కంటెంట్‌కు వెళ్లండి

Thanksgiving గురించి బైబిల్ వచనాలు: For the grace bestowed on others

8 వచనాలు · 57 కోణాలు

For the grace bestowed on others గురించి వచనాలు

  1. క్రీస్తు యేసులో దేవుని కృప మీకు ఇవ్వబడింది కాబట్టి మీ కోసం నా దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

  2. మీరు గుర్తుకొచ్చినప్పుడెల్లా నేను దేవునికి వందనాలు చెప్తున్నాను.

  3. మీ అందరి నిమిత్తం చేసే నా ప్రతి ప్రార్థనలో నేను ఎప్పుడు సంతోషిస్తూ ప్రార్థిస్తున్నాను.

  4. మొదటి నుండి ఇప్పటివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారిగా ఉండడం చూసి,

  5. క్రీస్తు యేసులో మీరు కలిగి ఉన్న విశ్వాసం గురించి, దేవుని ప్రజలందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ గురించి మేము విన్నాము, కాబట్టి మేము మీ కోసం ప్రార్థన చేసినప్పుడెల్లా, మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.

  6. Since we heard of your faith in Christ Jesus, and of the love which ye have to all the saints,

  7. మీ దగ్గరకు వచ్చిన సువార్త అనే సత్య బోధలో మీరు విన్న, పరలోకంలో మీ కోసం దాచి ఉంచిన నిరీక్షణ నుండి విశ్వాసం ప్రేమ కలిగాయి.

  8. అదే విధంగా, మీరు సువార్తను విని, దేవుని కృప గురించి నిజంగా గ్రహించిన రోజు నుండి అది మీ మధ్యలో ఫలించి వృద్ధి చెందుతున్న ప్రకారమే, ఈ సువార్త లోకమంతా ఫలిస్తూ వృద్ధిచెందుతుంది.