Skip to content

Thanksgiving గురించి బైబిల్ వచనాలు

93 వచనాలు · 57 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పటికీ, ఏ ఉపదేశానికైతే మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి మీరు హృదయమంతటితో లోబడ్డారు. కాబట్టి దేవునికి వందనాలు.

  2. కాని మరొక నియమం నాలో ఉన్నట్లు నాకు కనబడుతుంది. అది నా మనస్సులోని నియమంతో పోరాడుతూ నాలో పని చేస్తున్న పాపనియమానికి నన్ను బందీగా చేస్తుంది.

  3. నేను ఎంత దౌర్భాగ్యుడిని! మరణానికి బందీగా ఉన్న నా శరీరం నుండి నన్ను ఎవరు రక్షించగలరు?

  4. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నాకు విడుదలను ఇచ్చే దేవునికి వందనాలు! అయితే నా మనస్సులో నేను దేవుని ధర్మశాస్త్రానికి దాసుడను, కాని నాకున్న పాప స్వభావంలో నేను పాపనియమానికి దాసుడను.

  5. ఒక రోజును మంచి రోజుగా భావించేవారు ప్రభువు కొరకే భావిస్తున్నారు. మాంసాన్ని తినేవారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు కాబట్టి వారు ప్రభువు కొరకే తింటున్నారు. తిననివారు కూడా ప్రభువు కొరకే తినడం మాని, దేవునికి కృతజ్ఞతలను చెల్లిస్తున్నారు.

  6. మనలో ఎవరు కేవలం తన కోసం మాత్రమే జీవించరు, తన కోసం మాత్రమే చావరు.

  7. క్రీస్తు యేసులో దేవుని కృప మీకు ఇవ్వబడింది కాబట్టి మీ కోసం నా దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

  8. అయితే దేవునికి కృతజ్ఞతలు! మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని ఇచ్చారు.

  9. మీ ప్రార్థనల ద్వారా మాకు సహాయం చేస్తున్నారు, కాబట్టి వాటిలో అనేక ప్రార్థనలకు జవాబుగా దేవుడు మామీద దయ చూపినందుకు మా పక్షంగా అనేకులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు.

  10. కాబట్టి ఆయన మా ద్వారా ప్రతి స్థలంలో క్రీస్తును గురించిన జ్ఞానపు సువాసన వ్యాపింపచేస్తూ, ఆయనలో మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సాహంతో ముందుకు నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు.

  11. మీ పట్ల నాకున్న శ్రద్ధనే తీతు హృదయంలో కూడా కలిగించిన దేవునికి కృతజ్ఞతలు.

  12. మీరు ప్రతి సమయంలో ధారాళంగా ఇవ్వడానికి మీరు అన్ని రకాలుగా సంపన్నులు అవుతారు. మీ దాతృత్వం బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడతాయి.

  13. చెప్పశక్యం కాని ఆయన వరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు.

  14. మీ గురించి మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ కోసం ప్రార్థిస్తున్నాను.

  15. ఎల్లప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మన తండ్రియైన దేవునికి అన్నిటి కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.

  16. మీరు గుర్తుకొచ్చినప్పుడెల్లా నేను దేవునికి వందనాలు చెప్తున్నాను.

  17. మీ అందరి నిమిత్తం చేసే నా ప్రతి ప్రార్థనలో నేను ఎప్పుడు సంతోషిస్తూ ప్రార్థిస్తున్నాను.

  18. మొదటి నుండి ఇప్పటివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారిగా ఉండడం చూసి,

  19. దేన్ని గురించి వేదన పడకండి, కాని ప్రతి విషయంలో ప్రార్థనావిజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి.

  20. క్రీస్తు యేసులో మీరు కలిగి ఉన్న విశ్వాసం గురించి, దేవుని ప్రజలందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ గురించి మేము విన్నాము, కాబట్టి మేము మీ కోసం ప్రార్థన చేసినప్పుడెల్లా, మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.

  21. Since we heard of your faith in Christ Jesus, and of the love which ye have to all the saints,

  22. మీ దగ్గరకు వచ్చిన సువార్త అనే సత్య బోధలో మీరు విన్న, పరలోకంలో మీ కోసం దాచి ఉంచిన నిరీక్షణ నుండి విశ్వాసం ప్రేమ కలిగాయి.

  23. అదే విధంగా, మీరు సువార్తను విని, దేవుని కృప గురించి నిజంగా గ్రహించిన రోజు నుండి అది మీ మధ్యలో ఫలించి వృద్ధి చెందుతున్న ప్రకారమే, ఈ సువార్త లోకమంతా ఫలిస్తూ వృద్ధిచెందుతుంది.

  24. మీకు బోధించబడిన ప్రకారం విశ్వాసంలో స్థిరపడుతూ, మరి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ, ఆయనలో మీరు జీవించడం కొనసాగించండి.

  25. ఒకే శరీరంలోని అవయవాల వలె, సమాధానం కోసం మీరు పిలువబడ్డారు, కాబట్టి క్రీస్తు యొక్క సమాధానం మీ హృదయాలను పరిపాలించనివ్వండి. అలాగే కృతజ్ఞత కలిగి ఉండండి.