Thanksgiving గురించి బైబిల్ వచనాలు: Ministers appointed to offer, in public
Ministers appointed to offer, in public గురించి వచనాలు
తర్వాత అతడు యెహోవా మందసం దగ్గర సేవ చేయడానికి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను కీర్తించడానికి స్తుతించడానికి, కృతజ్ఞతలు అర్పించడానికి లేవీయులలో కొంతమందిని నియమించాడు.
ఆ రోజు దావీదు యెహోవాను స్తుతించడానికి మొదటిసారిగా ఆసాపు, అతని తోటివారికి ఇలా పాడమని చెప్పాడు:
వారు ప్రతిరోజు ఉదయం, సాయంకాలం నిలబడి యెహోవాను స్తుతించాలి. వారు సాయంకాలంలో, సబ్బాతు దినాల్లో, అమావాస్యల్లో, నియమించబడిన పండుగల్లో, యెహోవాకు దహనబలులు అర్పించే సమయాలన్నిటిలో వారు ఆయనను స్తుతించాలి. వారికి నియమించబడిన విధానం ప్రకారం క్రమంగా యెహోవా సముఖంలో సేవ చేయాలి.
హిజ్కియా ఎవరి సేవలను వారు జరిగించడానికి యాజకులను లేవీయులను వారి వారి వరుసల ప్రకారంగా నియమించాడు; దహనబలులు సమాధానబలులు అర్పించడానికి, ఇతర సేవలు జరిగించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, యెహోవా నివాసస్థలం యొక్క ద్వారాల దగ్గర స్తుతులు చెల్లించడానికి హిజ్కియా యాజకులను లేవీయులను నియమించాడు.