Skip to content

Servants గురించి బైబిల్ వచనాలు

291 వచనాలు · 147 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఒకవేళ మీ దాసులలో ఎవరి దగ్గరైనా దొరికితే, వాడు చస్తాడు; మిగిలినవారం మా ప్రభువా బానిసలమవుతాం” అని అన్నారు.

  2. ఫరో సేవకులలో యెహోవా మాట విని భయపడినవారు తమ బానిసలను తమ పశువులను తమ ఇళ్ళకు త్వరపడి రప్పించారు.

  3. అప్పుడు మీ అధికారులైన వీరందరు నా దగ్గరకు వచ్చి నా ఎదుట తలవంచి, ‘నీవు, నిన్ను అనుసరించే ప్రజలందరు వెళ్లండి’ అని చెప్తారు. అప్పుడు నేను వెళ్తాను” అని చెప్పి మోషే తీవ్రమైన కోపంతో ఫరో దగ్గర నుండి వెళ్లిపోయాడు.

  4. మీరు వెండి పెట్టి కొన్న బానిసకు మీరు సున్నతి చేసిన తర్వాత అతడు దీనిని తినవచ్చు,

  5. తాత్కాలిక నివాసులు కాని కూలికి వచ్చినవారు కాని దీనిని తినకూడదు.

  6. కాని ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు సబ్బాతు దినము. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, మీరు గాని, మీ కుమారుడు లేదా కుమార్తె గాని, మీ దాసదాసీలు గాని, మీ పశువులు గాని, మీ పట్టణాల్లో ఉంటున్న విదేశీయులు గాని ఏ పని చేయకూడదు.

  7. మీ పొరుగువాని ఇంటిని మీరు ఆశించకూడదు. మీ పొరుగువాని భార్యను గాని, అతని దాసుని గాని దాసిని గాని, అతని ఎద్దును గాని గాడిదను గాని, మీ పొరుగువానికి చెందిన దేన్ని మీరు ఆశించకూడదు.”

  8. “ఒకవేళ నీవు హెబ్రీ దాసులను కొంటే, వారు ఆరు సంవత్సరాలు నీకు సేవ చేయాలి. ఏడవ సంవత్సరంలో, ఏమి చెల్లించనవసరం లేకుండానే, వారు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు.

  9. అతడు వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చియుంటే ఒంటరిగానే వెళ్లిపోవాలి; ఒకవేళ అతడు వచ్చినప్పుడు అతని భార్యతో వచ్చియుంటే, ఆమె తన భర్తతో వెళ్లిపోవాలి.

  10. ఒకవేళ వాని యజమాని వానికి భార్యను ఇస్తే ఆమె వానికి కుమారులను లేదా కుమార్తెలను కంటే, వాడు మాత్రమే స్వతంత్రునిగా వెళ్లాలి.

  11. “కాని ఒకవేళ దాసుడు, ‘నాకు నా యజమాని మీద, నా భార్య మీద నా పిల్లల మీద ప్రేమ ఉంది కాబట్టి నేను స్వతంత్రునిగా వెళ్లను’ అని అంటే,

  12. వాని యజమాని వానిని దేవుని ఎదుటకు తీసుకురావాలి. వాని యజమాని వానిని తలుపు దగ్గరకు గాని ద్వారబంధం దగ్గరకు గాని తీసుకెళ్లి వాని చెవిని కదురుతో గుచ్చాలి. అప్పుడు వాడు వాని యజమానికి జీవితకాల దాసునిగా ఉంటాడు.

  13. “ఒకవేళ ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మివేస్తే, ఆమె ఒక దాసుడు వెళ్లినట్లుగా స్వతంత్రంగా వెళ్లకూడదు.

  14. కావాలని ఆమెను ఎన్నుకున్న యజమానిని ఆమె సంతోషపెట్టలేకపోతే, అతడు ఆమెను విడిపించబడనివ్వాలి. అతడు ఆమెను విదేశీయులకు అమ్మడానికి అతనికి అధికారం లేదు, ఎందుకంటే అతడు ఆమె నమ్మకాన్ని వమ్ముచేశాడు.

  15. ఒకవేళ అతడు ఆమెను తన కుమారుని కోసం ఎంపికచేస్తే, ఆమెకు ఒక కుమార్తెకు ఇచ్చే హక్కు ఇవ్వాలి.

  16. అతడు మరొక స్త్రీని పెళ్ళి చేసుకుంటే, మొదటి భార్యకు ఆహారం, బట్టలు, దాంపత్య హక్కులు లేకుండ చేయకూడదు.

  17. అతడు ఈ మూడింటిని ఆమెకు సమకూర్చకపోతే, ఆమె డబ్బు ఏమి చెల్లించకుండ, స్వతంత్రురాలిగా వెళ్లిపోవచ్చు.

  18. “ఎవరైనా ఎవరినైనా ఎత్తుకెళ్లిన తర్వాత ఒకవేళ అమ్మివేయబడినా లేదా వారి దగ్గరే ఉన్నా, ఎత్తుకెళ్లిన వారికి మరణశిక్ష విధించబడాలి.

  19. “ఎవరైనా తమ దాసుని గాని దాసిని గాని కర్రతో కొట్టినప్పుడు ఒకవేళ వారు చనిపోతే కొట్టినవారు శిక్షించబడాలి,

  20. కాని ఒకవేళ వారు ఒకటి లేదా రెండు రోజుల్లో కోలుకుంటే, ఆ దాసులు వారి ఆస్తియే కాబట్టి వారు శిక్షించబడనక్కర్లేదు.

  21. “ఒక యజమాని కొట్టడం వలన అతని దాసునికి గాని దాసికి గాని కన్ను పోతే కంటికి కలిగిన నష్టాన్ని బట్టి ఆ యజమాని వారిని స్వతంత్రంగా పోనివ్వాలి.

  22. యజమాని తన దాసునిది గాని దాసిది గాని పన్ను ఊడగొడితే ఆ పంటికి బదులుగా వారిని స్వతంత్రంగా పోనివ్వాలి.

  23. ఎద్దు దాసుని గాని దాసిని గాని పొడిస్తే, దాని యజమాని ముప్పై షెకెళ్ళ వెండిని వారి యజమానికి చెల్లించాలి. ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి.

  24. కాని ఒకవేళ సూర్యోదయం తర్వాత ఇది జరిగితే, కొట్టినవాడు రక్తం కారిన దాన్ని బట్టి అపరాధి అవుతాడు. “ఎవరైనా దొంగతనం చేస్తే తప్పక నష్టపరిహారం చెల్లించాలి, కాని వాని దగ్గర ఏమిలేకపోతే, వారి దొంగతనానికి చెల్లించడానికి వారు అమ్మివేయబడాలి.

  25. “ ‘పొరుగువారిని పీడించకండి లేదా దోచుకోకండి. “ ‘కూలివాళ్ళకు ఇవ్వాల్సిన కూలి మరుసటిరోజు ఉదయం వరకు మీ దగ్గర నిల్వ ఉంచుకోకూడదు.