కంటెంట్‌కు వెళ్లండి

Servants గురించి బైబిల్ వచనాలు: To be anxious for their welfare

6 వచనాలు · 147 కోణాలు

To be anxious for their welfare గురించి వచనాలు

  1. సేవకులలో ఒకడు నాబాలు భార్యయైన అబీగయీలుతో, “అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానికి శుభాలు చెప్పమని దూతలను పంపితే అతడు వారిని అవమానించి మాట్లాడాడు.

  2. అయితే ఆ మనుష్యులు మా పట్ల చాలా మంచిగా ఉన్నారు. మేము పొలంలో వారి మధ్య ఉన్నంత కాలం మాకు ఏ హాని చేయలేదు, మేమేమి పోగొట్టుకోలేదు.

  3. వారి దగ్గర మేము గొర్రెలను మేపుతున్నంత కాలం వారు రాత్రి పగలు మా చుట్టూ ఒక గోడలా ఉన్నారు.

  4. ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే మా యజమానికి అతని ఇంటివారికందరికి కీడు పొంచి ఉంది. అతడు దుర్మార్గుడు, అతనితో ఎవరూ మాట్లాడలేరు” అని చెప్పాడు.

  5. అరామీయులు గుంపులు గుంపులుగా ఇశ్రాయేలు మీదికి దోపిడికి వెళ్లేవారు, ఒకసారి వారు ఒక చిన్నదాన్ని బందీగా తీసుకువచ్చారు, ఆమె నయమాను భార్యకు పరిచారం చేసేది.

  6. ఆమె తన యజమానురాలితో, “నా యజమాని సమరయలో ఉన్న ప్రవక్తను కలిస్తే బాగుండేది! ఆయన అతని కుష్ఠురోగాన్ని పూర్తిగా నయం చేస్తాడు” అని చెప్పింది.