలోని యొర్దాను నది.

  14. ఆ సమయంలో నేను యొర్దాను తూర్పున నివసిస్తున్న గోత్రాలకు మీకు ఇలా ఆజ్ఞాపించాను: “మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోవడానికి మీకు ఈ దేశాన్ని ఇచ్చారు. అయితే మీలో ధృడమైనవారు, యుద్ధానికి సిద్ధపడినవారు ఇతర ఇశ్రాయేలీయులకు ముందుగా నది దాటాలి.

  15. అయితే యెహోవా మీకు విశ్రాంతి ఇచ్చినట్టు మీ సోదరులకును విశ్రాంతి ఇచ్చేవరకు, అంటే యొర్దాను అవతల మీ దేవుడైన యెహోవా వారికి ఇస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకునేవరకు మీ భార్యలు, మీ పిల్లలు మీ పశువులు నేను మీకిచ్చిన పట్టణాల్లోనే ఉండాలి. ఆ తర్వాత నేను మీకు ఇచ్చిన స్వాస్థ్యాలకు ప్రతి ఒక్కరు తిరిగి వెళ్లవచ్చు.”

  16. Until the LORD have given rest unto your brethren, as well as unto you, and until they also possess the land which the LORD your God hath given them beyond Jordan: and then shall ye return every man unto his possession, which I have given you.

  17. మీరు యొర్దాను నది దాటిన తర్వాత, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రాల వారు గెరిజీము పర్వతం మీద నిలబడి ప్రజలను దీవించాలి.

  18. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాల వారు ఏబాలు పర్వతం మీద నిలబడి, శాపాలు పలకాలి.

  19. “రూబేను చనిపోకుండ బ్రతికి ఉండును గాక, అతని ప్రజల సంఖ్య తగ్గకుండును గాక.”

  20. యూదా గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా, యూదా మొరను వినండి; అతని ప్రజల దగ్గరకు అతన్ని చేర్చండి. అతడు తన చేతులతో తన కోసం పోరాడేలా, అతని శత్రువులకు వ్యతిరేకంగా అతనికి సహాయంగా ఉండండి!”

  21. లేవీ గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా, మీ తుమ్మీము, ఊరీము మీ నమ్మకమైన సేవకునికి చెందినవి. మస్సాలో మీరతనిని పరీక్షించారు; మెరీబా నీళ్ల దగ్గర అతనితో మీరు వాదించారు.

  22. అతడు తన తండ్రి తల్లి గురించి చెబుతూ, ‘నేను వారిని చూడలేదు’ అతడు తన సోదరులను గుర్తించలేదు తన సొంత పిల్లలను అంగీకరించలేదు. కాని అతడు నీ మాట గమనించాడు నీ నిబంధనను కాపాడాడు.

  23. అతడు యాకోబుకు నీ కట్టడలను ఇశ్రాయేలీయులకు నీ ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు, అతడు మీ ఎదుట ధూపం వేస్తాడు, మీ బలిపీఠం మీద దహనబలులు అర్పిస్తాడు.

  24. యెహోవా, అతని సేవను దీవించండి, అతని చేతి పనులను బట్టి సంతోషించండి. అతనికి వ్యతిరేకంగా లేచినవారిని కొట్టండి, అతని శత్రువులను తిరిగి లేవనంతగా కొట్టండి.”

  25. బెన్యామీను గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవాకు ప్రియమైనవాడు ఆయనలో క్షేమంగా ఉండును గాక, ఎందుకంటే రోజంతా ఆయన రక్షణగా ఉంటారు, యెహోవా ప్రేమించేవాడు ఆయన భుజాల మధ్య ఉంటాడు.”