Skip to content

Servants గురించి బైబిల్ వచనాలు

291 వచనాలు · 147 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “ ‘పరిశుద్ధ అర్పణను యాజక కుటుంబ సభ్యులు తప్ప బయటి వారెవరూ అంటే యాజకుని అతిథి గాని అతని ఇంట్లో జీతగాడు గాని తినకూడదు.

  2. సబ్బాతు సంవత్సరంలో భూమి దానికదిగా ఏ పంట మీకు, మీ దాసులకు, దాసీలకు, మీ మధ్య నివసించే కూలి పనివారికి, అలాగే మీ మధ్య నివసించే విదేశీయులకు ఆహారమవుతుంది,

  3. యాభైయవ సంవత్సరాన్ని ప్రతిష్ఠితం చేసి, దేశమంతటా దాని నివాసులందరికి స్వేచ్ఛను ప్రకటించండి. ఇది మీకు యాభైయవ వార్షికోత్సవం అవుతుంది; మీలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబ స్వాస్థ్యానికి, మీ సొంత కుటుంబానికి తిరిగి వెళ్లాలి.

  4. “ ‘మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదలుగా మారి తమను తాము మీకు అమ్ముకున్నట్లయితే, వారితో బానిసలుగా పని చేయించవద్దు.

  5. వారిని మీ మధ్య జీతగాలుగా లేదా తాత్కాలిక నివాసితులుగా పరిగణించాలి; యాభైయవ వార్షికోత్సవం వరకు, వారు మీ కోసం పని చేస్తారు.

  6. అప్పుడు వారు, వారి పిల్లలు విడవబడాలి, వారు తమ కుటుంబాల దగ్గరకు, వారి పూర్వికుల స్వాస్థ్యానికి వెళ్తారు.

  7. “ ‘మీ చుట్టూ ఉన్న జనాంగాలలో నుండి దాసులు, దాసీలు రావాలి; వారి నుండి బానిసలను కొనవచ్చు.

  8. మీ మధ్యనున్న తాత్కాలిక నివాసులు, మీ దేశంలో పుట్టిన వారి కుటుంబాల సభ్యులను మీరు కొనవచ్చు. వారు మీ సొత్తవుతారు.

  9. మీరు వారిని మీ పిల్లలకు వారసత్వపు ఆస్తిగా ఇవ్వవచ్చు, వారిని జీవితకాల బానిసలుగా చేయవచ్చు, కానీ మీరు మీ తోటి ఇశ్రాయేలీయులను కఠినంగా పాలించకూడదు.

  10. “ ‘మీ మధ్య నివాసమున్న పరదేశి ధనవంతుడైతే, అతని దగ్గర ఉన్న మీ స్వదేశీయుడు బీదవాడై ధనవంతుని లేదా అతని కుటుంబ సభ్యునికి అమ్ముడు పోతే,

  11. వారు తమను తాము అమ్మిన తర్వాత విడుదల హక్కును కలిగి ఉంటారు. వారి బంధువుల్లో ఒకరు వారిని విడిపించవచ్చు:

  12. మామ లేదా ఒక బంధువు లేదా వారి కుటుంబంలోని రక్తసంబంధి ఎవరైనా వారిని విడిపించవచ్చు. లేదా వారు అభివృద్ధి చెందితే, వారు తమను తాము విడిపించుకోవచ్చు.

  13. వారు, వారిని కొనుక్కున్న వ్యక్తి కలిసి అమ్ముడు పోయిన సంవత్సరం నుండి యాభైయవ వార్షికోత్సవం వరకు మిగతా కాలమెంతో లెక్కించాలి. వారి విడుదల యొక్క వెల ఆ సంవత్సరాల లెక్కను బట్టి, జీతగాని వెల ప్రకారం ఉంటుంది.

  14. ఇంకా చాలా సంవత్సరాలు మిగిలి ఉంటే, వాటి ప్రకారం తమను అమ్ముకున్న వెలలో ఎక్కువ వంతు తమ విడుదలకు మళ్ళీ చెల్లించాల్సి ఉంటుంది.

  15. యాభైయవ వార్షికోత్సవం వరకు మిగతా సంవత్సరాలు కొన్ని మాత్రమే ఉంటే తమ లెక్క చూసుకొని వారి విడుదల వెల చెల్లించాలి.

  16. వారిని జీతగాల్లలా ప్రతి సంవత్సరం పరిగణించాలి; వారు ఎవరికైతే సేవ చేస్తారో వారు, కఠినంగా వ్యవహరించకుండా మీరు చూసుకోవాలి.

  17. “ ‘ఒకవేళ ఈ విధానాల్లో ఎవరైనా విడిపించబడకపోయినా, వారు, వారి పిల్లలు యాభైయవ వార్షికోత్సవంలో విడిపించబడాలి,

  18. ఎందుకంటే ఇశ్రాయేలీయులు నా దాసులుగా ఉన్నారు, నేను ఈజిప్టు దేశం నుండి వారిని తీసుకువచ్చిన నా దాసులు. నేను మీ దేవుడనైన యెహోవాను.

  19. మీ పొరుగువాని భార్యను మీరు ఆశించకూడదు. మీ పొరుగువాని ఇంటిని గాని స్థలాన్ని గాని అతని దాసుని గాని, దాసిని గాని, అతని ఎద్దును గాని గాడిదను గాని, మీ పొరుగువానికి చెందిన దేన్ని మీరు ఆశించకూడదు.”

  20. అయితే మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలంలోనే మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో ఉండే లేవీయులు, అందరు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో తిని, మీ చేతి పనులన్నిటిని బట్టి మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి.

  21. మీ ప్రజల్లో హెబ్రీ పురుషులే గాని స్త్రీలే గాని మీకు అమ్ముకుని ఆరు సంవత్సరాలు మీకు సేవ చేస్తే, ఏడవ సంవత్సరంలో మీరు వారిని స్వేచ్ఛగా వెళ్లనివ్వాలి.

  22. మీరు వారిని విడుదల చేసినప్పుడు, వారిని వట్టి చేతులతో పంపకూడదు.

  23. మీ మందలో నుండి మీ నూర్పిడి కళ్ళం నుండి, మీ ద్రాక్ష గానుగ తొట్టి నుండి వారికి ధారాళంగా ఇచ్చి పంపాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన దానికి తగినట్టుగా వారికి ఇవ్వాలి.

  24. కాని ఒకవేళ దాసుడు మీ దగ్గర సంతోషంగా ఉండి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్న కారణంగా, “నేను మిమ్మల్ని విడిచి వెళ్లను” అని అంటే,

  25. మీరు కదురు తీసుకుని, వాని చెవిని తలుపుకు ఆనించి తలుపు లోనికి దిగేలా కదురుతో గుచ్చాలి. అప్పుడు వాడు మీకు జీవితకాల దాసునిగా ఉంటాడు. మీ దాసికి కూడా అలాగే చేయాలి.