కంటెంట్‌కు వెళ్లండి

The Tribes of Israel గురించి బైబిల్ వచనాలు

241 వచనాలు · 21 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యోసేపు గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా అతని భూమిని ఆకాశం నుండి కురిసే శ్రేష్ఠమైన మంచుతో క్రింద ఉన్న లోతైన జలాలతో దీవించును గాక;

  2. సూర్యుని వలన కలిగే ఉత్తమమైన ఫలాలతో చంద్రుడు ఫలింపచేసే శ్రేష్ఠమైన ఫలాలతో;

  3. పురాతన పర్వతాల శ్రేష్ఠమైన వాటితో శాశ్వత కొండల శ్రేష్ఠమైన పంటతో;

  4. భూమి ఇచ్చే ప్రశస్తమైన పదార్థాలతో వాటి సమృద్ధితో మండుతున్న పొదలో నివసించే ఆయన దయతో దీవించును గాక. ఇవన్నీ యోసేపు తలపై ఉండును గాక, అతని సోదరుల మధ్యలో యువరాజు నుదుటి మీద ఉండును గాక.

  5. ప్రభావంలో అతడు మొదట పుట్టిన కోడెలాంటి వాడు; అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. వాటితో అతడు జనులను, భూమి అంచులో ఉన్నవారిని కూడా కుమ్ముతాడు. ఎఫ్రాయిముకు చెందిన పదివేలమంది అలాంటివారు, మనష్షేకు చెందిన వేలమంది అలాంటివారు.”

  6. జెబూలూను గురించి అతడు ఇలా అన్నాడు: “జెబూలూనూ, నీవు బయటకు వెళ్లునప్పుడు, సంతోషించు, ఇశ్శాఖారూ, నీవు నీ గుడారాల్లో సంతోషించు.

  7. వారు జనులను పర్వతం దగ్గరకు పిలుస్తారు అక్కడ నీతి బలులు అర్పిస్తారు; వారు సముద్రాల సమృద్ధి మీద ఇసుకలో దాగి ఉన్న నిధుల మీద విందు చేస్తారు.”

  8. గాదు గురించి అతడు ఇలా అన్నాడు: “గాదు దేశాన్ని విశాలం చేసినవారు ధన్యులు! గాదు అక్కడ సింహంలా నివసిస్తాడు, చేతిని గాని నడినెత్తిని చీల్చివేస్తాడు.

  9. అతడు తన కోసం శ్రేష్ఠమైన భాగాన్ని ఎంచుకున్నాడు; నాయకుని భాగం అతని కోసం ఉంచబడుతుంది. ప్రజల పెద్దలు సమావేశమైనప్పుడు యెహోవా యొక్క నీతియుక్తమైన చిత్తాన్ని, ఇశ్రాయేలీయు గురించి ఆయన తీర్పులను, అతడు అమలుచేస్తాడు.”

  10. దాను గురించి అతడు ఇలా చెప్పాడు: “దాను గోత్రం సింహం పిల్లలాంటిది, బాషాను నుండి దూకుతుంది.”

  11. నఫ్తాలి గురించి అతడు ఇలా అన్నాడు: “నఫ్తాలి యెహోవా దయతో తృప్తి చెంది ఆయన దీవెనలతో నింపబడ్డాడు; దక్షిణం నుండి సముద్రం వరకు అతడు స్వాధీనం చేసుకుంటాడు.”

  12. ఆషేరు గురించి అతడు ఇలా అన్నాడు: “కుమారులలో ఆషేరు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు; అతడు తన సోదరుల దయను పొందును గాక. అతడు తన పాదాలను నూనెలో ముంచును గాక.

  13. నీ ద్వారపు గడియలు ఇనుపవి, ఇత్తడివి నీ బలం నీ రోజులకు సమానంగా ఉంటుంది.

  14. “యెషూరూను దేవుని పోలినవారు ఎవరు లేరు, ఆకాశవాహనుడై వచ్చి నీకు సహాయం చేయడానికి ఆయన ఆకాశం గుండా వస్తారు, తన తేజస్సుతో మేఘాలపై వస్తారు.

  15. శాశ్వతమైన దేవుడు నీకు ఆశ్రయం, నిత్యమైన హస్తాలు నీ క్రింద ఉన్నాయి. ‘వారిని నాశనం చెయ్యండి!’ అంటూ ఆయన నీ శత్రువులను నీ ఎదుట నుండి తరిమివేస్తారు.

  16. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా నివసిస్తారు; ధాన్యం క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశంలో యాకోబు ఊట క్షేమంగా ఉంటుంది, అక్కడ ఆకాశం మంచు కురిపిస్తుంది.

  17. ఇశ్రాయేలూ, మీరు ధన్యులు! యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారు ఎవరు? ఆయన మీకు డాలు, సహాయకుడు మీ మహిమగల ఖడ్గము. మీ శత్రువులు మీ ఎదుట భయపడతారు; మీరు వారి వీపుపై త్రొక్కుతారు.”

  18. “ ‘ఉదయాన్నే గోత్రం వెంబడి గోత్రం మీరు హాజరు కావాలి. అప్పుడు యెహోవా ఎంచుకున్న గోత్రం వంశాలవారిగా ముందుకు వస్తుంది; యెహోవా ఎంచుకున్న వంశం కుటుంబాల ప్రకారం ముందుకు వస్తుంది; యెహోవా ఎంచుకున్న కుటుంబం యొక్క పురుషులు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వస్తారు.

  19. రూబేనీయుల సరిహద్దు యొర్దాను నది తీరము. ఈ పట్టణాలు, వాటి గ్రామాలు రూబేనీయులకు వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఇవ్వబడ్డాయి.

  20. గాదు గోత్రానికి దాని వంశాల ప్రకారం మోషే ఇచ్చింది ఇదే:

  21. యాజెరు ప్రాంతం, గిలాదు పట్టణాలన్ని, అమ్మోనీయుల దేశంలో సగం అంటే రబ్బాకు సమీపంలో ఉన్న అరోయేరు వరకు;

  22. హెష్బోను నుండి రామాత్ మిస్పే, బెతోనీము వరకు, మహనయీము నుండి దెబీరు ప్రాంతం వరకు;

  23. లోయలో, బేత్-హారాము, బేత్-నిమ్రా, సుక్కోతు, సాఫోను, హెష్బోను రాజైన సీహోను యొక్క ప్రాంతం (యొర్దాను తూర్పు వైపు, కిన్నెరెతు సముద్రం చివరి వరకు ఉన్న ప్రాంతం).

  24. ఈ పట్టణాలు, వాటి గ్రామాలు గాదీయులకు వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఇవ్వబడ్డాయి.

  25. మోషే మనష్షే యొక్క అర్థగోత్రానికి, అంటే మనష్షే వంశస్థుల సగం కుటుంబానికి, దాని వంశాల ప్రకారం ఇచ్చింది ఇదే: