కంటెంట్‌కు వెళ్లండి

The Tribes of Israel గురించి బైబిల్ వచనాలు

241 వచనాలు · 21 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. షెమీదా ద్వార, షెమీదయీయుల వంశం; హెఫెరు ద్వార, హెఫెరీయుల వంశము.

  2. (హెఫెరు కుమారుడైన సెలోఫెహాదుకు కుమారులు లేరు; అతనికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు, వారి పేర్లు, మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా.)

  3. ఇవి మనష్షే వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 52,700.

  4. ఎఫ్రాయిం వారసులు వారి వంశాల ప్రకారం: షూతలహు ద్వార, షూతలహీయుల వంశం; బేకరు ద్వార, బేకరీయల వంశం; తహను ద్వార, తహనీయుల వంశము.

  5. వీరు షూతలహు వారసులు: ఏరాను ద్వార, ఏరానీయుల వంశము.

  6. ఇవి ఎఫ్రాయిం వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 32,500.

  7. బెన్యామీను వారసులు వారి వంశాల ప్రకారం: బేల ద్వార, బేలీయుల వంశం; అష్బేలు ద్వార, అష్బేలీయుల వంశం; అహీరాము ద్వార, అహీరామీయుల వంశం;

  8. షూఫాము ద్వార, షూఫామీయుల వంశం; హుఫాము ద్వార, హుఫామీయుల వంశము.

  9. అర్దు, నయమానుల ద్వార కలిగిన బేల వారసులు: అర్దు ద్వార, అర్దీయుల వంశం; నయమాను ద్వార, నయమానీయుల వంశము.

  10. ఇవి బెన్యామీను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 45,600.

  11. దాను వారుసులు వారి వంశాల ప్రకారం: షూహాము ద్వార, షూహామీయుల వంశము.

  12. వారంతా షూహామీయుల వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,400.

  13. ఆషేరు వారసులు వారి వంశాల ప్రకారం: ఇమ్నా ద్వార, ఇమ్నీయుల వంశం; ఇష్వీ ద్వార, ఇష్వీయుల వంశం; బెరీయా ద్వార, బెరీయుల వంశం;

  14. బెరీయా వారసుల ద్వార వచ్చినవారు: హెబెరు ద్వార, హెబెరీయుల వంశం; మల్కీయేలు ద్వార, మల్కీయేలీయుల వంశము.

  15. ఆషేరుకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు శెరహు.

  16. ఇవి ఆషేరు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 53,400.

  17. నఫ్తాలి వారసులు వారి వంశాల ప్రకారం: యహజీయేలు ద్వార, యహజీయేలీయుల వంశం; గూనీ ద్వార, గూనీయుల వంశం;

  18. యేజెరు ద్వార, యెజెరీయుల వంశం; షిల్లేము ద్వార, షిల్లేమీయుల వంశము.

  19. ఇవి నఫ్తాలి వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 45,400.

  20. లెక్కించబడిన ఇశ్రాయేలు పురుషుల మొత్తం సంఖ్య 6,01,730.

  21. ఇశ్రాయేలు యొక్క ప్రతి గోత్రం నుండి వేయిమంది పురుషులను యుద్ధానికి పంపండి” అని చెప్పాడు.

  22. మోషే రూబేనీయులతో, గాదీయులతో, “మీరు ఇక్కడ కూర్చుని ఉండగా మీ తోటి ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్లాలా?” అని అడిగాడు.

  23. “యెహోవా ఇచ్చిన దేశానికి ప్రయాణమై వెళ్తున్న ఇశ్రాయేలీయులను ఎందుకు నిరాశపరుస్తారు?

  24. మీ తండ్రులను కాదేషు బర్నియాకు స్థలాన్ని చూసి రమ్మని పంపితే వారు ఇలాగే చేశారు.

  25. వారు ఎష్కోలు లోయలోకి వెళ్లి తిరిగివచ్చి, యెహోవా వారికిచ్చిన వాగ్దాన భూమికి ప్రవేశించకుండా ఇశ్రాయేలీయులను నిరాశ పరిచారు.